Car Accident: హైదరాబాద్ లోని నార్సింగి అల్కాపూరీ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు బైక్ పై వెళ్తున్న తండ్రీ కొడుకులు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ కుమార్, అతని కుమారుడు కుశల జోయల్ ఎగిరి కింద పడ్డారకు. అనంతరం బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లింది. బాలుడిని ఆసుపత్రికి తీసుకెళుతుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు. తండ్రి ఒడిలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
తండ్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారు నడుపుతూ ప్రమాదానికి కారణమైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రవీణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉండటంతో, దర్యాప్తు అధికారులు సీసీ ఫుటేజీలను సేకరిస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రానున్న 5 రోజులు అతి భారీ వర్షాలు
పరిసర ప్రాంతాల్లో వేగం నియంత్రణ లేకుండా వాహనాలు నడిపే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు తగ్గుతాయి అని స్థానికులు అభిప్రాయపడ్డారు.
బాలుడిపై నుంచి దూసుకెళ్లిన కారు..
నార్సింగిలోని అల్కాపూరీ కాలనీలో కారు బీభత్సం
బైక్ ను ఢీ కొట్టడంతో గాల్లోకి ఎగిరిపడ్డ తండ్రి, కొడుకులు
బాలుడిపై నుంచి దూసుకెళ్లిన కారు
తీవ్రంగా గాయపడ్డ తండ్రి
హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
మార్గ మధ్యలో బాలుడు మృతి pic.twitter.com/xH6HKFOZJJ
— BIG TV Breaking News (@bigtvtelugu) October 21, 2025