BigTV English
Advertisement

AP Politics: మళ్లీ రానివ్వం.. జగన్‌కు పవన్ షాక్

AP Politics: మళ్లీ రానివ్వం.. జగన్‌కు పవన్ షాక్

AP Politics: రాదు..రానివ్వం..! వైసీపీ విషయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లివి. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైసీపీ వస్తుందేమో.. అప్పుడు పరిస్థితి ఏంటి అని ఎంతో మంది తమను అడుగుతున్నారంటూ.. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు మంత్రులు, అధికారులు మాట్లాడుతున్న వేళ.. కీలక కామెంట్లు చేశారు జనసేనాని. ఇంతకీ పవన్ మాటల వెనుక మర్మమేంటి..?


హాట్ టాపిక్‌గా మారిన ఏపీ డిప్యూటీ సీఎం కామెంట్స్

ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ.. 2029లో అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటన్న మాట గత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో గట్టిగా విన్పిస్తోంది. ఈ అంశంపై పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య వర్గాలు తమను పలు సందర్భాల్లో ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నాయంటూ స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ సహా పలువురు చెప్పుకొచ్చారు. సరిగ్గా ఇలాంటి పరిణామాల వేళ కీలక కామెంట్లు చేశారు పవన్ కల్యాణ్. అంతేకాదు.. ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులను ఉద్దేశిస్తూ తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎక్కడున్నా వెనక్కు రప్పిస్తామంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటరిచ్చారు పవన్ కల్యాణ్.


కూటమి సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి..

అయితే.. వైసీపీ ప్రభుత్వం మళ్లీ రాబోయే రోజుల్లో అధికారంలోకి రాదు.. రానివ్వం అంటూ పవన్ వ్యాఖ్యానించడం వెనుక దీమా ఏంటన్న ప్రశ్నలే ఇప్పుడు తలెత్తుతున్నాయి. కూటమి సర్కారు అమలు చేస్తున్న, రాబోయే రోజుల్లో అమలు చేయబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కారణం అని కొందరు చెబుతుంటే.. ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసి వాడే జనసేనాని అని మరికొందరు చెబుతున్నారు.

Also Read: ఆపరేషన్ ఆకర్షా..? డైవర్షన్ పాలిటిక్సా.?

ఎలాంటి త్యాగాలకైనా రెడీ అంటున్న పవన్

తమది సుదీర్ఘ కాల లక్ష్యంగా చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. 15 నుంచి 20 ఏళ్లు అధికారంలో ఉండాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు మరోమారు స్పష్టం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం.. ఇందుకోసం ఎలాంటి త్యాగాలకైనా రెడీ అని ప్రకటించారు. వికసిత్ భారత్‌లో ఏపీ భాగస్వామ్యం అవుతుందని చెప్పిన ఆయన.. వికసిత్ ఏపీగా మారాలంటే కూటమి ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో తాను కానీ, మరెవరూ కానీ లేరని స్పష్టం చేశారు. ఇది సైతం పవన్ దీమాకు ఓ కారణమని చెబుతున్నారు పొలిటికల్ అనలిస్ట్‌లు.

2024లో కూటమి విజయానికి పవన్ కృషి

నిజానికి.. 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి ఏర్పాటయ్యేందుకు గట్టిగా కృషి చేశారు పవన్ కల్యాణ్. ఎన్డీఏతో భాగస్వామిగా ఉన్న పవన్.. ఇటు టీడీపీతోనూ జట్టు కట్టారు. చివరకు మూడు పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎన్డీఏ కూటమిగా మార్చేందుకు తనవంతు పాత్ర పోషించారు. దీంతో.. 2024 ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలలేదు. ఫలితంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి జైత్రయాత్ర కొనసాగించింది. తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 2029 నాటికి వైసీపీ ఓటు చీలకుండా తన వంతు పాత్ర బలంగా పోషించేందుకు ఎల్లప్పుడూ తాను సిద్ధంగా ఉంటానని మరోసారి తన వ్యాఖ్యల ద్వారా చెప్పేశారు పవన్ అన్న టాక్ ఇప్పుడు విన్పిస్తోంది. మరి.. జనసేనాని మాటలకు వైసీపీ ఎలా స్పందిస్తుంది..? అన్నది ఆసక్తికరంగా మారింది.

Related News

Digital Gold Scam Alert: డిజిటల్ గోల్డ్‌పై ఇన్వెస్ట్‌మెంట్ సేఫేనా? సెబీ అలర్ట్!

Jubilee Hills By-Election: కౌంట్‌డౌన్ స్టార్ట్.. జూబ్లీ పీఠం ఎవరిది..?

Kalvakuntla Kavitha: హరీష్‌ను టార్గెట్ చేస్తున్న కవిత

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Nizamabad: దందాలు మూసుకోండి.. బీజేపీ లీడర్లకు ధర్మపురి వార్నింగ్

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

German Scientists: గబ్బిలాలను వేటాడి తింటున్న ఎలుకులు.. కోవిడ్ లాంటి మరో కొత్త వైరస్‌కు ఇదే నాందా?

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Big Stories

×