Dua Padukone Singh: బాలీవుడ్‌లో ఎంతోమంది హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందులో కొందరు వెంటనే పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేస్తే మరికొందరు మాత్రం సరైనా సమయం కోసం ఎదురుచూశారు. అలాంటి కపుల్స్‌లో దీపికా పదుకొనె (Deepika Padukone), రణవీర్ సింగ్ (Ranveer Singh) కూడా ఒకరు. వీరిద్దరూ 2018లో పెళ్లి చేసుకున్నా వీరికి పిల్లలు లేరని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటూ ఉండేవారు. అయితే చాలాసార్లు దీపికా పదుకొనె ప్రెగ్నెంట్ అని రూమర్స్ వచ్చినా ఫైనల్‌గా ఈ ఏడాది తన ప్రెగ్నెన్సీ గురించి అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది ఈ స్టార్ హీరోయిన్. ఇక తాజాగా తన కూతురి పేరును కూడా రివీల్ చేయగా.. ఆ పేరుపైనే నెటిజన్లు ట్రోల్స్ మొదలుపెట్టారు.
దీపావళి సందర్భంగా
ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నటీనటులు ఏం చేసినా దానిపై ట్రోల్స్ రావడం ఖాయం. పర్సనల్, ప్రొఫెషనల్ అని తేడా లేకుండా ప్రతీ విషయాన్ని పెద్దగా చేసి చూస్తూ నటీనటులను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకుంటారు కొందరు నెటిజన్లు. అలా చేయడం వల్ల తాము చాలా బాధపడుతున్నామని యాక్టర్లు చెప్పినా కూడా వదలరు. అలాగే తాజాగా దీపావళి సందర్భంగా తమ కూతురి పేరును, పాదాల ఫోటోను సంతోషంగా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు దీపికా పదుకొనె, రణవీర్ సింగ్. దాంతో పాటు తమ కూతురి పేరును కూడా రివీల్ చేశారు. అదే ‘దువా పదుకొనె సింగ్’ (Dua Padukone Singh). ఇప్పుడు ఈ పేరుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
Also Read: రణబీర్ కపూర్, సాయి పల్లవి ‘రామాయణ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎన్ని పార్ట్స్‌లో చేస్తున్నారంటే?
అనవసరమైన సలహాలు
దువా అనేది ఉర్దు పదం. అంటే దేవుడి ఆశీస్సులు అని అర్థం. మామూలుగా ముస్లింలు దువా అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ హిందువులు అయ్యిండి తమ కూతురికి ముస్లిం పేరు పెట్టడమేంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ విషయాన్ని అందరితో ఎందుకు పంచుకున్నామా అని వారు ఫీలయ్యేలా చేస్తున్నారు. అంతే కాకుండా వరల్డ్ వైడ్ ఫేమస్ పాప్‌స్టార్ అయిన దువా లిపా పేరుకు ఇన్‌స్పిరేష్‌గా ఈ పేరు పెట్టారేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ వారికి అదే అర్థం వచ్చేలా పేరు కావాలనుకుంటే ప్రార్థణ అని పెట్టి ఉండవచ్చు కదా అని సలహా ఇస్తున్నారు.
ఫ్యాన్స్ సపోర్ట్
ఈరోజుల్లో భార్య, భర్త పేర్లు కలిపి తమ పిల్లలకు పేర్లు పెట్టడం ట్రెండ్‌గా మారింది. అలా అయితే రణవీర్, దీపికా పేర్లు కలిసేలా తమ కూతురికి పేరు పెట్టి ఉండవచ్చు కదా అని నెటిజన్లు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక దీపికా, రణవీర్ ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరిని సపోర్ట్ చేయడానికి ముందుకొస్తున్నారు. వారిద్దరూ సంతోషంగా తమ కూతురి పేరును ప్రకటిస్తే దాని గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నారు. ఇప్పటికీ ఈ ట్రోల్స్‌పై వీరిద్దరూ ఇంకా స్పందించలేదు. ముంబాయ్‌లోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో సెప్టెంబర్ 8న దువా జన్మించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు దీపికా, రణవీర్.