E-Paper

ఘనంగా జీబీటీ సీజన్-3 కర్టెన్ రైజర్.. మెగా ఈవెంట్ ఎప్పుడంటే?

ఘనంగా జీబీటీ సీజన్-3 కర్టెన్ రైజర్.. మెగా ఈవెంట్ ఎప్పుడంటే?
Advertisement

Hyderabad:మహిళా సాధికారత, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాల పెంపుదలకు వేదికగా నిలుస్తున్న గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ సీజన్ 3 కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని జూలై 12వ తేదీన హైదరాబాదులోని దశపల్ల హోటల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

జూలై 12న గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ సీజన్ 3 కర్టెన్ రైజర్ ఈవెంట్..

ఈ కార్యక్రమంలో పలువురు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, బ్యూటీ క్వీన్స్, ప్రముఖ మోడల్స్, ఫ్యాషన్ డిజైనర్లు, ఫ్యాషన్ అలాగే బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సామాజిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, కార్పొరేట్ భాగస్వాములు, విశిష్ట అతిధులు పాల్గొని ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

మహిళ సాధికారతే లక్ష్యం..

Advertisement

మిస్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ – 2022 విజేత, గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ వ్యవస్థాపకురాలు శ్రీమతి సుహాసిని పాండ్యం మాట్లాడుతూ.. “గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ సీజన్ 3 మరో స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి నాంది పలుకుతోంది. మహిళలలో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతోపాటు వారి ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే మా లక్ష్యం. టీం గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ అంకితభావంతో ఈ సీజన్ ను మరింత విజయవంతంగా నిర్వహిస్తుందని పూర్తి నమ్మకం ఉంది. అందరి సహకారంతో ఈ సీజన్ ను చిరస్మరణీయంగా తీర్చిదిద్దుతాం” అంటూ ఆమె తెలిపారు.

ఈ సీజన్ ఘనవిజయం సాధించాలి..

ఇక ఈ గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ సీజన్ 3 కార్యక్రమానికి Prikus Digital స్ట్రాటజిక్ అండ్ డిజిటల్ పార్టనర్ గా వ్యవహరిస్తుండగా.. ఈవెంట్ బ్రాండింగ్ , ప్రమోషన్స్, పబ్లిక్ రిలేషన్స్ నిర్వహణ బాధ్యతలను చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు పీలేరు సర్పంచ్ డాక్టర్ షేక్ హబీబ్ పాషా, ప్రికస్ (Prikus)సీఈవో ప్రమీల్ అర్జున్ , స్కిల్ వేదా ఇన్నోవేషన్ సిటిఓ సందీప్ అవుటపల్లి, వాసవి ఇన్నోవేషన్స్ అధినేత మెహర్ తేజ, ప్రముఖ రైఫిల్ షూటర్ పి భువనేశ్వరి, ప్రికాస్ డిజిటల్ బృందం, గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ టీం సభ్యులు కలసి శ్రీమతి సుహాసిని పాండ్యం కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సీజన్ ఘన విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

also read:Kissik Talks: సోనియా – సిద్ధూ మధ్య బ్రేకప్.. టార్చర్ భరించలేకపోయా !

కొత్త అధ్యాయానికి నాంది..

ఇకపోతే హైదరాబాద్ లో నిర్వహించనున్న ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమంతో గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ సీజన్ 3 కి అధికారికంగా శ్రీకారం చుడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అందం, ఆత్మవిశ్వాసం, ప్రతిభ , వ్యక్తిత్వ వికాసం, మహిళా సాధికారతను ప్రోత్సహించే ఈ వేదిక మరో విజయవంతమైన అధ్యాయానికి నాంది పలుకుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News

పెసరపప్పు vs కందిపప్పు vs శనగపప్పు.. మూడింటిలో ఏది తింటే ఎక్కువ బలం

జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయని టెన్షన్ పడుతున్నారా? ఇంట్లో ఈ చిట్కాలు పాటిస్తే సరి

వైన్ తాగితే ఏం కాదు అనుకుంటున్నారా? 10,000 స్కాన్స్ చూశాక వైద్యులు చెప్పిన ఆ చేదు నిజం తెలిస్తే..

విజయం వైపు నడిపించే స్ఫర్తిదాయక సూక్తులు.. రోజూ చదివితే మీలో కొత్త ఉత్సాహం

కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌తో ఇబ్బందిపడుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే మటుమాయం

నెలజీతాన్ని ‘హ్యాండ్సమ్ సాలరీ’ అని ఎందుకు అంటారు.. ‘బ్యూటిఫుల్’ అని ఎందుకు అనరు? కారణం ఇదే

కేవలం 20 నిమిషాల్లో రాత్రి డిన్నర్ రెడీ.. రుచి, పోషకాలతో 5 హెల్తీ రెసిపీలు

Big Stories

×