OTT Movie : ఒక చక్కని ఫీల్ గుడ్ ఫ్యామిలీని చూడాలని చాలా మందికి ఉంటుంది. అందులోనూ పండుగ స్పెషల్ కి, అలాంటి సినిమాలు చూస్తే వచ్చే ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ నేపథ్యంలో దీపావళి స్పెషల్ కి, ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. దీపావళిని ఫ్యామిలీతో సెలెబ్రేట్ చేసుకోవడానికి ఇంటికి వచ్చిన ఒక అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా ఎమోషనల్, కామెడీ థీమ్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఫ్యామిలితో కలసి చూడాల్సిన చూడ చక్కని సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘గ్రేటర్ కైలాష్’ (Greater kailash movie) 2025లో వచ్చిన బాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అదిత్య చండీవోక్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో ట్వింకిల్ అహసాస్ చన్నా, సుప్రియా శుక్ల, కాలన్ మల్వ, హ్యాపీ రానాజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 17లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ లో కూడా అందుబాటులో ఉంది.
ట్వింకిల్ బెంగళూరులో జాబ్ చేస్తూ, దీపావళి పండగ కోసం ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లో తన ఇంటికి వస్తుంది. ఆమె తల్లి, తండ్రి, తమ్ముడితో సంతోషంగా దీపావళి జరుపుకోవాలని అనుకుంటుంది. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత, కుటుంబంలో కొన్ని సమస్యలు బయటపడతాయి. తల్లి, తండ్రి మధ్య గొడవలు, డబ్బు ఇబ్బందులు, ఇల్లు అమ్మాలనే ఆలోచన ఉన్నాయని ఆమెకు తెలుస్తుంది. ట్వింకిల్ ఈ సమస్యలను సరిచేసి, ఫ్యామిలీతో కలసి, దీపావళిని హ్యాపీగా జరపాలని ప్లాన్ చేస్తుంది. మొదట్లో కోపం తెచ్చుకున్న ట్వింకిల్, ఆ తరువాత కుటుంబ సమస్యలను తెలుసుకుంటుంది. తల్లి, తండ్రి మధ్య గొడవలు ఎందుకు జరిగాయి, ఆర్థిక ఇబ్బందులు ఎలా వచ్చాయి, ఇల్లు ఎందుకు అమ్మాలనుకుంటున్నారో అర్థం చేసుకుంటుంది.
Read Also : ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పై పన్ను… ఫ్యామిలీతో చూడకూడని సీన్లున్న హిస్టారికల్ మూవీ
ఇంతలో ఇక్కడ లవ్ స్టోరీలు కూడా ఎంట్రీ ఇస్తాయి. ట్వింకిల్ ఒక అబ్బాయిని ప్రేమిస్తుంటుంది. అలాగే ఆమె తమ్ముడు కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఈ విషయంలో కూడా గొడవలు జరుగుతాయి. ఇది ఇలా ఉంటే, ట్వింకిల్ తండ్రి వేరొకరితో ఎఫైర్ నడుపుతున్నట్లు వీళ్ళు అపార్థం చేసుకుంటారు. చివరికి వీళ్ళ గొడవలు సమసిపోతాయా ? దీపావళి పండుగను కలసి చేసుకుంటారా ? ఇంటి సంగతి ఏమవుతుంది ? అనే విషయాలను, ఈ బాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాని చూసి తెలుసుకోండి.