E-Paper
Advertisement

నాగవ్వ పల్లె గొంతు.. మధుప్రియ మాస్ వాయిస్.. కట్ చేస్తే మిలియన్ల వ్యూస్

నాగవ్వ పల్లె గొంతు.. మధుప్రియ మాస్ వాయిస్.. కట్ చేస్తే మిలియన్ల వ్యూస్
Advertisement

Nagavva Folk Songs:నాగదుర్గ ..ఫోక్ క్వీన్ గా పేరొందిన ఈ భామ ఎన్నో పాటలతో మనల్ని అలరించి ఇపుడు ఇడుపు కాయితం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు జానపదాలని కూడా వదలనంటూ వరుస ఫోక్ సాంగ్స్ తో అలరిస్తూనే ఉంది.ఇందులో భాగంగా తాజాగా ‘బంగుల’ అంటూ మరో ఫోక్ సాంగ్ తో మన ముందుకు రాగా ఈ పాట వచ్చిన 40 రోజుల్లోనే ఏకంగా 28 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకోవడం విశేషం.

పైగా కమల్ ఈశ్లావత్ లిరిక్స్ అందించగా ఫోక్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తున్న మధుప్రియ,నాగవ్వ కలిసి పాడటం విశేషం.ముఖ్యంగా గత కొంతకాలంగా నాగవ్వ ఫోక్ ఇండస్ట్రీలో ఎలా దూసుకుపోతుందో చెప్పక్కర్లేదు.ఇక మధు ప్రియ చిన్నప్పటి నుండి పాటలు పాడుతూ మనందరినీ అలరిస్తూనే ఉంది.ఇక ప్రస్తుత ఫోక్ ఇండస్ట్రీని శాసిస్తున్న మదీన్ sk ఈ పాటకి అధ్బుతమైన సంగీతాన్ని అందించగా కోరియోగ్రఫీలో శేఖర్ వైరస్ కి గట్టి కాంపిటీషన్ ఇస్తున్న లీడింగ్ బాయ్స్ దీనికి స్టెప్పులు సమకూర్చి పాటని నెక్స్ట్ లెవెల్ లో పెట్టేశారు.

Advertisement

నెట్టింటిని షేక్ చేసిన  ఫోక్ క్వీన్

నాగ దుర్గ విషయానికి వస్తే ఎర్ర ఎర్ర రుమాల్ అంటూ నెట్టింటిని షేక్ చేసిన ఈ ఫోక్ క్వీన్ నా పేరే ఎల్లమ్మ,పేరుగళ్ళ పెద్ది రెడ్డి, మామిడి కొనాల మీద, దారిపొంటత్తుండు,తిన్నా తీరం పడుతలే, జిల్లెలమ్మ జిట్ట అంటూ ఎన్నో పాటలతో ఫోక్ లవర్స్ ని మెస్మరైజ్ చేసింది.ముఖ్యంగా నాగ దుర్గ స్టెప్పు వేస్తే పాట మిలియన్ల వ్యూస్ ని టచ్ చేయాల్సిందే అని ఎర్ర ఎర్ర రుమాల్,పేరుగళ్ళ పెద్ది రెడ్డి వంటి ఎన్నో పాటలు ప్రూవ్ చేశాయి కూడా.

Advertisement

ALSO READ:ఒక్కో పాటతో ఒక్కో రేంజ్..యమునా తారక్ టాప్ సాంగ్స్ ఇవే!

కేవలం 11 నెలల్లోనే ఏకంగా 189 మిలియన్ల వ్యూస్

ఇక ఈ పాటకి తనదైన పల్లె గొంతుతో ప్రాణం పోసింది నాగవ్వ. బాయిలోనా పల్లికే అనే పాటతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కేసిన నాగవ్వ అప్పటి నుండి మామిడి కోనాల మీద , బిందె మీద మిందే పెట్టి ,మోహన లాలి, ఎద్దులచ్చే ముద్దువెట్టే అంటూ ఎన్నో పాటలతో అలరిస్తూనే ఉంది.ముఖ్యంగా బాయిలోనా పల్లికే అనే పాట కేవలం 11 నెలల్లోనే ఏకంగా 189 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది.

మరో వైపు ఈ పాటకి నాగవ్వతో కలిసి గొంతు కలిపిన మధుప్రియ గురించి ఎంత చెప్పినా తక్కువే, చిన్నప్పుడే ఆడపిల్లనమ్మా అంటూ మొదలెట్టి సిల్లం సాయి కట్ట కింద, మాయాదరి మత్తు, పెద్దపులి మైసమ్మ, అనే జానపదాలతో పాటు వచ్చిండే, ఈ సో క్యూట్ అంటూ ఎన్నో సినిమా పాటల్ని కూడా పాడి మెప్పించింది.

ఇంకెలాంటి పాటలతో అలరిస్తుందో !

మొత్తంగా బంగుల అంటూ నాగదుర్గ వేసిన స్టెప్పులకి ఫిదా అయిపోతున్న ఆడియన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారనే చెప్పాలి.హీరోలు లేకుండా డాన్స్ చేసే ఫోక్ డాన్సర్ ఈ అక్క ఒక్కరే అని నాగదుర్గని కొందరు మెచ్చుకుంటే,ఈ అక్క తర్వాతే ఫోక్ సాంగ్స్ లో ఇంకెవరైనా అంటూ మరికొంతమంది ఆకాశానికి ఎత్తేస్తున్నారు,చూడాలి మరి బంగుల తో అదరగొట్టిన నాగదుర్గ ముందు ముందు ఇంకెలాంటి పాటలతో అలరిస్తుందో !

ALSO READ:‘బాసింగ బలాలు’తర్వాత వైష్ణవీ సోనీ మరో సెన్సేషన్..తగ్గట్లేదుగా!

Tags

Related News

ఆ సినిమాలో రమ్యకృష్ణ కంటే నేనే చేసుంటే బాగుండేది.. సుమక్క కామెంట్స్ విన్నారా?

పాప పుట్టాకే దాని విలువ తెలిసింది.. కన్నీళ్లు పెట్టుకున్న నటరాజ్ మాస్టర్!

‘బాసింగ బలాలు’తర్వాత వైష్ణవీ సోనీ మరో సెన్సేషన్..తగ్గట్లేదుగా!

ఒక్కో పాటతో ఒక్కో రేంజ్..యమునా తారక్ టాప్ సాంగ్స్ ఇవే!

ఆ భయంతోనే ప్రియాంక జైన్ సీరియల్స్ కి దూరమయ్యారా?

హౌస్ లోకి మాస్క్ మ్యాన్.. భయంతో పరిగెత్తిన ముఖేష్.. కట్ చేస్తే!

గాజులు గల గల to..అయ్యప్ప.మాల.. రాధమ్మ కూతురిని ఏకిపారేస్తున్న నెటిజన్లు!

Big Stories

Advertisement
×