BigTV English

Hair Fall: మీ జుట్టు రోజు రోజుకు సన్నబడుతోందా ? ఇలా చేస్తే.. కొద్ది రోజుల్లోనే బెస్ట్ రిజల్ట్

Hair Fall: మీ జుట్టు రోజు రోజుకు సన్నబడుతోందా ?  ఇలా చేస్తే.. కొద్ది రోజుల్లోనే బెస్ట్ రిజల్ట్

Hair Fall: సాధారణంగా జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. హార్మోన్ల అసమతూల్యత, ఒత్తిడితో పాటు పోషకాహార లోపం వంటి అనేక కారణాల వల్ల, మీ జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం, సన్నబడటం ప్రారంభమవుతుంది. థైరాయిడ్, PCOS తో పాటు అనేక ఇతర కారణాల వల్ల కూడా జుట్టు రాలుతుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల జుట్టు పెరుగుదల మరింత దెబ్బతింటుంది. దీని వల్ల వెంట్రుకల కుదుళ్లు బలహీనంగా మారడం ప్రారంభిస్తాయి. మీ జుట్టు విపరీతంగా రాలిపోతుంటే, మీ జడ సన్నగా మారి, జుట్టు పెరుగుదల ఆగిపోయినట్లయితే, డైటీషియన్ సిఫార్సు చేసిన ఈ సీక్రెట్ పౌడర్‌ని గోరువెచ్చని నీటిలో కలిపి రోజు తాగడం వల్ల మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా తయారవుతుంది. ఈ పౌడర్ జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా థైరాయిడ్ , ఐరన్ లెవెల్స్‌ను కూడా పెంచుతుంది. మరి ఈ పౌడర్ తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సినవి:
జీలకర్ర – 1 టీ స్పూన్
నిగెల్లా విత్తనాలు – అర టీస్పూన్
ఆలివ్ గింజలు – 1/4 స్పూన్
కొత్తిమీర గింజలు – 2 టేబుల్ స్పూన్లు
గుమ్మడికాయ గింజలు – 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:
ముందుగా పైన తెలిపిన పదార్థాలను డ్రై రోస్ట్ చేయండి. ఇప్పుడు వీటన్నింటినీ పౌడర్‌గా చేసుకోవాలి. తర్వాత ఒక టీస్పూన్ ఈ పొడిని 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపండి. అందులో 1 టీస్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా చేయడం ద్వారా పోషకాలు శరీరంలో సరిగ్గా శోషించబడతాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని త్రాగాలి.


1. జీలకర్రలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమిస్తుంది. అంతే కాకుండా థైరాయిడ్ పని తీరును కూడా మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ జుట్టుకు బలాన్ని చేకూరుస్తాయి.

2. నిగెల్లా గింజలు జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి జుట్టు కుదుళ్లను కూడా బలపరుస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫలితంగా జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదల కూడా చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. నిగెల్లాలో లినోలెయిక్ యాసిడ్, థైమోక్వినోన్ , నిగెల్లాస్‌తో పాటు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్ రూట్‌లను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. ఇది స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా చాలా బాగా పనిచేస్తాయి.

3. గుమ్మడి గింజల్లో బయోటిన్ తో పాటు మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇవి బయోటిన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

Also Read: తిన్న తర్వాత 15 నిమిషాలు నడిస్తే.. మతిపోయే లాభాలు

4. ఆలివ్ గింజలు జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే ఐరన్ విటమిన్ ఇ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

5. కొత్తిమీర గింజల్లో కూడా పుష్కలంగా ఐరన్ ఉంటుంది. ఇది సెబమ్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

జుట్టు పొడవుగా, ఒత్తుగా, దృఢంగా ఉండాలంటే నిపుణులు సిఫార్సు చేసిన విధంగా ఈ ప్రత్యేకమైన పొడిని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. మీకు ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉంటే దీనిని వాడకుండా ఉంటేనే మంచిది.

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×