BigTV English

India China LAC Agreement : చైనాతో దోస్తీ.. పాక్‌తో కుస్తీ.. దాయాదికి చెమటలు పట్టించే వ్యూహం, వర్కవుట్ అయ్యేనా?

India China LAC Agreement : చైనాతో దోస్తీ.. పాక్‌తో కుస్తీ.. దాయాదికి చెమటలు పట్టించే వ్యూహం, వర్కవుట్ అయ్యేనా?

 India China LAC Agreement : గల్వాన్ ఘటన తర్వాత నాలుగేళ్లుగా ఉప్పునిప్పులా ఉన్న భారత్ – చైనా (India -Chaina) సంబంధాలు… బ్రిక్స్ సదస్సు వేదికగా అనుకోని మలుపు తిరిగాయి. రష్యా వేదికగా సమావేశమైన బిక్స్ కూటమి పక్షాలు… అనేక సమస్యలపై చర్చించుకున్నాయి. అయితే వాటిలో… భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జింగ్ పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు.. ఈ రెండు దేశాల సంబంధాల్లో సరికొత్త మార్పులకు కారణమైయ్యాయి.


ఈ సమావేశంలో 2020లో ఏర్పడిన ఉద్రిక్తతలకు పరిష్కారం సాధించే దిశగా ఇరుదేశాల అధినాయకత్వాలు చర్చలు చేశాయి. వాటి ఫలితంగానే గల్వాన్ ఘటన తర్వాత సరిహద్దుల వెంబటి భారీగా మొహరించిన ఇరుదేశాల సైన్యాలను క్రమంగా ఉపసంహరించుకోవాలని వీరు నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో దక్షిణాసియాలోనే రెండు పెద్ద దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారినట్లేనని అంతా భావిస్తున్నారు.

ఈ ఒప్పందాలు… అందరికీ సంతోషాన్ని కలిగించవచ్చు. కానీ… దాయాది పాకిస్థాన్ కు మాత్రం ఈ పరిణామాలు మింగుడుపడడం లేదు. భారత్ ను నిత్యం ఇబ్బందులకు గురిచేయాలని కాచుకుకూర్చునే పాకిస్థాన్… భారత్ తో చైనా శాంతిహస్తం చాచడాన్ని అంగీకరించలేకపోతోంది. ఇన్నాళ్లు శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న తరహాలో చైనాతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన పాకిస్థాన్… ఇప్పుడు భారత్, చైనా సంబంధాల్లో పురోగతిని చూసి కుళ్లుకుంటోంది.


పాక్ అక్రమిత కశ్మీర్ అంశంలో పాక్ పై వరుసగా ప్రకటనలు చేస్తున్న భారత్ నాయకత్వం… ఏదైనా తీవ్ర చర్యలు తీసుకుంటే, సరిహద్దుల్లో కాచుకుకూర్చుకున్న చైనా తనకు సాయంగా నిలుస్తుందని భావించింది. కానీ… ఇప్పుడు భారత్, చైనాల మధ్య దళాల ఉపసంహరణ ఒప్పందం కుదరడంతో దాని కుయుక్తులు పారవని బెంబేలెత్తిపోతోంది. ఇరుదేశాల ఒప్పందం మేరకు… ఇప్పటికే.. భారత్, చైనా సరిహద్దుల్లో దళాలు వారివారి మొహరింపులు తగ్గించి, పూర్వ స్థితికి వెళుతున్నాయి.

తమ శిబిరాల్ని ఖాళీ చేసి… 2020 కి ముందు నాటి స్థితిని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ ఏవైనా ఉద్రిక్తతలు తలెత్తినా… కాల్పులకు పాల్పడకూడదనే ఒప్పందానికి కట్టుబడేలా చర్చలు చేస్తున్నాయి. ఇవ్వన్నీ దాయాది పాకిస్థాన్ కు కడుపుమంట కలిగించే అంశాలే.

భారత్ తో దోస్తీకి చైనా సిద్ధం… తాజా వైఖరికి ప్రధాన కారణాలు ఇవే

కరోనా తర్వాత చైనాపై ప్రపంచ దేశాల దృక్పథం పూర్తిగా మారిపోయింది. చైనా ఎదుగుదల ఇతర దేశాల ఉనికికి ప్రమాదంగా అంతా భావించారు. ఈ కారణంగానే… చైనాతో వ్యాపార లావాదేవీలను తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇది… అక్కడి పరిశ్రమలు, ఉపాధి రంగంపై తీవ్రంగా ప్రభావం చూపింది. చైనాలో తక్కువ వేతనాలకు లభించే కార్మిక శక్తి కారణంగా అక్కడ నెలకొల్పిన చిప్ పరిశ్రమ సైతం ఇతర దేశాలకు తరలిపోయేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

దాంతో పాటే చైనా ఆర్థిక వ్యవస్థను అక్కడి రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర కుదుపునకు గురిచేసింది. అంతర్జాతీయ విపణిలో తన ఉత్పత్తుల వాటాను పెంచుకునేందుకు చేపట్టిన రోడ్ అండ్ బెల్ట్ ప్రాజెక్టుకు అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఇలా…అనేక రకాలుగా అంతర్జాతీయంగా చైనా అప్రతిష్ట మూటగట్టుకోవడంతో… భారత్ తో ఘర్షణాత్మక వైఖరిని మార్చుకోక తప్పని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు… ఇటీవల ద్వీపదేశమైన తైవాన్ విషయంలో చైనా దూకుడుగా వెళుతుంది.

తైవాన్ ను చైనాలో భాగంగా చెబుతున్న చైనా… ఎవరైనా కాదంటే యుద్ధానికి సైతం సిద్ధమంటూ ప్రకటించింది. హిందూ మహాసముద్రంలో తన అధిపత్యాన్ని నిలుపుకునేందుకు సైతం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో భారత్ తో తగాదా దాని భద్రతకు మంచిదికాదని భావించి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ తైవాన్ ను సైనిక చర్య ద్వారా ఆక్రమించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో పాశ్చాత్య దేశాల మద్ధతుతో భారత్.. యుద్ధానికి సిద్ధమంటే చైనాకు కష్టమే. అందుకే… క్రమంగా తన చుట్టూ ఉన్న వివాదాల్ని సరిదిద్దుకుంటూ.. తైవాన్ అక్రమణ పైనే ప్రధానంగా దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్ తో దోస్తీకి మరికొన్ని కారణాలు సైతం లేకపోలేదు. హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం దాని నావికా బలాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. కానీ… ఈ చర్యలను చాలా దేశాలు అంగీకరించడం లేదు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా… చైనా తీరుపై గుర్రుగా ఉంది. అంతర్జాతీయ సముద్ర జలాల్ని సైతం చైనా తనవిగా చెప్పుకోవడాన్ని తప్పుబడుతోంది. పైగా… అక్కడి చిన్నచిన్న ద్వీప దేశాలను భయాందోళనలకు గురిచేయడాన్ని వ్యతిరేకిస్తూ… చైనా ఆధిపత్యాన్ని నిలువరించేందుకు భారత్, అమెరికా, అస్ట్రేలియా కూటమిగా క్వాట్జ్ పేరుతో జట్టు కట్టాయి.

ఈ కూటమి లక్ష్యం చైనాను ఇరుకున పెట్టడమే అన్నది బహిరంగ రహస్యమే. ఇలా… బలమైన దేశాలు జట్టుగా తనకు వ్యతిరేకంగా పనిచేస్తుండడంతో ఆయా దేశాలతో స్నేహానికి చైనా వ్యూహాత్మకంగా ప్రయత్నాలు చేస్తోందన్న వాదన ఉంది. ఇందులో భాగంగానే.. భారత్ తో చైనా ప్రస్తుత ఒప్పందం చేసుకున్నట్లు కనిపిస్తోంది.

పాకిస్థాన్ తో చెడిన చైనా స్నేహం… దిగజారిన పాక్ పరిస్థితులే కారణమా..?

అంతర్జాతీయ మార్కెట్లో తన ఉత్పత్తులని తక్కువ ధరల్లో అందించేందుకు చైనా ప్రతిష్టాత్మకంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో ఓ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది పాకిస్థాన్ భూభాగంగా చెప్పుకునే పాక్ అక్రమిత కశ్మీర్ (POK) నుంచి గ్వాదర్ పోర్టు వరకు విస్తరించి ఉంటుంది. అందుకే… చైనా పాకిస్థాన్ లోని గ్వాదర్ పోర్టును సైతం అభివృద్ధి చేసేందుకు లీజుకు తీసుకుంది.

అయితే… పాక్ అర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతుండడంతో… చైనా దగ్గర భారీగా అప్పులు తీసుకుంది. చైనా అవసరం దృష్ట్యా కాదనకుండా డబ్బులు సమకూర్చింది. కానీ… వాస్తవంలో చైనాకు పాకిస్థాన్ లో వ్యతిరేక పరిస్థితులు ఎదురయ్యాయి. పాక్ పాలకులపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న బెలుచిస్థాన్ ప్రజలు.. చైనా నిర్మాణాలకు అడుగడుగునా అడ్డుకున్నారు. అనేక సార్లు సాయుధులైన బెలూచు ప్రజలు… చైనా కార్మికులు, ఇంజినీర్లపై దాడులకు పాల్పడ్డారు. ఈ చర్యలు చైనాకు ఇబ్బందికరంగా మారాయి. అక్కడ పనిచేసేందుకు చైనా కార్మికులు ముందుకు రాకపోవడం, స్థానిక ప్రజల నుంచి తీవ్ర తిరుగుబాటులో చైనా ప్రాజెక్టు ముందుకు సాగని పరిస్థితులు నెలకొన్నాయి.

బెలూచిస్థాన్ ప్రజల స్వాతంత్య్ర పోరాటం తీవ్ర స్థాయికి చేరుకోవడం, చైనా ప్రాజెక్టుకు సృష్టిస్తున్న అడ్డంకులను నిలువరించడంలో పాకిస్థాన్ విఫలమైందని చైనా ఆగ్రహంగా ఉంది. భారత్ ను ఇరకాటంలో పెట్టేందుకు… సముద్ర మార్గంలో భారత్ నావీపై నిఘా పెట్టేందుకు ఎంచుకున్న గ్వాదర్ పోర్టు అభివృద్ధిలోనూ చైనాకు చిక్కులు తప్పలేదు. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అన్న తీరుగా చైనా వ్యూహాలు దానికి బెడిసికొట్టడం, పాకిస్థాన్ సైతం పరిస్థితుల్ని చక్కదిద్దకపోవడంతో చైనా క్రమంగా పాక్ ను పక్కన పెడుతోందంటున్నారు.

Also Read: ‘కష్టజీవుల బతుకులు భారం.. ఏమీ మిగలడం లేదు’.. రాహుల్ గాంధీ ట్వీట్ వైరల్

ఇదే క్రమంలో భారత్ తో తన దీర్ఘకాల వైరాన్ని క్రమంగా పక్కన పెడుతుండడం… పాక్ వల్ల తన పని కాదని చైనా భావించడమే కారణంగా చెబుతున్నారు. పైగా.. అంతర్జాతీయంగా పాక్ ప్రతిష్ట రోజురోజుకు దిగజారిపోతోంది. అంతర్జాతీయ వేదికలపై పాక్ ను అన్ని దేశాలు పక్కన పెట్టాయి. అక్కడి అస్థిర ప్రభుత్వాలు, పాలనలో సైన్యం జోక్యం పెరుగుతుండడం సహా… అరబ్ దేశాలు సైతం పాక్ ను నిత్యం అప్పులపై బతికే దేశంగా చూస్తుండడంతో పాక్ తో దోస్తీ దీర్ఘ కాలంలో కలిసి రాదని చైనాకు బోధపడిందంటున్నారు… అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. ఈ పరిణామాలే చైనా తాజా వైఖరికి కారణంగా భావిస్తున్నారు.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×