Rinku Singh: టీమిండియా డేంజర్ ఆటగాడు, కోల్‌కతా నైట్ రైడర్స్ రింకూ సింగ్ ( Rinku Singh ) గురించి తెలియని వారుండరు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు రింకూ సింగ్. రెండు రోజులుగా టీమిండియా డేంజర్ ఆటగాడు రింకూ సింగ్ ( Rinku Singh ) ఎంగేజ్‌మెంట్ ( Engagement ) గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ తో ( Samajwadi Party MP Priya Saroj ) రింకూ సింగ్ నిశ్చితార్థం ( Engagement ) అయినట్లు పుకార్లు వచ్చాయి. త్వరలోనే ఇది నిజం కూడా కాబోతుందని అంటున్నారు.
Also Read: Vijay Hazare Trophy 2025: విజయ్ హజారే ట్రోఫీ ఛాంపియన్ గా కర్ణాటక.. !
అయితే.. ఇలాంటి నేపథ్యంలో రింకూ సింగ్ ( Rinku Singh ) మరో వార్తతో హాట్ టాపిక అయ్యాడు. రూ. 500 పంచుతూ కనిపించాడు రింకూ సింగ్. దీంతో అందరి హృదయాలను గెలుచుకుంటున్నాడు రింకూ సింగ్. కొంత మంది వెయిటర్లకు ( Waiters ) రింకూ సింగ్ ( Rinku Singh ) డబ్బులు అందజేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వెయిటర్లకు ( Waiters ) ఒక్కొక్కరికీ… రూ. 500 చొప్పున పంచుతున్నాడు రింకూ సింగ్ ( Rinku Singh ).
అయితే.. రూ. 500 పంచుతూ కనిపించిన రింకూ సింగ్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న చిన్న క్లిప్‌లో…. రింకూ… వెయిటర్ల సమూహానికి రూ. 500 నోట్లు పంచడం స్ఫష్టంగా కనిపిస్తోంది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియనప్పటికీ, ఈ వీడియో చాలా మంది హృదయాలను తాకిందని చెప్పవచ్చును. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం… రింకూ సింగ్ ( Rinku Singh ) చేస్తున్న పనిని మెచ్చుకుంటూ… ప్రశంసిస్తున్నారు.
Also Read: South Indian cricketers: చాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన… దక్షిణాది క్రికెటర్లను తొక్కేసిన బీసీసీఐ ?
ఇది ఇలా ఉండగా…గడిచిన రెండు రోజులుగా టీమిండియా డేంజర్ ఆటగాడు, కోల్‌కతా నైట్ రైడర్స్ రింకూ సింగ్ ( Rinku Singh ) గురించి ఒకే ఒక్క వార్తల వైరల్ అవుతోంది. అదే రింకూ సింగ్ ఎంగేజ్‌మెంట్. సాధారణ అమ్మాయితో రింకూ సింగ్ ఎంగేజ్‌మెంట్…ఎవరూ కూడా పట్టించుకునే వారు కాకపోయేది. కానీ… రింకూ సింగ్ ఎంగేజ్‌మెంట్… సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ తో ( Samajwadi Party MP Priya Saroj ) జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో… రింకూ సింగ్ ( Rinku Singh ) ఎంగేజ్‌మెంట్ ( Engagement ) గురించి అందరూ చర్చించడం మొదలు పెట్టారు.
అయితే.. వీరిద్దరీ ఎంగేజ్‌మెంట్ ( Engagement ) జరుగలేదట. త్వరలోనే జరుగనుందట. ఈ విషయాన్ని ప్రియా తండ్రి పేర్కొన్నారు. కాగా… కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఫినిషర్‌గా ఆడుతూ ఐపిఎల్‌లో తన అద్భుతమైన ప్రదర్శనల ద్వారా టీమిండియాలోకి వచ్చాడు రింకూ సింగ్. భారత T20I జట్టులో స్థానం సంపాదించికున్న.. టీ20 స్పెషలిస్ట్ గా మారిపోయాడు రింకూ. ఇప్పటి వరకు రింకు 30 T20Iలు ఆడాడు. , ఆకట్టుకునే స్ట్రైక్ రేట్ తో 500 పైగా పరుగులు చేసింది. జనవరి 22 నుంచి ప్రారంభం కానున్న ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ T20I సిరీస్ కోసం రింకు సింగ్ త్వరలో తిరిగి మైదానంలోకి రానున్నాడు.
— Out Of Context Cricket (@GemsOfCricket) January 18, 2025