Homemade Tomato Scrub: పెరుగుతున్న కాలుష్యం, దుమ్ము, ధూళి కారణంగా మన చర్మం దెబ్బతింటుంది. ఇలాంటి సమయంలో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మీ చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండటానికి రసాయనాలతో తయారు చేసిన ఫేస్ క్రీములు వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కొన్ని రకాల ఫేస్ స్క్రబ్ లను తయారు చేసుకుని వాడటం అలవాటు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇంట్లో ఉండే అనేక పదార్థాలు ముఖ సౌందర్యానికి మేలు చేస్తాయి. వంటగదిలోని టమాటోలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. టమాటోలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి , ఇతర లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంలోని మలినాలను తొలగించడమే కాకుండా చర్మ రంగును కూడా మెరుగుపరుస్తాయి. మరి ఇన్ని అద్భుత మైన ప్రయోజనాలు ఉన్న టమాటోలతో ఫేస్ స్క్రబ్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటో వల్ల కలిగే ప్రయోజనాలు:
విటమిన్ సి యొక్క మంచి మూలం: టమాటోలు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడంతో పాటు టానింగ్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కనిపిస్తాయి: టమాటోలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది అకాల వృద్ధాప్యం రాకుండా కాపాడుతుంది.
డీప్ క్లీనింగ్: టమాటో సహజ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది చర్మం నుండి మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ముఖ రంధ్రాలను పూర్తిగా శుభ్రపరుస్తుంది.
నూనె నియంత్రణ: ఇది చర్మం నుండి అదనపు నూనెను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
టమాటో స్క్రబ్ ఎలా తయారు చేయాలి ?
కావలసినవి:
పండిన టమోటా- 1
చక్కెర – 1 టీస్పూన్
నిమ్మరసం -1 టీస్పూన్
ఆలివ్ నూనె – 1 టీస్పూన్
తయారు చేసే విధానం:
ముందుగా టమాటోను బాగా కడగాలి. తర్వాత సగానికి కట్ చేయండి. తరువాత ఒక గిన్నెలో సగం టమాటో తీసుకుని దానిపై కాస్త చక్కెర వేయండి. మీకు కావాలంటే, మీరు నిమ్మరసం, ఆలివ్ నూనెను కూడా దీనిపై యాడ్ చేయవచ్చు. తర్వాత దీనిని ముఖంపై స్క్రబ్ చేయండి. అనంతరం 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
ఇది మీ చర్మానికి మరింత తేమను ఇస్తుంది. తర్వాత మీరు ముఖానికి ఇంతకు ఫేస్ వాష్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇది మీ ముఖం నుండి మురికిని తొలగించి చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడానికి సరిపోతుంది. స్క్రబ్ చేసిన తర్వాత మీ చర్మానికి మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు. ఇది మీ చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
Also Read: కొబ్బరి నూనెలో ఈ 3 కలిపి వాడితే.. జుట్టు అస్సలు రాలదు
టమాటో స్క్రబ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ?
ఈ స్క్రబ్‌ను రోజూ ఉపయోగించడం వల్ల మీ చర్మం యొక్క రంగు మెరుగుపడుతుంది. మచ్చలు కూడా తగ్గుతాయి. ఈ స్క్రబ్ మీ మృత చర్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. మీకు ప్రకాశవంతమైన చర్మాన్ని ఇస్తుంది. ఈ స్క్రబ్‌లో కలిపిన పదార్థాలన్నీ సహజమైనవి. ఇది ఎటువంటి చర్మ సమస్యలను కలిగించవు. ఈ స్క్రబ్ అన్ని చర్మ రకాల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.