BigTV English

Pimple Marks: వీటిని ఒక్కసారి వాడినా చాలు, ముఖంపై మచ్చలు మాయం

Pimple Marks: వీటిని ఒక్కసారి వాడినా చాలు, ముఖంపై మచ్చలు మాయం

Pimple Marks: ముఖం మొటిమలు ఉండటం సాధారణ సమస్య. మొటిమలు హార్మోన్ల అసమతుల్యత, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, సరైన ఆహారం తీసుకోకపోవడంతో పాటు చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల వస్తాయి. మొటిమలు ముఖం యొక్క మొత్తం అందాన్ని పాడు చేస్తాయి. ఇదిలా ఉంటే మొటిమల గుర్తులు ముఖంపై చాలా అసహ్యంగా కనిపిస్తాయి. కొన్ని సార్లు మొటిమలు తగ్గినా కూడా వాటి గుర్తులు అలాగే ఉండిపోతాయి. వీటిని తొలగించడం కూడా చాలా కష్టమైన పని. మొటిమల మరకలు కూడా మన ఆత్మ విశ్వాసాన్ని తగ్గిస్తాయి.


ఇదిలా ఉంటే కొంత మంది ముఖం మరకలు తగ్గానికి అనేక ఫేస్ క్రీములను వాడుతుంటారు. అయినప్పటికీ కొన్ని సార్లు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ కొన్ని రకాల పద్దతులను అనుసరించడం వల్ల చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. అంతే కాకుండా ముఖంపై మరకలను కూడా తొలగించుకోవచ్చు.

1. మినప పప్పు, రోజ్ వాటర్:


కావాల్సినవి:
మినప పప్పు- 2 టేబుల్ స్పూన్లు
రోజ్ వాటర్ – 2 టేబుల్ స్పూన్లు
అలోవెరా జెల్- 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం: మినప పప్పును నీటిలో అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత దీనిని మిక్సీ జార్‌లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అనంతరం ఇందులో రోజ్ వాటర్, అలోవెరా జెల్ కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి20 నిమిషాల తర్వాత వాష్ చేయాలి. ఇలా తరచుగా చేయడం వల్ల ముఖంపై ఉన్న మరకలు తగ్గుతాయి.

2. వేపాకు, తేనె:
కావాల్సినవి:

వేప ఆకుల పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
తేనె- 1 టేబుల్ స్పూన్
ఆలివ్ ఆయిల్- 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం: ముందుగా మిక్సీ ఆకులను పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత దీనిలో తేనె, ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న చోట అప్లై చేసి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని వాష్ చేయండి. తరచుగా ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి. అంతే కాకుండా ముఖం పై ఉండే మొటిమలు కూడా తగ్గుతాయి.

మరిన్ని చిట్కాలు:

ముఖంపై మచ్చలు తగ్గాలంటే శనగపిండిని ఉపయోగించడం మంచిది. దీని కోసం ఒక చెంచా శనగపిండిలో 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ తో పాటు కాస్త నిమ్మరసం వేసి పేస్ట్ తయారు చేయండి. తరంవాత ఈ పేస్టును ముఖానికి పట్టించి 10- 15 నిమిషాల తర్వాత నీటితో వాష్ చేయండి. ఈ ప్రక్రియను క్రమం తప్పకుండా చేయడం ద్వారా ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.

Also Read: మీ జుట్టు రోజు రోజుకు సన్నబడుతోందా ? ఇలా చేస్తే.. కొద్ది రోజుల్లోనే బెస్ట్ రిజల్ట్

కొబ్బరి నూనెను కూడా ముఖంపై మొటిమలు తగ్గించడానికి ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మాన్ని మెరిసేలా చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా మచ్చలను కూడా దూరం చేస్తుంది. ప్రతి రోజు పడుకునే ముందు కొబ్బరి నూనెను ముఖానికి అప్లై చేయడం వల్ల మచ్చలు పోతాయి. అంతే కాకుండా ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. పోషణను కూడా అందిస్తుంది.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×