BigTV English

Children Games : పిల్లలకు ఈ ఆటలతోనే ఆరోగ్యం.. చదువు కూడా

Children Games : పిల్లలకు ఈ ఆటలతోనే ఆరోగ్యం.. చదువు కూడా
Children Games

Children Games : పిల్లలు ఆటలు ఆడితే చదవరని చాలా మంది తల్లిదండ్రుల భయం. కానీ, ఆటలు పిల్లలకు మంచి వ్యాయామ సాధనాలు. పిల్లలకు ఇష్టమైన ఆటలు ఆడిస్తే.. అటు ఆరోగ్యంతో పాటు ఎదుగుదల కూడా సాధ్యపడుతుంది. అలాగే చదువులో కూడా రాణిస్తారు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి చిన్నారుల ఆరోగ్యానికి తోడ్పడే ఆ ఆటలేవో ఇప్పుడు తెలుసుకుందామా!


టెన్నిస్ :
టెన్నిస్‌‌ ఆడితే.. శరీరానికి మంచి వ్యాయామం అందుతుంది. దీంతో కండరాలన్నీ కదిలి, శారీరక సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా చురుకైన కంటి చూపు, వేగంగా లక్ష్యాన్ని చేరుకోవడం అలవాటవుతాయి. దీంతో చురుగ్గా నిర్ణయాలు తీసుకునే తత్వం కూడా పెరుగుతుంది.

స్విమ్మింగ్‌ :
స్విమ్మింగ్ ఏకాగ్రతను పెంచుతుంది. క్రమశిక్షణగా ఉండాలంటే.. స్విమ్మింగ్‌ నేర్పించాలని నిపుణులు చెబుతున్నారు. స్విమ్మింగ్‌ శరీరం, మెదడును చురుగ్గా ఉంచుతుంది. వేగంగా దూసుకెళ్లే తత్వంతో ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది.


కరాటే :
పిల్లలకు కరాటే, కుంగ్‌ ఫూ వంటివి శారీరక సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, వ్యక్తిగత క్రమశిక్షణను అలవరుస్తాయి. ఏకాగ్రతతో పాటు అవతలివారితో ఎలా మాట్లాడాలి, వారిని గౌరవించడం కూడా అలవాటు పడుతుంది.

వాటర్‌‌ వాకింగ్ :
నీటిలో నడవడం వల్ల కాల్యరీలు బర్న్ అవుతాయి. అలాగే కోర్, లెగ్ మజిల్స్‌ని బలంగా చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల అదనపు కొవ్వు తగ్గుతుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు. ఎనర్జీగా కూడా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×