Campus Diaries Season 2 OTT: కాలేజీ రోజులు అంటేనే ఒక మధురమైన జ్ఞాపకం. అక్కడ జరిగే సరదా అల్లర్లు, స్నేహితుల మధ్య బాండింగ్, మొదటి ప్రేమ తాలూకు అనుభూతులు ఎప్పటికీ మర్చిపోలేం. అయితే చదువు పూర్తయ్యే సమయానికి మాత్రం ఎన్నో కొత్త సమస్యలు ఎదురవుతాయి. కెరీర్‌పై ఆందోళన, ప్రేమలో ఒడిదుడుకులు, స్నేహితుల మధ్య మనస్పర్థలు.. ఇలా ఒక్కో సమస్య యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. ఇలాంటి యూత్‌ఫుల్ అంశాలతో గతంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెబ్‌సిరీస్ ‘క్యాంపస్ డైరీస్’ ఇప్పుడు రెండో సీజన్‌తో తిరిగొచ్చింది. మరింత ప్రేమ, ఎమోషన్స్, ఊహించని పరిణామాలతో రూపొందిన ‘క్యాంపస్ డైరీస్ సీజన్ 2’ (Campus Diaries Season 2) నవంబర్ 18 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈసారి ఎక్సెల్ యూనివర్సిటీలో ఏం జరిగింది? ఈ సిరీస్‌ను ఎక్కడ ఉచితంగా చూడవచ్చో తెలుసుకుందాం పదండి.
ఎక్సెల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఆరుగురు స్నేహితులు మరోసారి తమ కాలేజీ జీవితంలోకి అడుగుపెడతారు. అయితే ఈసారి వారి ముందు ఉన్నది కేవలం చదువు, సరదాలు మాత్రమే కాదు. ప్రేమలో ఎదురయ్యే సమస్యలు, మారుతున్న స్నేహాలు, కాలేజీ ఫెస్ట్ రాజకీయాలు, భవిష్యత్తుపై ఆందోళనలు వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. సుధీర్ తన ప్రేమ విషయంలో గందరగోళానికి గురవుతుంటే, సన్యా, రాఘవ్‌ల మధ్య సంబంధం కొత్త మలుపులు తిరుగుతుంది. మరోవైపు అభిలాష్, సుష్మితల బంధంలోనూ మనస్పర్థలు మొదలవుతాయి. కాలేజీ ఫెస్ట్ చుట్టూ జరిగే మోసం కూడా స్నేహితుల మధ్య మరిన్ని సమస్యలకు కారణమవుతుంది.
ఇలా ప్రేమలు, బ్రేకప్‌లు, గొడవలతో సాగుతున్న వారి జీవితాల్లో ఒకరోజు ఊహించని సంఘటన చోటుచేసుకుంటుంది. విద్యార్థులకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు లీక్ కావడంతో క్యాంపస్‌లో కలకలం మొదలవుతుంది. ఈ ఘటనలో శ్రుతిపై నిందలు పడటంతో ఆమె స్నేహితులు అసలు నిజాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఆ వీడియోల వెనుక ఉన్నది ఎవరు? విద్యార్థులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నది ఎవరు? తమ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా చివరకు స్నేహితులంతా ఒక్కటై న్యాయం కోసం ఎలా పోరాడారనేదే ఈ సీజన్‌లో ఆసక్తికరమైన అంశం. కాలేజీ జీవితంలోని సరదాలతో పాటు డిజిటల్ భద్రత, వ్యక్తిగత గోప్యత వంటి అంశాలనూ ఈ సిరీస్‌లో చూపించారు.
ఈ సిరీస్‌లో హర్ష్ బెనివాల్, రిత్విక్ సాహోర్, అభినవ్ శర్మ, సృష్టి గంగూలీ రిందానీ, సలోనీ పటేల్, సలోనీ గౌర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అభిషేక్ యాదవ్ దర్శకత్వం వహించిన ఈ సీజన్‌లో మొత్తం 10 ఎపిసోడ్‌లు ఉన్నాయి. 2026 నవంబర్ 18 నుంచి Amazon MX Playerలో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. Prime Videoలోనూ ‘Watch for free’ ఆప్షన్ ద్వారా చూడవచ్చు. ప్రస్తుతం హిందీ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ మాత్రం లేదు.