Hair Growth Tips: జుట్టు పొడవుగా, సిల్కీగా, ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు జుట్టురాలే సమస్యతో బాధపడుతున్నారు. కొత్త జుట్టు లేకపోయిన పర్వాలేదు.. ఉన్నజుట్టు ఊడకుండా ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ఆలోచన. ఇందుకోసం రకరకాల ఆయిల్స్, షాంపులు ఉపయోగిస్తుంటారు. వీటివల్ల రిజల్ట్ ఏమి కనిపించదు. కాబట్టి మన ఇంట్లోనే దొరికే నాచురల్ పదార్ధాలతో ఈ హెయిర్ ఆయిల్స్‌ని ట్రై చేశారంటే.. ఖచ్చితంగా మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓసారి ట్రై చేయండి.
కరివేపాకు, కలబంద, మెంతులు హెయిర్ ఆయిల్
కలబందలోని జెల్‌ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలి. అందులో కలబంద గుజ్జు, మెంతులు వేసి కాసేపు వేడి చేయాలి. అందులో కావాల్సినంత కొబ్బరి నూనె వేసి బాగా 10-15 నిమిషాల పాటు మరిగించాలి. స్టవ్ కట్టేసి మిశ్రమాన్ని చల్లార్చి గాజు సీసాలో వడకట్టుకోవాలి. అంతే సింపుల్.. నాచురల్ హెయిర్ ఆయిల్ తయారైనట్లే.. ఈ ఆయిల్ జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ హెయిర్ ఆయిల్‌ను ప్రతి రోజు జుట్టుకు అప్లై చేయొచ్చు. దీనివల్ల జుట్టు ఒత్తుగా, సిల్కీగా, పొడవుగా పెరుగుతుంది. ఇందులో వాడే పదార్ధాలన్ని జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది.
ఉసిరి హెయిర్ ఆయిల్
ఉసిరి కాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో పావు కప్పు కొబ్బరి నూనె, గుప్పెడు కరివేపాకులు, నాలుగు, ఐదు వెల్లుల్లి రెబ్బలు, ఉసిరి ముక్కలు వేసి ఆయిల్‌ను బాగా బ్రైన్ కలర్‌లో వచ్చేంత వరకు మరిగించాలి. ఆ తరువాత స్టవ్ కట్టేసి మిశ్రమాన్ని చల్లార్చి సీసాలో వడకట్టుకోవాలి. అంతే ఉసిరి హెయిర్ ఆయిల్ రెడీ అయినట్లే..
Also Read: అందమైన పొడవాటి జుట్టుకోసం.. ఈ స్పెషల్ హెయిర్ ఆయిల్‌ను ట్రై చేయండి..
అవిసె గింజలు హెయిర్ ఆయిల్
జుట్టు పెరుగుదలకు అవిసె గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలంటే.. రెండు టేబుల్ స్పూన్ బియ్యం, రెండు టేబుల్ స్పూన్ అవిసె గింజలు, బాగా ఉడకబెట్టాలి. కొద్ది సేపటి తర్వాత జెల్ తయారవుతుంది. ఆ జెల్‌లో కలబంద గుజ్జు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించండి. గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.