Delhi: ఢిల్లీలోని జ్యోతి నగర్ ప్రాంతంలో దారుణం జరిగింది. తన కోరిక తీర్చలేదన్న కోపంతో ప్రియురాలిని ఐదో అంతస్తుపైకి తీసుకెళ్లాడు ప్రియుడు. అక్కడి నుంచి యువతిని ఒక్కసారి తోసివేశాడు. తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. చివరకు నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ ఈ కేసు డీటేల్స్‌లోకి వెళ్తే..
ఢిల్లీలో దారుణమైన సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తౌఫిక్ ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ప్రాంతానికి చెందినవాడు. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో 19 ఏళ్ల నేహా ఉంటోంది. వారిద్దరి మధ్య పరిచయం కాస్త ఫ్రెండ్ షిప్‌గా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేహా ఇంటికి తౌఫిక్ వచ్చేవాడు.
ఇంతవరకు బాగానే జరిగింది. నేహా, ఆమె సోదరీమణులు ప్రతి రక్షాబంధన్‌కు ఇంటికి వచ్చి రాఖీ కట్టేవాడు. ఇదే క్రమంలో నేహాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తన పరిచయాన్ని పెళ్లిగా మార్చుకోవాలని ప్లాన్ చేశాడు తౌఫిక్. అదే సమయంలో నేహాకు మ్యారేజ్ కోసం వెతుకున్న విషయం తౌఫిక్ చెవిలో పడింది. తనను వివాహం చేసుకోవాలని నేహాపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు.
అతడి ప్రతిపాదనను తిరస్కరించింది. జూన్ 23న అంటే సోమవారం ఉదయం బుర్ఖా ధరించి నేహా ఇంటికి వెళ్లాడు. అప్పటికి ఐదో అంతస్తులో వాటర్ ట్యాంక్‌ను తనిఖీ చేస్తోంది నేహా. అదే సమయంలో నేహా-తౌఫిక్ మధ్య మ్యారేజ్ విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవలో ఐదో అంతస్తు నుంచి యువతిని తోసేశాడు. తీవ్రంగా గాయపడిన నేహాను ఆసుపత్రికి తరలించారు.
ALSO READ: మా అమ్మను చంపేయ్.. లవ్ డీజే శివ బయటపెట్టిన నిజాలు
అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన జరిగిన నుండి నిందితుడు తౌఫిక్ పరారీలో ఉన్నాడు. నిందితుడ్ని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. నిందితుల కార్యకలాపాలపై నిఘా వేసిన పోలీసులు, ఆ ప్రాంతంలోని సిసిటివి కెమెరాలపై ఫోకస్ చేశారు. చివరకు నిందితుడ్ని యూపీలోని రాంపూర్‌లో గుర్తించారు.
తౌఫిక్‌ను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. బుధవారం అతడ్ని న్యాయస్థానంలో పోలీసులు హాజరుపరిచారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు. మరి పోలీసుల విచారణలో తౌఫిక్ ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.