IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే రిటైన్షన్ ప్రక్రియను ముగించేసింది బీసీసీఐ పాలకమండలి. ఇక త్వరలోనే వేలం కూడా నిర్వహించబోతుంది. ఈనెల 24 అలాగే 25వ తేదీలలో… ఐపీఎల్ 2025 మెగా వేలం నిర్వహించనుంది. సౌదీ అరేబియాలోని జెడ్డా లో ఈ మెగా వేలాన్ని నిర్వహించనుంది ఐపీఎల్ యాజమాన్యం.
Also Read: WTC Final: WTC ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ టీమిండియాకు ఉందా…? ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి?
అయితే మెగా వేలం దగ్గరికి వస్తున్న నేపథ్యంలో… దాదాపు 1574 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో ఇండియా అలాగే ఫారెన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. కొంతమంది రంజి ఆటగాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇందులో 400కు పైగా ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో మెగా వేలం కోసం 42 సంవత్సరాల ఓ ఫాస్ట్ బౌలర్ కూడా పేరు నమోదు చేసుకున్నాడు.
Also Read: Virat Kohli: అనుష్క శర్మ ఒక్కతే కాదు…5 మందితో హీరోయిన్లతో కోహ్లీ రిలేషన్?
ఇంగ్లాండ్ జట్టుకు ( England) చెందిన జేమ్స్ అండర్సన్ ( James Anderson)… ఈ సారి మెగా వేలంలో నిలువబోతున్నాడు. గతంలోనే జేమ్స్ అండర్సన్ మెగా వేలంలో పాల్గొంటారని వార్తలు వచ్చాయి.దానికి తగ్గట్టుగానే జేమ్స్ అండర్సన్ ఈసారి… వేలంలో ఉండబోతున్నాడు.దీనికోసం రెండు కోట్లు ఖర్చుపెట్టి… పేరు నమోదు చేసుకున్నాడట. అంతర్జాతీయ ప్లేయర్ కావడంతో.. అతనిపైన అందరి దృష్టిపడింది..
Also Read: Virat Kohli: కోహ్లీ బర్త్‌డే…కొడుకు ఫోటో షేర్ చేసిన అనుష్క శర్మ
అయితే ప్రస్తుతం 42 సంవత్సరాలు ఉన్న… జేమ్స్ అండర్సన్ ను ( England Pacer James Anderson) ఏ జట్టు కొనుగోలు చేస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు… జేమ్స్ అండర్సన్ ను కొనుగోలు చేసే ఛాన్స్ ఉందట. ఏజ్ పైబడిన ప్లేయర్లతో చెన్నై సూపర్ కింగ్స్… చాలా వింత ప్రయత్నాలు చేసి సక్సెస్ అయింది. అందుకే మహేంద్ర సింగ్ ధోని లాంటి ఆటగాడు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్… జేమ్స్ అండర్సన్ లాంటి ప్లేయర్లను కొనుగోలు చేసే ఛాన్స్ ఉందట. అయితే 2011 అలాగే 2012 సీజన్లలో వేలం జరిగితే అప్పుడు జేమ్స్ అండర్సన్ పాల్గొన్నారు.
కానీ అతన్ని ఎవరు కొనుగోలు చేయలేదు. దీంతో ఐపీఎల్ కు దూరంగా ఉండి ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలాగే రెండు కోట్ల బేస్ ప్రైజ్ తో కొంతమంది ప్లేయర్లు తమ పేరు ఖరారు చేసుకున్నారు. ఈ లిస్టులో డేవిడ్ వార్నర్, స్మిత్ కూడా ఉన్నారు. మాక్స్వెల్ మామ, విలియం సన్, మార్కు వుడ్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. ఇటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ కూడా వేలంలో పేరు రిజిస్టర్ చేయించుకున్నారు. మరి ఈ ప్లేయర్ల కోసం ఏ జట్టు ఎన్ని కోట్లు పెడుతుందో చూడాలి.