Railways Safety Measures: భారతీయ రైల్వే తీసుకుంటున్న పలు భద్రతా చర్యలు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో సాయపడుతున్నాయి. 2014-15లో 135 రైల్వే ప్రమాదాలు జరగగా, 2023-24లో ఆ సంఖ్య 40కి తగ్గింది. 2004-14లో 1,711 రైలు ప్రమాదాలు జరిగాయి. సంవత్సరానికి సగటున 171 రైలు ప్రమాదాలు కాగా, 2014-24 కాలంలో 678కి తగ్గింది. ఇది సంవత్సరానికి సగటున 68గా తెలిపారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. 2004 మధ్య కాలంలో పలు రైలు ప్రమాదాల్లో 904 మంది చనిపోగా, 3,155 మంది గాయపడ్డారు. 2014 నుంచి 24 మధ్య కాలంలో జరిగిన ప్రమాదాల్లో 678 మంది చనిపోయారు. 2,087 మంది గాయపడ్డారు.
భారతీయ రైల్వే తీసుకుంటున్న భద్రతా చర్యలు
⦿ విద్యుత్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్: హ్యూమన్ ఎర్రర్ తో జరిగే ప్రమాదాలను తగ్గించడానికి గత ఏడాది అక్టోబర్ 31 వరకు 6,608 స్టేషన్లలో పాయింట్లు, సిగ్నల్స్ కేంద్రీకృత ఆపరేషన్ తో ఈ ఇంటర్ లాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు.
⦿ లెవెల్ క్రాసింగ్ ఇంటర్‌లాకింగ్: గత ఏడాది అక్టోబర్ 31 వరకు 11,053 లెవెల్ క్రాసింగ్ గేట్ల దగ్గర భద్రతను పెంచడానికి LC గేట్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ మార్గాల ద్వారా ట్రాక్ ఆక్యుపెన్సీని కన్ఫార్మ్ చేయడం ద్వారా భద్రతను పెంచడానికి 6,619 స్టేషన్లలో ట్రాక్ సర్క్యూట్ ఏర్పాటు చేశారు.
⦿ కవచ్ 4.0: అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రక్షణ వ్యవస్థను రైల్వేలో వినియోగిస్తున్నారు. జూలై 2020లో జాతీయ ATP వ్యవస్థగా రైల్వే స్వీకరించింది. కవచ్ ను దశల వారీగా దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. కవచ్ వెర్షన్ 4.0 విభిన్న రైల్వే నెట్ వర్క్ కు అవసరమైన అన్ని ప్రధాన లక్షణాలను కవర్ చేస్తుంది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వేలోని 1,548 కిలో మీటర్ల మేర ఇన్ స్టాల్ చేశారు. దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నారు.
Read Also: ‘కవచ్’పై కీలక నిర్ణయం.. 2 ఏండ్ల తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేసిన ఇండియన్ రైల్వే!
⦿ విజిలెన్స్ కంట్రోల్ డివైజ్ లు: లోకో పైలట్ల అప్రమత్తతను తగ్గించడానికి అన్ని లోకోమోటివ్ లలో VCDని అమర్చారు. పొగమంచు వాతావరణం కారణంగా విజుబులికీ తక్కువగా ఉన్నప్పుడు ముందున్న సిగ్నల్ గురించి సిబ్బందిని అప్రమత్తం చేయడానికి ఇవి ఉపయోగపడుతాయి.
Read Also: కిలో మీటర్ రైల్వే లైన్ నిర్మాణానికి అంత ఖర్చు అవుతుందా? మీరు అస్సలు ఊహించి ఉండరు!
⦿ఫాగ్ సేఫ్టీ డివైజ్: మంచు ప్రభావిత ప్రాంతాలలో లోకో పైలట్ లకు GPS- ఆధారిత ఫాగ్ సేఫ్టీ డివైజ్ ను అందిస్తారు. వీటి ద్వారా లోకో పైలట్ లు సిగ్నల్స్, లెవల్ క్రాసింగ్ గేట్లు సమీపించే ల్యాండ్ మార్క్ ల దూరాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతాయి.
⦿ అల్ట్రాసోనిక్ డివైజ్ లు: పట్టాల మీద లోపాలను ఉగర్తించడానికి ఆసిలేషన్ మానిటరింగ్ సిస్టమ్ (OMS), ట్రాక్ రికార్డింగ్ కార్లు ద్వారా ట్రాక్ జామిట్రిని పర్యవేక్షించడానికి పట్టాల ఆలస్ట్రా సోనిక్ డివైజ్ పరీక్షలను నిర్వహిస్తారు.