E-Paper
Advertisement

విదుర నీతి.. ఈ 4 గుణాలు ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి వస్తుంది.. డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు?

విదుర నీతి.. ఈ 4 గుణాలు ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి వస్తుంది.. డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు?
Advertisement

Vidur Niti Goddess Lakshmi Blessed Homes| ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సిరిసంపదలు, సుఖసంతోషాలు కలకాలం ఉండాలని కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా కుటుంబమంతా సంతోషంగా ఉండాలని ఆశిస్తారు. ఇందుకోసం లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తుంటారు. అయితే హిందూ సంప్రదాయాల ప్రకారం.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంట్లో కొన్ని మంచి అలవాట్లు ఉండాలి. మహాభారత కాలానికి చెందిన మహాత్మ విదురుడు తన నీతుల్లో కుటుంబ జీవనానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను వివరించారు. విదుర నీతి ప్రకారం, కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. మరి ఆ నాలుగు లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.

1. ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి

విదుర నీతి ప్రకారం.. ఇంట్లో పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యవ ఉంటుంది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం, అపరిశుభ్రత ఉన్న ఇళ్లలో సానుకూల వాతావరణం ఉండదు. అందుకే ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. ఇంటి గదులు, వంటగది, పూజగది, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వస్తువులను చిందరవందరగా వేయకుండా క్రమపద్ధతిలో అమర్చుకోవాలి. శుభ్రమైన ఇల్లు కుటుంబ సభ్యులకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని సంప్రదాయ నమ్మకాలున్నాయి.

2. ప్రతిరోజూ భక్తితో పూజలు చేయాలి

Advertisement

హిందూ సంప్రదాయాల్లో ప్రతిరోజూ దేవుడిని పూజించడానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. పూలు సమర్పించడం, దీపారాధన చేయడం, నైవేద్యం పెట్టడం వంటి ఆచారాలను పాటించాలి. ఇలా ప్రతిరోజూ పూజలు చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యుల్లో భక్తి, క్రమశిక్షణ, కృతజ్ఞతాభావం పెరుగుతాయి. ఇలాంటి భక్తిపూర్వక వాతావరణం ఉన్న ఇళ్లపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని నమ్ముతారు.

Also Read: పని చేస్తున్నా గుర్తింపు రావడం లేదా? ఆఫీస్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ ఇలా విజయం సాధించండి

3. తల్లిదండ్రులు, పెద్దలు, మహిళలను గౌరవించాలి

Advertisement

విదుర నీతి ప్రకారం.. ఇంట్లో మహిళలకు, తల్లిదండ్రులకు, పెద్దలకు తగిన గౌరవం ఇవ్వాలి. వారిని ఎప్పుడూ అవమానించకూడదు. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమగా, మర్యాదగా ప్రవర్తించాలి.

పెద్దల అనుభవాలను గౌరవిస్తూ వారి సలహాలను స్వీకరించాలి. మహిళల అభిప్రాయాలకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. కుటుంబంలో పరస్పర గౌరవం, ప్రేమ ఉన్నప్పుడు అనుబంధాలు బలపడతాయి. ఇలాంటి ఇళ్లలో సుఖసంతోషాలు నిలుస్తాయని సంప్రదాయ విశ్వాసం.

Also Read: విదుర నీతి.. జీవితంలో పెద్ద కష్టాలు రాబోతున్నట్లు తెలిపే 3 సంకేతాలు ఇవే

4. ఇంట్లో సాత్వికమైన ఆహార అలవాట్లు పాటించాలి

ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలని విదుర నీతి సూచిస్తుంది. ఇంట్లో శుభ్రంగా, పరిశుభ్రమైన పదార్థాలతో సాత్వికమైన భోజనం తయారు చేసుకోవాలి.
తాజా కూరగాయలు, పండ్లు, ధాన్యాలు వంటి ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. భోజనం చేసే ముందు దేవుడికి నైవేద్యం సమర్పించడం కూడా హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన ఆచారం. ఆహారాన్ని వృథా చేయకుండా గౌరవించాలి. ఇలాంటి అలవాట్లు కుటుంబంలో క్రమశిక్షణ పెంచుతాయి.

ఈ 4 మంచి అలవాట్లతో ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయి
విదుర నీతి ప్రకారంజజ పరిశుభ్రత, భక్తి, పెద్దల పట్ల గౌరవం, సాత్విక ఆహారం ప్రతి ఇంట్లో ఉండాల్సిన మంచి లక్షణాలు. ఇవి పాటించడం వల్ల కుటుంబంలో ప్రేమ, ఐక్యత, ప్రశాంతత పెరుగుతాయి. నిజమైన సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. ఆరోగ్యం, ఆనందం, మంచి కుటుంబ బంధాలు కూడా జీవితంలో ఎంతో విలువైన సంపదలే.

Related News

చలికాలంలో జుట్టు పొడిబారే సమస్య.. నో టెన్షన్ ఈ 4 రకాలపూలతో హెయిర్ కేర్ చేయండి

వివాహ బంధంలో ఒకరు మోసం చేస్తే విడిపోవాల్సిందినా? లేదా మోసం చేసిన వ్యక్తికి మరో అవకాశం ఇవ్వాలా?

మైదా లేకుండానే ఇంత క్రిస్పీ సమోసా చేయొచ్చా? ఈ సీక్రెట్ తెలిస్తే ఇక బయట అస్సలు కొనరు!

ఒక్క సిప్ తాగితే చాలు మైమరచిపోవాల్సిందే.. ఈ స్పైసీ చికెన్ సూప్ సీక్రెట్ ఇదే!

అర్ధరాత్రి స్వీట్ క్రేవింగ్స్ తీర్చే ఇన్‌స్టంట్ ‘ఎమర్జెన్సీ చాక్లెట్ కేక్’.. ఓవెన్ లేకుండా 10 నిమిషాల్లోనే రెడీ!

మనలో 90% మంది రాత్రిపూట చేసే పెద్ద తప్పు ఇదే.. బెడ్ దగ్గర ఉంచకూడని 5 ప్రమాదకరమైన వస్తువులివే!

చలికాలంలో ఫ్యాషనబుల్‌గా కనిపించాలా? పాత స్వెటర్లతో ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి

Big Stories

Advertisement
×