BigTV English
Advertisement

Anudeep KV : పెళ్లి ఎప్పుడో చెప్పిన అనుదీప్ కేవీ… కాబోయే భార్యకు అలాంటి సలహా ఇచ్చిన డైరెక్టర్

Anudeep KV : పెళ్లి ఎప్పుడో చెప్పిన అనుదీప్ కేవీ… కాబోయే భార్యకు అలాంటి సలహా ఇచ్చిన డైరెక్టర్

Anudeep KV : యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవి (Anudeep KV) గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) మూవీతో ఈ డైరెక్టర్ ప్రేక్షకులను థియేటర్లలోని పడి పడి నవ్వేలా చేశాడు. తాజాగా డైరెక్టర్ అనుదీప్ కేవి తన పెళ్లి, పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా కాబోయే భార్యకి ఇంట్రెస్టింగ్ సలహా కూడా ఇచ్చారు. మరి అనుదీప్ ఇచ్చిన ఆ సలహా ఏంటి? ఈ యంగ్ డైరెక్టర్ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు? అనే వివరాల్లోకి వెళ్తే…


పెళ్లిపై అనుదీప్ షాకింగ్ రియాక్షన్

తాజా ఇంటర్వ్యూలో అనుదీప్ మాట్లాడుతూ తనకు అస్సలు కోపం రాదని చెప్పారు. ఇప్పటిదాకా లైఫ్ లో ఒక్కసారి కూడా ఆ కోపమనే ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదని చెప్పి సర్ప్రైజ్ చేశారు. చిన్నప్పుడు సిగ్గులేదా అని తల్లిదండ్రులు తిడితే, ఇంకా నవ్వొచ్చేదట ఈ డైరెక్టర్ కి. “మరి లవ్ స్టోరీలు ఉన్నాయా?” అనే ప్రశ్నకి బాగా ఆలోచించుకొని, లేదని సమాధానం చెప్పారు అనుదీప్.


అయితే అబద్ధం చెప్తున్నారని తిరిగి ప్రశ్నించడంతో, “అప్పుడెప్పుడో ఉంటే ఉండి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమీ లేదు” అని క్లారిటీ ఇచ్చారు. ఇక పెళ్లి విషయం గురించి ప్రస్తావన రాగా, అరేంజ్డ్, లవ్ మ్యారేజ్ అనే రెండు ఆప్షన్స్ ను వదిలేసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే “ప్రేమించి పెళ్లి చేసుకుంటారా? లేదంటే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అని అడగ్గా… “అసలు క్లారిటీ లేదు. పెళ్లి చేసుకుంటానా లేదంటే సింగిల్ గా ఉంటానా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాలి” అని చెప్పారు. “మీ గురువు గారిని అడగకపోయారా? ” అనే ప్రశ్నకి నవ్వుతూ “నాగ్ అశ్విన్ పెళ్లి సంబంధాలు చూడాలా? అని అప్పుడప్పుడు కామెడీ చేస్తూ ఉంటారు” అని అన్నారు అనుదీప్.

కాబోయే భార్యకి సలహా 

అయితే అనుదీప్ మొహమాటంగా, నెర్వస్ గా కనిపించడంతో యాంకర్ “మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మీరంటే బాగా తెలిసిన వ్యక్తులతో ముందు మాట్లాడించండి. అప్పుడే ఆమెకు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది” అని సలహా ఇవ్వగా, “తప్పకుండా చెప్తాను” అని అన్నారు. ఇదిలా ఉండగా ‘జాతి రత్నాలు’ మూవీ కామెడీ ఖజానా అని చెప్పొచ్చు. ఫుల్ లెన్త్ కామెడీ ప్యాక్డ్ మూవీ గా 2021 లో రిలీజ్ అయిన ఈ మూవీతో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఫుల్ పాపులర్ అయ్యారు.

నిజానికి అనుదీప్ 2016లోనే దర్శకుడిగా ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఆ టైంలో ‘పిట్టగోడ’ అనే మూవీని ఆయన చేశారు. తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకుని ‘జాతి రత్నాలు’ మూవీతో సంచలనం సృష్టించారు. అంతేకాకుండా ‘ప్రిన్స్’ మూవీతో తమిళ చిత్ర సినిమాలో కూడా డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. అలాగే మ్యాడ్, జాతి రత్నాలు సినిమాలో నటుడిగా ఆకట్టుకున్నారు అనుదీప్. ఇదిలా ఉండగా అనుదీప్ కేవి, పాన్ ఇండియా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇద్దరూ మంచి స్నేహితులు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×