E-Paper
Advertisement

వేడి వేడి అన్నంలోకి అమృతంలా ఉండే..కంది పచ్చడి

వేడి వేడి అన్నంలోకి అమృతంలా ఉండే..కంది పచ్చడి
Advertisement

Kandi Pappu pachadi: మన తెలుగు ఇళ్లలో కంది పప్పు అంటే.. వెంటనే పప్పుచారు లేదా సాంబార్ గుర్తుకు వస్తుంది. కానీ.. అదే కంది పప్పుతో అద్భుతమైన, కమ్మనైన పచ్చడి తయారు చేసుకోవచ్చనే.. విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్స్ తిని విసిగి పోయిన చాలా మంది మళ్ళీ మన సాంప్రదాయ వంట కాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా యూత్ , హెల్త్ కాన్షియస్ ఉన్న వారు ట్రెడిషనల్ రెసిపీలను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. అలాంటి వాటిలో ఈ ‘కందిపప్పు పచ్చడి’ ముందు వరుసలో ఉంటుంది. ఇంతకీ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా..

కావలసిన పదార్థాలు:

కందిపప్పు -అర కప్పు

Advertisement

ఎండుమిర్చి – 5 లేదా 6

చింతపల్లి – చిన్న నిమ్మకాయ సైజు అంత

Advertisement

వెల్లుల్లి రెమ్మలు – 4 లేదా 5

జీలకర్ర – అర స్పూన్

నూనె – 2 స్పూన్లు

ఉప్పు – రుచికి సరి పడా

పోపు దినుసులు (ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి)

తయారీ విధానం:

1. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి, అందులో.. నూనె వేయకుండా కంది పప్పును దోరగా వేయించాలి. పప్పు మంచి.. సువాసన వచ్చే వరకు, గోధుమ రంగులోకి.. మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి, ఎండు మిర్చి, జీల కర్ర వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని, వేయించి పెట్టుకున్న కంది పప్పు, ఎండు మిర్చి, చింత పండు, వెల్లుల్లి రెమ్మలు, తగినంత ఉప్పు వేసి.. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే.. చాలా తక్కువ నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి.

2.చివరిగా పచ్చడికి పోపు పెట్టుకుంటే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. తర్వాత ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మినపప్పు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి వేయించి, ఆ పోపును పచ్చడిలో కలపాలి. అంతే కంది పచ్చడి రెడీ అయిపోతుంది.

Also Read: హోం మేడ్ దోశ ప్రిమిక్స్ పౌడర్..నెల రోజులైనా పాడవ్వదు తెలుసా ?

ఆరోగ్య ప్రయోజనాలు:

కంది పప్పులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కేవలం రుచిలోనే.. కాకుండా ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. రోజూ కూరలతో బోర్ కొట్టినప్పుడు, నోటికి రుచిగా కావాలనుకున్నప్పుడు ఈ కంది పప్పు పచ్చడితో రెండు ముద్దలు ఎక్కువే తినొచ్చు. ముఖ్యంగా.. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే ఆ మజానే వేరు.

తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో ఎంతో రుచికరమైన టేస్ట్ అందించే ఈ కంది పప్పు పచ్చడిని మీ ఇంట్లో కూడా ఒక సారి ట్రై చేయండి. ఫ్యామిలీ అంతా లొట్టలేసుకుంటూ తింటారు!

Related News

హోం మేడ్ దోశ ప్రిమిక్స్ పౌడర్..నెల రోజులైనా పాడవ్వదు తెలుసా ?

క్షణాల్లో అబద్దం అల్లేస్తారు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు తప్పులు దాచడంలో నిపుణులు

రామాయణంలో జటాయువు గోళ్లు రావణుడు ఎందుకు తీసుకున్నాడు? ఇదే అసలు కారణం

పిల్లలు ఎక్కువసేపు టీవీ చూడకుండా ఏఐని ప్రయోగించిన తండ్రి.. సూపర్ ఐడియా

చాణక్య నీతి.. నిజమైన స్నేహితులు ఎవరో, నటించే వారు ఎవరో ఇలా తెలుసుకోండి

టిక్‌టాక్ వీడియో కోసం పులితో ఆటలు.. పంజా విసరగానే అమాయకుడు బలి

ప్రెజర్ కుక్కర్ రబ్బర్ లూజ్ అయిపోయిందా? కొత్తది కొనాల్సిన అవసరం లేదు ఇలా చేస్తే సరి

Big Stories

Advertisement
×