BigTV English

Minister Satya Kumar Yadav: పుష్పరాజ్‌ను టార్గెట్ చేసిన ఏపీ మంత్రి.. పంచ్‌లు మామూలుగా లేవుగా..

Minister Satya Kumar Yadav: పుష్పరాజ్‌ను టార్గెట్ చేసిన ఏపీ మంత్రి.. పంచ్‌లు మామూలుగా లేవుగా..

పొలిటికల్ పంచ్‌లు విసురుతూ టార్గెట్ అవుతున్న పుష్ప

మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య విబేధాలపై పెద్ద ప్రచారమే జరుగుతోంది. అయితే రెండు ఫ్యామిలీల నుంచి దానిపై డైరెక్ట్‌గా ఎవరూ మాట్లాడటం లేదు. ఇన్‌డైరెక్ట్‌గానే డైలాగ్ వార్ నడుస్తుంది. అయితే ఎప్పటికప్పుడు తేనెతుట్టుని కదుపుతున్నట్టు అల్లు హీరో బన్నీ మాత్రం పొలిటికల్ పంచ్‌లు విసురుతుండటంపై మెగా ఫ్యాన్స్‌తో పాటు కూటమి శ్రేణులు భగ్గుమంటున్నాయి. పవన్‌వకళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బిజీ అయి.. తన పని తాను చేసుకుంటున్నా.. సమయం సందర్భం లేకుండా అల్లు అర్జున్ పొలిటికల్ పంచ్‌లు ఎందుకు పేలుస్తున్నారనేది ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది.


సినీ ఫంక్షన్‌లో పరోక్షంగా పొలిటికల్ డైలాగులు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత కాలానికే అల్లు అర్జున్ అగ్గి రాజేసే ప్రయత్నం చేశారు. ఒక సినీ ఫ్లాట్‌ఫాంపై పుష్ఫ పరోక్షంగా వేసిన పొలిటికల్ డైలాగులు వైరల్ అయ్యాయి. ఇష్టమైన వారిపైన మన ప్రేమ చూపించాలి, మనం నిలబడగలగాలి.. నాకు ఇష్టమైతేనే వస్తా.. నా మనసుకు నచ్చితేనే వస్తా అంటూ అల్లు అర్జున్ నంద్యాలతో తాను వైసీసీ అభ్యర్ధికి చేసిన ప్రచారాన్ని సమర్ధించుకుంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసలుఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలుపుతూ ప్రచారం చేయడం పలు విమర్శలకు తావిచ్చింది.

ఏమైంది పుష్పా.. అని హోరెత్తించిన నెటిజన్లు

అప్పట్లో నంద్యాలలో అల్లు అర్జున్ రోడ్ షో సందర్భంగా మెగా ఫ్యాన్స్‌తో పాటు నెటిజెన్లు ఏమైంది పుష్పా అంటూ సోషల్ మీడియా కామెంట్స్‌తో హోరెత్తించారు. తర్వాత కర్ణాటక పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ పుష్ప సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల క్రితం అడవులను రక్షించే పాత్రలో హీరోలు నటిస్తే.. ప్రస్తుతం అడవులను నరికే పాత్రలో హీరోలు ఉంటున్నారని అన్నారు. మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తోందని.. ఒక సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం తనకు కష్టమని.. పరోక్షంగా పుష్ఫను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు.

పుష్ప ప్రచారం చేసినా పరాజయం పాలైనా స్పేహితుడు శిల్పా

పాపం అల్లు అర్జున్ అంత రిస్క్ తీసుకుని నంద్యాల వెళ్లి ప్రచారం చేసినా.. అతని స్నేహితుడు, వైసీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిషోర్‌ను గట్టెక్కించలేక పోయారు. టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రస్తుత మంత్రి ఎన్ఎండి ఫరూఖ్ 12 వేల పై చిలుకు ఓట్లతో శిల్పాని చిత్తు చేశారు. పుష్పరాజు ప్రచారం చేసిన సెగ్మెంట్ లోనే కాదు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూటమి ధాటికి 14 నియోజకవర్గాలకు గాను 12 చోట్ల వైసీపీ పరాజయం పాలైంది. అప్పటి నుంచే అల్లు మూవీలోని డైలాగ్.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకొంటివా.. కాదు ఫైర్.. అనే డైలాగ్‌ రివర్స్‌లో రీ సౌండ్ ఇస్తుంది.

సినిమాల్లో మెగా ఫ్యామిలీని ఇన్‌డైరక్ట్‌గా టార్గెట్ చేస్తూ డైలాగులు

పుష్ప -2 సినిమాలో కొన్ని సన్నివేశాలు మెగా ఫ్యామిలీ కు ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నట్లుగా డైలాగులు ఉన్నాయి.. ఆ సినిమా ఎంత హిట్ అయినా ఆ డైలాగ్‌లకు సంబంధించి అల్లు వారసుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టార్గెట్ అయ్యాడు. ఆ క్రమంలో ఇటీవల నంద్యాలలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ సభా వేదికగా పుష్ప మ్యానరిజంతో అతన్ని పరోక్షంగా టార్గెట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: : తునిలో ఏం జరుగుతుంది..? గెలుపు ఎవరిది..? ఓటమి ఎవ్వరిది ?

పుష్పరాజ్‌ను టార్గెట్ చేసిన నంద్యాల ఎంపీ శబరి

ఏపీలో ఉన్న కూటమి నేతలు ఇప్పటికీ అల్లు అర్జున్‌ని డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తూ మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. పుష్పరాజ్ వైసీపీకి ప్రచారం చేసిన నంద్యాల కేంద్రంగా మంత్రి సత్య కుమార్ సమాజం కోసం ఉపయోగపడే సినిమాలు తీయాలి కానీ.. స్మగ్లర్లను, బందిపోటు దారులను ప్రమోట్ చేసే సినిమాలు తీసి సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని.. చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల కాలంలో నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి కూడా పుష్పరాజును టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు.

పుష్ప మ్యానరిజంతో టార్గెట్ చేసిన మంత్రి సత్యకుమార్

మొత్తానికి ఓవైపు కూటమినేతల కామెంట్లతో .. మరోవైపు పుష్ప టూ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లో చోటు చేసుకున్న పరిణామాలతో అల్లు అర్జున్‌కు పెద్ద తలనొప్పి తగులుకున్నట్లు కనిపిస్తుంది… ఇంత జరుగుతున్నా మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్‌కు సపోర్టుగా మాట్లాడకపోవడం, అల్లు అర్జున్ వారిని సంప్రదించక పోతుండటం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా తగ్గేదేలే.. అన్న పోస్టర్లతో నంద్యాల రోడ్‌షోలో తెగ తిరిగేసిన పుష్ఫకు ఈ తలనొప్పులు ఎప్పటికి వదులుతాయో చూడాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×