E-Paper
Advertisement

చలికాలంలో జుట్టు పొడిబారే సమస్య.. నో టెన్షన్ ఈ 4 రకాలపూలతో హెయిర్ కేర్ చేయండి

చలికాలంలో జుట్టు పొడిబారే సమస్య.. నో టెన్షన్ ఈ 4 రకాలపూలతో హెయిర్ కేర్ చేయండి
Advertisement

Winter HairCare Flowers| చలికాలం వచ్చిందంటే చర్మంతో పాటు జుట్టు సమస్యలు కూడా మొదలవుతాయి. చల్లటి గాలులు, వాతావరణంలోని తేమ తగ్గడం వల్ల జుట్టు పొడిబారుతుంది. వెంట్రుకలు గరుకుగా మారి, చిక్కులు పడటంతో పాటు కొందరు జుట్టు రాలే సమస్య కూడా ఇబ్బంది పెడుతుంది. దీంతో చాలామంది ఖరీదైన షాంపూలు, కండిషనర్లు, హెయిర్ మాస్కుల కోసం డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అయితే మన చుట్టూ దొరికే కొన్ని సహజసిద్ధమైన పూలతో కూడా జుట్టుకు సంరక్షణ అందించవచ్చు. ఈ పూలను హెయిర్ కేర్‌లో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

1. మందార పూలు.. జుట్టుకు తేమ అందిస్తాయి

మందార పూలు సంప్రదాయ హెయిర్ కేర్‌లో ఎంతో ప్రాచుర్యం పొందాయి. వీటితో పాటు మందార ఆకులను కూడా జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా పొడిబారిన జుట్టుకు మందారతో తయారుచేసిన హెయిర్ మాస్క్ ఉపయోగపడుతుంది. ముందుగా కొన్ని మందార పూలను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. అందులో కొద్దిగా అలోవెరా జెల్ కలిపి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు, తల చర్మానికి పట్టించాలి. సుమారు 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది జుట్టును మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.

2. పారిజాత పూలు.. సంప్రదాయ పద్ధతిలో జుట్టు సంరక్షణ

Advertisement

పారిజాత పూలు తెలుపు రంగులో ఉండి, మధ్యలో నారింజ రంగును కలిగి ఉంటాయి. వీటికి మంచి సువాసన ఉంటుంది. పారిజాత పూలు, ఆకులను సంప్రదాయ గృహ చిట్కాల్లో ఉపయోగిస్తుంటారు.
కొంతమంది వీటిని హెయిర్ కేర్ తయారీల్లో కూడా ఉపయోగిస్తారు. అయితే జుట్టు రాలే సమస్యకు ఇవి కొంతవరకే ఆపగలుగుతాయి. కాబట్టి వీటిని నిర్ధారిత చికిత్సగా భావించకూడదు.

Also Read: వియత్నాంలో లవ్ మార్కెట్ గురించి తెలుసా? ఏడాదిలో ఒక్కరోజు జరిగే ప్రేమికుల విచిత్ర వేడుక

3. గులాబీ పూలతో తల చర్మం ఫ్ఱెష్‌గా ఉంటుంది

Advertisement

గులాబీ పూలను అందం కోసం మాత్రమే కాకుండా హెయిర్ కేర్‌లో కూడా ఉపయోగిస్తుంటారు. గులాబీ రేకులతో రోజ్ వాటర్ తయారుచేసుకోవచ్చు. ఇది తల చర్మానికి తాజాగా అనిపించేలా చేస్తుంది. స్నానం చేసిన తర్వాత రోజ్ వాటర్‌ కొద్దిగా సాధారణ నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని తలపై మెల్లగా అప్లై చేసుకోవచ్చు. ఆల్కహాల్ లేని, అధిక సువాసనలు కలపని స్వచ్ఛమైన రోజ్ వాటర్‌ ఎంచుకోవడం మంచిది.

4. మల్లెపూలతో జుట్టుకు కండిషనింగ్

మల్లెపూలు మంచి సువాసనను కలిగి ఉంటాయి. వీటిని కొబ్బరి నూనెలో కలిపి సంప్రదాయ పద్ధతిలో జుట్టుకు ఉపయోగిస్తుంటారు. కొద్దిగా కొబ్బరి నూనెలో కొన్ని మల్లెపూలు వేసి తక్కువ మంటపై గోరువెచ్చగా చేయాలి. అనంతరం చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి. ఈ నూనెతో తలపై మెల్లగా మసాజ్ చేసుకోండి. ఇది పొడిబారిన జుట్టును మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.

Also Read: చలికాలంలో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? మంచు కొండల మధ్య ఈ 5 ప్రాంతాలు సూపర్

పూలతో హెయిర్ కేర్ చేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి

సహజసిద్ధమైన పదార్థాలు అందరికీ సరిపోవాలని లేదు. కాబట్టి కొత్త చిట్కా ప్రయత్నించే ముందు చర్మంపై కొద్దిగా అప్లై చేసి పరీక్షించుకోవాలి. శుభ్రమైన పూలనే ఉపయోగించాలి. దురద, మంట లేదా అలర్జీ వస్తే వెంటనే వాడటం ఆపేయాలి.

ఈ చిట్కాలు సాధారణ జుట్టు సంరక్షణకు మాత్రమే ఉపయోగపడవచ్చు. జుట్టు విపరీతంగా రాలుతున్నా, తల చర్మంపై సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించాలి.

Related News

ముక్కుపై బ్లాక్‌హెడ్స్‌తో ఇబ్బందిగా ఉందా? ఇంట్లోనే ఈ సింపుల్ ఫేస్ మాస్క్ ట్రై చేయండి

రోజూ తినే ఎగ్ కర్రీ బోర్ కొట్టిందా?అయితే ఈ మెంతి కోడిగుడ్డు కూర ట్రై చేయండి!

మినప అప్పడాలు..ఇలా చేస్తే బయటి వాటి కంటే మంచి రుచి!

అమ్మమ్మల కాలం నాటి బీరకాయ రోటి పచ్చడి..సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ!

చాక్లెట్లు, బొమ్మల ఆశ చూపించి పిల్లలను మోసం చేసే వారితో జాగ్రత్త.. తల్లిదండ్రులు ఈ 7 విషయాలు నేర్పాలి

మీకు తెలుసా నెమళ్లు విషపూరిత పాములను చంపి తిన్నా చనిపోవు.. ఎందుకంటే

తొలి పరిచయంలోనే ఆకట్టుకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఆకర్షణ ఎక్కువ

విదుర నీతి.. ఈ 4 గుణాలు ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి వస్తుంది.. డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు?

Big Stories

Advertisement
×