Workouts Heart attack| గుండెపోటు రావడం అంటే గుండెకు రక్త ప్రవాహం తీవ్రంగా తగ్గడం లేదా అడ్డుకోవడం. ఇది సాధారణంగా గుండె ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్, ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. ఈ కొవ్వు నిక్షేపాలను ప్లేక్స్ అని అంటారు. ప్లేక్స్ రక్త నాళాలు, గుండె ధమనుల్లో పేరుకుపోయి.. రక్తం గడ్డకట్టడం వల్ల రక్త ప్రవాహానికి అడ్డుగా మారుతాయి. దీంతో గుండెకు రక్తం అందక గుండెపోటు వస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం. ప్రతి సంవత్సరం 17.9 మిలియన్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. అందులో 85 శాతంమరణాలు గుండెపోటు, స్ట్రోక్ వల్ల సంభవిస్తున్నాయి. గుండెపోటుకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి అతిగా వ్యాయామం చేయడం. అతిగా వ్యాయామం గుండెపోటును ఎలా ప్రేరేపిస్తుందో వైద్యులు వివరించారు.
నియమిత వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, గుండె జబ్బులను నివారిస్తుంది. కానీ, గుండె జబ్బు రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నవారు తీవ్రమైన వ్యాయామం చేస్తే.. అది గుండెకు రక్తం సరిగా అందక (ఇస్కీమియా) గుండెపోటుకు దారితీయవచ్చు. డాక్టర్ సంజీవ కుమార్ గుప్తా (CK బిర్లా హాస్పిటల్, ఢిల్లీ) డాక్టర్ అభిజిత్ ఖడ్తారే (రూబీ హాల్ క్లినిక్, పూణే) ఈ ప్రమాదాలను వివరించారు.
అతిగా వ్యాయామం వల్ల గుండెపోటు ఎలా వస్తుంది?
గుండెపోటును ఎలా నివారించాలి?
మితంగా వ్యాయామం: కొత్త వ్యాయామ కార్యక్రమం ప్రారంభించే ముందు.. 35 ఏళ్లు దాటినవారు లేదా రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, ధూమపానం, గుండె జబ్బు కుటుంబ చరిత్ర ఉన్నవారు ECG, స్ట్రెస్ టెస్ట్, ఎకోకార్డియోగ్రామ్, కరోనరీ కాల్షియం స్కాన్ చేయించుకోవాలి.
హెచ్చరిక సంకేతాలను గుర్తించండి: వ్యాయామ సమయంలో లేదా తర్వాత అసాధారణ శ్వాస తీసుకోవడం, గుండె దడ, మైకంగా ఉండడం, అలసట వంటివి కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
పరిమితులు తెలుసుకోండి: వ్యాయామ తీవ్రతను నెమ్మదిగా పెంచడం సురక్షితం. హఠాత్తుగా భారీ వ్యాయామం చేయడం మానుకోవాలి.
Also Read: వర్షాకాలంలో బట్టలు ఫ్రెష్‌గా, క్లీన్‌గా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి
వ్యాయామం గుండె ఆరోగ్యానికి అవసరం, కానీ దాన్ని సురక్షితంగా, బాధ్యతాయుతంగా చేయాలి. వైద్య నిపుణుల సలహాతో వ్యాయామం చేస్తే, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.