BigTV English

AP Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రానున్న 5 రోజులు అతి భారీ వర్షాలు

AP Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రానున్న 5 రోజులు అతి భారీ వర్షాలు
Advertisement

AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం మధ్యాహ్నానికి వాయుగుండంగా బలపడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అనంతరం 24 గంటల్లో వాయుగుండం మరింత బలపడేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.


ఐదు రోజులు అతి భారీ వర్షాలు

రానున్న5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


ఎల్లుండి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గురువారం కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కంట్రోల్ రూమ్ నెంబర్లు

నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీవర్ష సూచన చేసింది. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని సూచించింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

Related News

Srisailam Karthika Masam: శివ భక్తులకు అలర్ట్.. శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు షురూ

Rain Alert: బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం.. ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కి కోపం తెప్పించిన డీఎస్పీ.. డీజీపీ వద్ద పంచాయితీ

Uttarandhra: ఆ ఒక్కటి పూర్తయితే ఉత్తరాంధ్రలో టీడీపీకి తిరుగుండదు

Nara Lokesh: ఏపీ ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారా లోకేష్..

Amaravati News: పోలీసు అమర వీరుల సంస్మరణ దినం.. కల్తీ మద్యంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Amaravati: సీఎం చంద్రబాబు-జగన్ ఫ్యామిలీల దీపావళి సంబరాలు, మేటరేంటి?

Big Stories

×