BigTV English

Holi 2025 Wishes: కలర్ ఫుల్ హోలీ శుభాకాంక్షలు.. మీ ప్రియమైన వారికి ఇలా చెప్పండి..

Holi 2025 Wishes: కలర్ ఫుల్ హోలీ శుభాకాంక్షలు.. మీ ప్రియమైన వారికి ఇలా చెప్పండి..
Advertisement

Holi 2025 Wishes: భారతీయులు అత్యంత శ్రద్ధలతో జరుపుకునే ఎన్నో పండుగల్లో ముఖ్యమైంది హోలీ. ఈ ఫెస్టివల్ వచ్చిందంటే చాలు.. బంధులు, స్నేహితులందరూ ఒకచోట చేరి రంగులు పూసుకుంటూ.. కోలాటాలతో సందడి చేస్తూ ఉంటారు. హోలీ మంటలు వేసి, కోలాటాలు వేస్తూ.. సాంప్రదాయ నృత్యాలు చేస్తూ.. భగవంతుని సేవలో మునిగి తేలడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగ సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చి మొదటి వారంలో ఫాల్గుణ మాసంలో జరుపుకుంటారు. హోలీ అనేది వసంత రుతువును స్వాగతించే పండుగ. శీతాకాలపు మంటలు తొలగిపోయే రోజు. చెడుపై మంచి గెలిచిన సందర్బంగా మనం ప్రత్యేకంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాము.


హోలీ రోజున కృష్ణా, రాధలను కొనియాడుతూ వారిపాటలతో సంబురాలు జరుపుకుంటారు. కుల మతాలతో సంబంధం లేకుండా.. దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలు ఈ హోలీ వేడుకలో పాలుపంచుకుని, రంగపంచమి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ కలర్ ఫుల్ హోలీ శుభాకాంక్షలు ఈ ప్రియమైన వారికి చెప్పాల్సిందే. ఇక్కడ హోలీ సందర్భంగా అందమైన కొటేషన్స్ ఇచ్చాము. ఇందులో మీకు నచ్చినవాటిని సెలక్ట్ చేసుకుని మీ స్నేహితులకు, బంధువులకు వాట్సాప్, సోషల్ మీడియాలో మెసేజ్ రూపంలో పంపించుకోండి. ఈ హోలీ విషెస్ వారి పండుగను రెట్టింపు సంతోషాన్ని ఇస్తాయి.

 ☀ హోలీ శుభాకాంక్షలు చెప్పండిలా..


 ☀ వసంత గమనంలో వస్తుంది రంగుల హోలీ.. నింపుతుంది మీ జీవితాలలో ఆనందాల కేళీ.. మీకు, బంధుమిత్రులకు హోలీ శుభాకాంక్షలు.

చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా జరుపుకునే పండుగ. మీ జీవితాల్లో కూడా చెడు తొలగిపోయి.. మంచి రోజులు రావాలని కేరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.

సుఖం.. దుఃఖం.. సంతోషం.. విచారం అన్ని కలిసిన రంగులే ఈ హోలీ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.

ఆ కృష్టుడు ఆశీస్సులతో మీ జీవితంలో ఆనందపు రంగులు, ప్రేమ, రంగులు, స్నేహపురంగులు వెదజల్లాలని కోరుకుంటూ.. హోలీ శుభాకాంక్షలు.

ఈ రంగుల హోలీతో మీ జీవితం సంబరాలమయం కావాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.

ఆ నింగిలోని హరివిల్లు మీ ఇంట విరియాలి.. ఆ ఆనందపు రంగులు మీ జీవితంలో నిండాలని.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

హోలీ నింపాలి మీ జీవితంలో ఆనంద రంగేలీ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.

ఇవి రంగులు కావు.. మన ప్రేమానురాగాలు.. ఈ అల్లరిలో ఆప్యాయత ఉంటుంది. మరురపురాని సంతోషం దాగి ఉంటుంది. ఎప్పటికీ గుర్తిండిపోతుంది. హ్యాపీ హోలీ

Also Read: హోలీ పండుగ ముందు రోజు కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..?

రంగులు వేర్వేరు.. కానీ అవి ఇచ్చే ఆనందం ఒకటే.. మన మనసులు కూడా అంతే.. హ్యాపీ హోలీ.

హోలీ రోజు పగా, ప్రతీకారాలు, గర్వం, అసూయ అన్ని మంటల్లో వేసేయండి.. కొత్త జీవితాన్ని ప్రారంభించండి.. అందరికీ హోలీ శుభాకాంక్షలు.

ఈ సంవత్సరం మీ కుటుంబంలో కలర్ ఫుల్ మెమరీస్ మిగిలిపోవాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.

హోలీ అంటే కేవలం రంగులు మాత్రమే కాదు.. ప్రేమానురాగాలు కలిస్తేనే అందమైన పండుగ. మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు.

Tags

Related News

Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయ్ !

Coconut Oil: కొబ్బరి నూనెను ఇలా కూడా వాడొచ్చా? ఇన్నాళ్లు తేలియలేదే ?

Karpooram: చిటికెడు పచ్చ కర్పూరం.. జీర్ణ సమస్యల నుండి కీళ్ల నొప్పుల వరకు ఉపశమనం

Sugar: చక్కెర లేకుండా టీ, కాఫీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Muscle Growth Food: ఇలాంటి ఫుడ్ తింటే.. తక్కువ టైంలోనే సిక్స్ ప్యాక్

Sleep: ఎలా నిద్రపోతే మంచిది ? చాలా మందికి తెలియని సీక్రెట్ !

Water: రోజుకు ఎంత నీళ్లు తాగాలి ? అతిగా తాగితే ఏమవుతుంది ?

Broccoli: వావ్.. డైలీ బ్రోకలీ తింటే.. ఆశ్చర్యపోయే లాభాలు !

Big Stories

×