Natural Hair Colour: ప్రస్తుతం తెల్ల జుట్టు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా వైట్ హెయిర్ తో నానా పాట్లు పడుతున్నారు. వైట్ హెయిర్ చిన్నతనంలోనే రావడానికి అనేక కారణాలు ఉంటాయి. కాలుష్యం , పోషకాహారంతో పాటు మరెన్నో కారణాలు తెల్ల జుట్టు వచ్చేలా చేస్తాయి. ఏది ఏమైనప్పటికీ చిన్నతనంలోనే తెల్ల జుట్టు రావడం వల్ల ఆత్మ విశ్వాసం దెబ్బతింటుంది.
ఇటువంటి సమయంలోనే చాలా మంది బయట మార్కెట్ లో దొరికే హెయిర్ కలర్స్ కొని వాడుతుంటారు. వాటి వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలోని రసాయనాలు జుట్టు రాలడానికి కూడా కారణం అవుతాయి. అందుకే అమ్మమ్మల కాలం నాటి హోం రెమెడీస్ వాడి నేచురల్ గానే తెల్ల జుట్టును నల్లగా మారచుకోవచ్చు. మరి జుట్టు నల్లబడటానికి హెం రెమెడీస్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరి ఉపయోగం:
ఉసిరి జుట్టుకు ఉత్తమ ఔషధంగా పరిగణించబడుతుంది. ఇది జుట్టును నల్లగా, ఒత్తుగా మార్చడంతో పాటు బలంగా చేస్తుంది. తెల్ల జుట్టు నల్లగా మారడం కోసం 3-4 స్పూన్ల
కొబ్బరి నూనెలో ఉసిరికాయ పొడిని కలిపి వేడి చేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాలపై అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది. అంతే కాకుండా ఇందులోని పోషకాలు జుట్టును నల్లగా మార్చడంతో పాటు జుట్టుకు పోషణను అందిస్తాయి. తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడే వారు దీనిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసం జుట్టు నెరసిపోకుండా చేస్తుంది. అంతే కాకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది.
3- 4 ఉల్లిపాయను గ్రైండ్ చేసి దాని రసాన్ని తీయండి.
ఈ రసాన్ని జుట్టు మూలాలపై రాయండి.
30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేయండి.
కరివేపాకు, కొబ్బరి నూనె మిశ్రమం:
కరివేపాకులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు , బి-విటమిన్లు ఉంటాయి. ఇవి జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడతాయి.
ఒక కప్పు కొబ్బరి నూనెలో రెండు రెబ్బల కరివేపాకు వేసి వేడి చేయాలి. ఆయిల్ రంగు మారిన తర్వాత ఒ్ గిన్నెలోకి వడకట్టుకోండి.
నూనె చల్లారిన తర్వాత జుట్టు మూలాలకు అప్లై చేయాలి.
ఈ విధానాన్ని వారానికి 2-3 సార్లు చేయండి.
Also Read: హెన్నాలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జన్మలో తెల్లజుట్టు రాదు
ఇవే కాదు.. సమతుల్య ఆహారం , ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ , తగినంత నీరు చేర్చండి. ఒత్తిడిని తగ్గించుకుని తగినంత నిద్ర పొందండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.