BigTV English

Homemade Hair Oils: జుట్టు పెరగడానికి బెస్ట్ హోం మేడ్ ఆయిల్స్

Homemade Hair Oils: జుట్టు పెరగడానికి బెస్ట్ హోం మేడ్ ఆయిల్స్

Homemade Hair Oils For Hair Growth: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు తాపత్రయ పడుతుంటారు. అందం విషయంలో జుట్టు కూడా కీలకమైందే. కానీ ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే వివిధ రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అందులో జుట్టు రాలడం సమస్య కూడా ఒకటి. అంతే కాకుండా జుట్టు నెరిసిపోవడం, చుండ్రు ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నా వారు చాలా మంది ఉంటారు.


ఈ సమస్యల నుంచి బయటపడేందుకు మార్కెట్లో దొరికే వివిధ రకాల హెయిర్ హెయిర్ ఉత్పత్తులు, ఆయిల్స్‌ను వాడుతుంటారు. ఇవన్నీ ట్రై చేసినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాంటి వారు సహజంగా ఇంట్లోనే ఈ హెయిర్ ఆయిల్స్ తయారు చేసుకుని వాడితే జుట్టు పెరగడాన్ని ఎవరూ ఆపలేరని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ నూనెలు ఏంటి ఏలాల తయారు చేస్తారనే దానిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కలోంజి నూనె:
కలోంజి నూనె జుట్టు పెరగడంలో కూడా సహాయపడుతుంది అంటున్నారు నిపుణులు. దీని ద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
ఇది ఎలా చేయాలంటే..

  • ముందుగా ఒక కప్పు కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను ఒక గిన్నెలో తీసుకుని మంటపై వేడి చేయండి.
  • అందులో ఒక చెంచా కలోంజి గింజలు వేసి ఉడికించండి. ఆ తర్వాత నూనెను వడగట్టి సీసాలో స్టోర్ చేసుకోవాలి.
  • ఈ నూనె జుట్టుకు పట్టించడం ద్వారా జింక్, ఐరన్, పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాలను జుట్టుకు అందుతాయి. దీంతో జుట్టు పెరుగుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది

బాదం నూనె:
పొడవాటి, మందమైన జుట్టు కోసం వారానికి రెండుసార్లు బాదం నూనెను తలకు మసాజ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. తద్వారా జుట్టు పెరుగుదల బాగుంటుంది. అలాగే బాదం నూనెతో జుట్టు మూలాలు కూడా బలంగా తయారవుతాయి. అంతే కాకుండా జుట్టు మృదువుగా మారుతుంది. జుట్టుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. చివరలు చిట్లే సమస్యతో పాటు ఇతర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కరివేపాకు నూనె:
కరివేపాకు, కొబ్బరి నూనెతో తయారు చేసిన ఆయిల్ జుట్టుకు వాడటం వల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండటమే కాకుండా జుట్టు రాలిపోయే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎలా తయారు చేయాలంటే..


  • వంద గ్రాముల నూనెలో కొన్ని కరివేపాకులు వేసి బాగా ఉడికించాలి.
  • చల్లారిన తర్వాత వడగట్టి గాజు సీసాలో పెట్టుకోవాలి.
  • ఈ నూనెను ఇతర నూనెల మాదిరిగా తలకు మసాజ్ చేసి ఉపయోగించవచ్చు.

Tags

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×