E-Paper
Advertisement

సాగర్ జలాల దోపిడీపై మౌనమెందుకు? నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? కాంగ్రెస్‌పై కవిత ఫైర్!

సాగర్ జలాల దోపిడీపై మౌనమెందుకు? నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? కాంగ్రెస్‌పై కవిత ఫైర్!
Advertisement

Kavitha on Nagarjuna Sagar: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జున సాగర్ ను చెరబట్టి గుట్టు చప్పుడు కాకుండా టన్నెల్ ప్రాజెక్టు నిర్మిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. నాగార్జున సాగర్ నుంచి ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టుపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె మండిపడ్డారు. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ భారీ టన్నెల్ ప్రాజెక్టు చేపట్టినా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని నిలదీశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ అనుమతితోనే ఏపీ ప్రభుత్వం ఈ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టిందా? అని కవిత ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ప్రాజెక్టు పనులు చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వానికి కనీస సమాచారం లేదు అంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ అక్రమ ప్రాజెక్టుపై కనీస సమాచారం లేదంటే ప్రభుత్వంలో కాంగ్రెస్ కొనసాగే అర్హత లేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టు నిర్మాణ పనులను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: కడుపు మండి కోర్టుకెక్కిన మహిళ.. ఆ ఒక్క పదంపై వ్యవస్థనే నిలదీత.. హైకోర్టు సంచలన తీర్పు!

Advertisement

మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇదే అంశంలో కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం సొరంగం తవ్వి, 1,600 కిలోమీటర్ల మేర భారీ పైప్‌లైన్ నిర్మాణం చేపడుతోందని కేటీఆర్ ఆరోపించారు. తాగునీటి పథకం ముసుగులో 90 టీఎంసీల సాగునీటిని సైతం తరలించుకుపోయేందుకు కేవలం 8 నెలల్లోనే పనులు పూర్తి చేసేలా వేగంగా అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఆశీస్సులు, కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే జలదోపిడికీ పాల్పడుతోందన్నారు. సాగర్ వద్ద అక్రమంగా పనులు జరుగుతున్నా సీఎం రేవంత్, మంత్రులు మౌనం వెనుక ఆంతర్యమేంటని కేటీఆర్ నిలదీశారు.

Also Read: Airtel జాక్‌పాట్ ప్లాన్.. రూ.598కే నెట్ ఫ్లిక్స్, అపరిమిత 5G.. జీ5, హాట్ స్టార్ సైతం ఉచితం!

Tags

Related News

పనిచేయడం చేతకాక బీజేపీపై విమర్శలా? కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై రాంచందర్ రావు ఫైర్

స్నానం చేసి రాలేదని.. పిల్లలను బడి నుంచి గెంటేసిన హెచ్ఎం!

ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం బిగ్ అప్డేట్.. కీలక ఉత్తర్వులు జారీ!

నకిలీ బంగారం బ్యాంకులో పెట్టి.. రూ. 21 లక్షలు కాజేసిన అప్రైజర్!

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ఆదిలాబాద్ రిమ్స్‌కు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు!

నిర్మల్‌లో షాకింగ్ ఘటన.. నాలుగు అంతస్తులపై నుంచి దూకిన మహిళ!

ఏపీ జలదోపిడీపై రేవంత్ సర్కార్ మౌనమెందుకు?: కేటీఆర్

Big Stories

Advertisement
×