BigTV English

Face Pack For Skin: జిడ్డు చర్మాన్ని కూడా ఈ ఫేస్‌తో మెరిసేలా చేయొచ్చు తెలుసా ?

Face Pack For Skin: జిడ్డు చర్మాన్ని కూడా ఈ ఫేస్‌తో మెరిసేలా చేయొచ్చు తెలుసా ?

Face Pack For Skin: అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు అందంగా కనిపించడం కోసం రకరకాల ఫేస్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అంతే కాకుండా కొన్ని రకాల హోం రెమెడీస్ ట్రై చేస్తారు. బయట మార్కెట్లో రసాయనాలతో తయారు చేసిన ఫేస్ కేర్ ప్రొడక్ట్స్ కాకుండా నేచురల్ ప్రొడక్ట్స్ ఇంట్లోనే తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఇవి చర్మాన్ని కాంతి వంతంగా మారుస్తాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.


కొన్నిసార్లు పని, ఇతర బాధ్యతల కారణంగా మహిళలు పార్లర్‌కు వెళ్లడానికి కూడా సమయం దొరకదు. అటువంటి సమయంలో మీరు రాత్రి పడుకునే ముందు బియ్యం పిండి, రోజ్ వాటర్, అలోవెరా జెల్‌తో పాటు వాటితో ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌ను అప్లై చేస్తే చాలు.. ఉదయం వరకు మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. ఎలాంటి జిడ్డు చర్మం ఉన్న వారికైనా ఈ ఫేస్ ప్యాక్‌లు చాలా బాగా పనిచేస్తాయి. అంతే కాకుండా మీ అందాన్ని కూడా పెంచుతాయి. ఈ ఇన్‌స్టంట్ గ్లో కోసం ఫేస్ ప్యాక్‌ని ఇంట్లోనే తయారు చేసుకునే సులభమైన మార్గాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫేస్ ప్యాక్ కోసం కావలసినవి..


బియ్యం పిండి- 3 స్పూన్లు
కలబంద జెల్- 1 టీస్పూన్
రోజ్ వాటర్- 4 స్పూన్లు
పచ్చి పాలు- తగినంత
విటమిన్ ఇ క్యాప్సూల్- 1

ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి:

ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యం పిండి , అలోవెరా జెల్, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను స్మూత్‌గా చేయడానికి, అవసరాన్ని బట్టి పచ్చి పాలు వేసి, ఆపై విటమిన్ ఇ క్యాప్సూల్‌ను వేసి, అన్నింటినీ మళ్లీ బాగా కలపండి. ఇప్పుడు మీ ఫేస్ ప్యాక్ సిద్ధంగా ఉంది. రాత్రి సమయంలో మీ ముఖంపై ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయండి.

20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై నీటితో మీ ముఖాన్ని కడగాలి. అనంతరం రాత్రి పడుకునే ముందు మీ ముఖంపై తేలికపాటి మాయిశ్చరైజర్‌ను జాగ్రత్తగా రాయండి. ఈ ఫేస్ ప్యాక్ తో మీరు పార్లర్‌కి వెళ్లకుండానే పార్లర్‌లాంటి గ్లో పొందవచ్చు.

Also Read: ఖరీదైన క్రీములు అవసరమే లేదు.. వీటితో ఇన్స్టంట్ గ్లో

తరుచుగా ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా  ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై జిడ్డును తొలగిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పసుపులోని యాంటీఆక్సిడెంట్లు ముఖంపై మొటిమలు రాకుండా చేస్తాయి. అంతే కాకుండా చర్మాన్ని కాంతివంతగా మారుస్తాయి. రోజ్ వాటర్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఫలితంగా స్కిన్ గ్లో పెరుగుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×