Rashmika Mandanna:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండేళ్లలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఎప్పటినుంచో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న దీపికా పదుకొనే(Deepika Padukone), నయనతార(Nayanthara), అలియా భట్(Alia Bhatt), సమంత (Samantha)లాంటి అగ్ర నటీమణులు కూడా ఈ రికార్డును క్రియేట్ చేయలేకపోయారు. మరి రష్మిక మందన్న క్రియేట్ చేసిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.
రెండేళ్లలో రూ.3,300 కోట్లు..
సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న రష్మిక మందన్న ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’ సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టడమే ఇందుకు ప్రధాన కారణం. గత రెండేళ్లలో రష్మిక నటించిన ఈ మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ.3,300 కోట్లు వసూలు చేశాయి. ఒక హిందీలోనే దాదాపు రూ.1,850 కోట్లు రాబట్టాయి. దీంతో దీపిక,ఆలియా భట్ వంటి స్టార్ల కంటే కూడా అక్కడ రష్మికాకే ఎక్కువ సక్సెస్ లభించింది. మొత్తానికైతే టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనే కాదు ఏకంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రెండేళ్లలో రూ.3,300 కోట్లు రాబట్టిన ఏకైక హీరోయిన్గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది రష్మిక మందన్న. ఇక ఈమె రికార్డ్ ను ఇప్పట్లో ఏ హీరోయిన్ కూడా బ్రేక్ చేయలేదేమో అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి రష్మిక అదృష్టం మామూలుగా లేదుగా అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
రష్మిక మందన్న సినిమాలు..
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతున్న రష్మిక మందన్న.. ప్రస్తుతం బాలీవుడ్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) తో కలిసి ‘సికిందర్’ సినిమా చేస్తోంది. అంతేకాదు తెలుగులో ధనుష్ (Dhanush) నేరుగా చేస్తున్న ‘కుబేర’ సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna ) కీ రోల్ పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాలతో పాటు ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి చిత్రాలలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలన్నీ పూర్తి అయ్యేసరికి ఇంకా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.
రష్మిక మందన్న కెరియర్..
రష్మిక మందన్న కెరియర్ విషయానికి వస్తే.. 2016లో ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ చలనచిత్రం ద్వారా నటిగా పరిచయమైన ఈమె, ఆ తర్వాత తెలుగులో ‘ఛలో ‘సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వచ్చిన ‘గీతా గోవిందం’ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చింది రష్మిక. 2014లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె, అదే సంవత్సరం క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ ను గెలుచుకుంది. అంతేకాదు క్లీన్ అండ్ క్లియర్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది. ఇక 2024లో కేంద్ర ప్రభుత్వం ఆమెను హోంశాఖ ఆధ్వర్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఇక ఇప్పుడు తెలుగులో తమిళ్లో హిందీలో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇండియా వ్యాప్తంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది రష్మిక. మునుముందు ఎలాంటి విజయాలు అందుకుంటుందో చూడాలి.