Mohammad Rizwan: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు వన్డే కెప్టెన్ గా ఉన్న మహమ్మద్ రిజ్వాన్ కు ఊహించని షాక్ ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board). మహమ్మద్ రిజ్వాన్ ( Mohammad Rizwan ) స్థానంలో షాహిన్ అఫ్రీదీని ( Shaheen Afridi ) పాకిస్తాన్ వన్డే కెప్టెన్ గా నియామకం చేసింది. ఈ మేరకు నిన్న అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే పాకిస్తాన్ కెప్టెన్ గా సక్సెస్ ఫుల్ గా కొనసాగిన మహమ్మద్ రిజ్వాన్ ను తొలగించడం వెనుక పెద్ద కుట్ర ఉందని చెబుతున్నారు. పాలస్తీనాకు ( Palestine) మద్దతుగా నిలవడంతో పాటు బెట్టింగ్ యాప్స్ లోగో ఉన్న జెర్సీని మహమ్మద్ రిజ్వాన్ ధరించలేదట. ఈ నేపథ్యంలోనే మహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీ తొలగించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ వన్డే కెప్టెన్ గా మహమ్మద్ రిజ్వాన్ అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. బాబర్ ఆజాంను తొలగించిన తర్వాత గత సంవత్సరంలో మహమ్మద్ రిజ్వాన్ కు వన్డే కెప్టెన్సీ దక్కింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, అలాగే సౌత్ ఆఫ్రికా గడ్డపై మరో వన్డే సిరీస్ గెలిపించాడు. ఇన్ని రికార్డులు సొంతం చేసుకున్నా కూడా మహమ్మద్ రిజ్వాన్ పై వెయిట్ వేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే దీని వెనుక పెద్ద కారణం ఉందని రషీద్ లతీఫ్ తాజాగా వెల్లడించారు. పాలస్తీనా దేశ ప్రజలకు మహమ్మద్ రిజ్వాన్ ఇటీవల కాలంలో మద్దతు ప్రకటించాడు. యుద్ధం కారణంగా పాలస్తీనా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిందే. పాకిస్తాన్ విజయాలను కూడా అక్కడి ప్రజలకు అంకితం చేస్తున్నట్లు వెల్లడించాడు. అయితే ఈ కారణంగానే తాజాగా మహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీ తొలగించారని రషీద్ లతీఫ్ పేర్కొన్నారు.
అంతేకాదు, కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో మహమ్మద్ రిజ్వాన్ బెట్టింగ్ యాప్స్ లోగో ఉన్న జెర్సీని ధరించడానికి ఒప్పుకోలేదట. దాని వల్ల అంతర్జాతీయంగా బ్యాడ్ నేమ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు కారణాలు చూపి, మహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీ తొలగించారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. మహమ్మద్ రిజ్వాన్ స్థానంలో షాహిన్ అఫ్రీదిని పాకిస్తాన్ వన్డే కెప్టెన్ గా నియామకం చేశారు. నవంబర్ 4వ తేదీ నుంచి పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు పాకిస్తాన్ లో టెస్టులు ఆడుతున్నాయి. ఆ తర్వాత టి20 లో జరగనున్నాయి. అనంతరం వన్డేలు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ వన్డే కెప్టెన్ గా మహమ్మద్ రిజ్వాన్ స్థానంలో షాహిన్ అఫ్రీదిని నియామకం చేశారు.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?
According to Rashid Latif, Mohammad Rizwan has been removed from the captaincy because he spoke openly for Palestine and Mike Hesson didn’t like the culture he brought to the dressing roompic.twitter.com/YUoKfsqz8q
— Hassan Abbasian (@HassanAbbasian) October 20, 2025