E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. మే నెలలో ముఖ్య తేదీలివే

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. మే నెలలో ముఖ్య తేదీలివే
Advertisement

Tax Filings In May: కొత్త ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయింది. మళ్లీ ట్యాక్స్ ఫైలింగ్ కు టైమైంది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు మే నెలలో గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన తేదీలున్నాయి. వీటిలో టీడీఎస్ చెల్లింపులు, త్రైమాసిక ఫైలింగ్‌ల గడువు తేదీలు ఉన్నాయి. ఈ గడువులు మిస్ అయితే జరిమానా లేదా అదనపు ఛార్జీలకు దారితీస్తుంది. పన్ను చెల్లింపులకు ప్లానింగ్ అవసరం. గడువులోగా పన్ను చెల్లిస్తే అదనపు చెల్లింపుల భారం తగ్గుతుంది.

మే 7 – టీడీఎస్/టీసీఎస్ డిపాజిట్లు, డిక్లరేషన్లు

మే 7లోపు ఏప్రిల్ నెలకు సంబంధించి టీడీఎస్, టీసీఎస్ ను జమ చేయాలి. చలాన్ లేకుండా చెల్లింపులు చేసే ప్రభుత్వ కార్యాలయాలు మే 7 లోపు కేంద్ర ప్రభుత్వ ఖాతాకు పన్ను చెల్లించాలి.

Advertisement

ఆదాయపు పన్ను చట్టం, 2025లోని సెక్షన్ 394(2) కింద వ్యక్తులు ఆదాయం డిక్లరేషన్ సబ్‌మిట్ చేయాలి. ఏప్రిల్, 2026లో జరిపిన లావాదేవీలకు ట్యాక్స్ పడకుండా ఉండేందుకు కొనుగోలుదారుల నుంచి డిక్లరేషన్లు అవసరం.

మే 15 – టీడీఎస్ సర్టిఫికెట్లు, త్రైమాసిక ఫైలింగ్‌లు

ఆదాయపు పన్ను చట్టం, 1961లోని నిర్దిష్ట సెక్షన్ల కింద మార్చి 2026లో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కు సంబంధించి టీడీఎస్ సర్టిఫికెట్లను జారీ చేయడానికి మే 15 చివరి తేదీ.

  • సెక్షన్ 194-IA: స్థిరాస్తి (భూమి లేదా ఇల్లు) కొనుగోలుపై టీడీఎస్ కు వర్తిస్తుంది.
  • సెక్షన్ 194-IB: వ్యక్తులు లేదా HUFs చెల్లించే అద్దె నెలకు రూ.50,000 దాటినప్పుడు, ఆ అద్దెపై విధించే TDSను ఈ సెక్షన్ కింద లెక్కిస్తారు.
  • సెక్షన్ 194M: వ్యక్తులు లేదా HUFs కాంట్రాక్టర్లకు లేదా నిపుణులకు సంవత్సరానికి రూ.50 లక్షల కంటే ఎక్కువ చెల్లిస్తే ఇది ఈ సెక్షన్ వర్తిస్తుంది .
Advertisement

గత నెలలో చలాన్లు లేకుండా టీడీఎస్ లేదా టీసీఎస్ జమ చేసిన ప్రభుత్వ ఆఫీసులు కూడా మే 15 తేదీలోగా ఫారమ్ 24జీని సబ్మిట్ చేయాలి. అంతేకాకుండా, ఏప్రిల్ 2026 నాటికి రిజస్టర్ చేయకుండా క్లయింట్ కోడ్‌లు, లావాదేవీలను తెలియజేస్తూ స్టాక్ ఎక్స్ఛేంజీలు నెలవారీ రిపోర్టులను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మార్చి 31, 2026తో టీసీఎస్ త్రైమాసిక రిపోర్ట్ ను కూడా మే 15 నాటికి సబ్మిట్ చేయాలి.

మే 30- టీసీఎస్ సర్టిఫికెట్లు, స్టేట్‌మెంట్లు

2025-26 ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికానికి టీసీఎస్ సర్టిఫికెట్లను జారీ చేసేందుకు.. వ్యాపారులకు మే 30 చివరి గడువు. అలాగే సినిమాటోగ్రాఫ్ సినిమాను నిర్మించే లేదా ఏదైనా నిర్దిష్ట కార్యకలాపానికి గత ఆర్థిక సంవత్సరం 2025-26 వార్షిక నివేదికలను సబ్మిట్ చేయాలి. పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను చట్టం కింద గత నెల లావాదేవీలకు మినహాయించిన పన్ను కోసం చలాన్-కమ్-స్టేట్‌మెంట్‌ను మే 30లోపు దాఖలు చేయాలి.

మే 31

మే నెలలో అత్యంత ముఖ్యమైన నిబంధనలలో ఒకటి మే 31. ఈ తేదీలోపు పన్ను చెల్లింపులకు సంబంధించిన ఫైలింగ్‌లు చేయాల్సి ఉంటుంది. సూపర్‌యాన్యుయేషన్ ఫండ్‌ ట్రస్టీలు, విరాళాల నుంచి పన్ను మినహాయింపు రిటర్న్‌లను ఫైల్ చేయాలి. 2025 క్యాలెండర్ ఇయర్ కు సంబంధించి వార్షిక నివేదికను ఆర్థిక సంస్థలు ఇ-ఫైల్ చేయాలి. అలాగే పలు సంస్థలు 2025–26 ఆర్థిక సంవత్సరం ఫారం 61A లో ఆర్థిక లావాదేవీల నివేదించాలి.

Also Read: సరికొత్తగా BSNL సంచార్ మిత్ర యాప్.. ఇక మీ కేవైసీ వివరాలన్నీ సేఫ్, ఎలాగంటే?

మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి త్రైమాసిక టీడీఎస్ రిటర్న్ మే 31లోపు ఫైల్ చేయాలి. బేసిక్ మినహాయింపు లిమిట్ ను మించి ఆదాయం కలిగి ఉండి, పాన్ లేని వ్యక్తులు, డైరెక్టర్లు, పార్టనర్స్, ట్రస్టీలు, అధికారులు మే 31 లోపు పాన్ కోసం అప్లై చేయాలి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో విరాళాల కోసం ఫారమ్ 10 BDలో విరాళాల స్టేట్‌మెంట్‌లను సబ్మిట్ చేసి, దాతలకు ఫారమ్ 10BEలో సర్టిఫికేట్‌లను జారీ చేయాల్సి ఉంటుంది.

Related News

కేంద్రం కొత్త కసరత్తు.. బ్యాంకు ఉద్యోగులకు పండగే, అంతా డిజిటల్ మయం

స్టాక్ మార్కెట్‌ భారీ పతనం.. పేక మేడలా కూలిన ఐటీ షేర్లు, కేవలం ఫార్మా రంగం తప్పితే

దేశంలో పడిపోయిన బంగారం దిగుమతులు.. బంగారం కొనుగోలు రైట్ టైమ్, 40 శాతం పెరగడం ఖాయం?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కరోజులో ఎన్నివేలు పెరిగిందంటే?

లోన్లు తీసుకునేవారికి షాకింగ్.. ఆర్బీఐ కొత్త రూల్స్, అలాగయితే కష్టమే

ఇల్లు కొంటున్నారా? ఈ తప్పులు చేస్తే.. లైఫ్ లాంగ్ సంపాదన గోవిందా!

రేట్ల వెనక “9” మాయాజాలం.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన షాపింగ్ సీక్రెట్

SpaceX IPO: ఐపీఓకు స్పేస్‌ ఎక్స్.. 4400 మంది ఉద్యోగులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు, మరో 400 మంది అయితే..

Big Stories

×