BigTV English

Premature Birth Rate : ప్రీమెచ్యూర్ బర్త్ రేట్ ఇక్కడే ఎక్కువ

Premature Birth Rate :  ప్రీమెచ్యూర్ బర్త్ రేట్ ఇక్కడే ఎక్కువ
Premature Birth Rate

Premature Birth Rate : ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది జననాల్లో ఒకటి ప్రీమెచ్యూర్ బర్త్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డబ్ల్యూహెచ్‌వో తేల్చి చెప్పింది. 2020లో 13.4 మిలియన్ల మంది పిల్లలు నెలలు నిండకుండానే భూమ్మీద పడ్డారు.


అకాల జననాలను నిరోధించడంలో భారత్ పెద్దగా పురోగతి సాధించలేకపోయింది. నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల సంఖ్య మన దేశంలోనే అత్యధికం. మొత్తం ప్రీమెచ్యూర్ జననాల్లో 20% ఇక్కడే సంభవిస్తున్నాయి. 3.02 మిలియన్ల మంది అలా పుట్టినవారే.

లాన్సెట్‌లో వెల్లడైన అధ్యయన వివరాల మేరకు.. 194 దేశాల్లో సర్వే జరిగింది. 2010తో ప్రీమెచ్యూర్ జననాల ట్రెండ్‌తో పోల్చిచూశారు. ప్రతి వెయ్యి జననాల్లో 13 జననాలు ముందస్తుగా సంభవించినవే. 2010లో ఆ రేటు 13.1 గా నమోదైంది.


40 వారాలకు కాన్పు జరగాల్సి ఉండగా.. 37 వారాలు నిండక ముందే జననాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రీమెచ్యూర్ బర్త్ రేటు విషయంలో మనం అగ్రభాగాన ఉండగా.. పాకిస్థాన్, నైజీరియా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

ఇక ఆ తర్వాత స్థానాలు నైజీరియా, చైనా, ఇధియోపియా, బంగ్లాదేశ్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అమెరికాకు దక్కాయి. నెలలు నిండకుండానే సంభవించే జననాలతో శిశుమరణాల సంఖ్య అధికమయ్యే చాన్స్ ఉంది. అయితే శిశు మరణాల రేటును 29.5 నుంచి 24.9 కు భారత్ తగ్గించగలిగింది.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×