Coconut Oil For Hair: ప్రస్తుతం మారుతున్న జీవన విధానంతో పాటు, సరైన ఆహారం లేకపోవడం, కాలుష్యం, ఒత్తిడి కారణంగా జుట్టు రాలే సమస్య చాలా వరకు పెరుగుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో రకరకాల హెయిర్ ఆయిల్స్, షాంపూల కోసం వేలల్లో ఖర్చు చేసే వారు కూడా లేకపోలేదు. వీటి వల్ల కూడా అంత ప్రయోజనం ఉండదు. అందుకే జుట్టు రాలే సమస్యను ఎదుర్కుంటున్న వారు కొన్ని రకాల టిప్స్ పాటించడం మంచిది. వీటిని పాటించడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా జుట్టు పొడవుగా కూడా పెరుగుతుంది. కొబ్బరి నూనె మీ జుట్టును సహజంగా మందంగా , పొడవుగా మార్చడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో 3 రకాల పదార్థాలు కలిపి అప్లై చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరి నూనె, అలోవెరా జెల్ :
కొబ్బరి నూనె జుట్టుకు ఒక వరంలా పనిచేస్తుంది. కొబ్బరి నూనె జుట్టుకు సమృద్ధిగా పోషణను అందిస్తుంది. అంతే కాకుండా మందంగా, పొడవుగా మార్చడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో కలబంద జెల్ కలిపి రాసుకుంటే జుట్టుకు చాలా బాగా పెరుగుతుంది. జుట్టుకు పూర్తి పోషణను అందించే కలబంద జెల్‌లో విటమిన్లు, ఖనిజాలు, కొన్ని ఇతర పోషకాలు ఉంటాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా తలపై చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచి జుట్టును మృదువుగా ఉంచుతుంది. దీనికోసం, 1 చెంచా కలబంద జెల్‌ను 2 చెంచాల కొబ్బరి నూనెలో కలిపి, మీ జుట్టుకు బాగా అప్లై చేసి మసాజ్ చేసి గంట తర్వాత తల స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఇలా వారానికి 1-2 సార్లు చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి.
కొబ్బరి నూనె, ఆముదం:
ఆముదం జుట్టుకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఇది దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది. అంతే కాకుండా జుట్టును మందంగా, పొడవుగా చేస్తుంది. ఆముదంలో ఉండే కొవ్వు ఆమ్లాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. అంతే కాకుండా విటమిన్ ఇ జుట్టుకు సమృద్ధిగా పోషణను అందిస్తుంది. ఇది జుట్టుకు తేమను అందించడంలో కూడా సహాయపడుతుంది. 2 టీస్పూన్ల కొబ్బరి నూనెలో 1 టీస్పూన్ ఆముదం నూనె కలిపి మీ జుట్టుకు అప్లై చేసి, జుట్టు మూలాలను మసాజ్ చేసి 1-2 గంటలు అలాగే ఉంచి తర్వాత తల స్నానం చేయండి. మీరు ఈ మిశ్రమాన్ని కనీసం వారానికి ఒకసారి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు బలంగా చెక్కు చెదరకుండా ఉంటుంది.
Also Read: వాసెలిన్ ఇలా కూడా.. వాడొచ్చు తెలుసా ?
కొబ్బరి నూనె, మెంతులు:
మెంతుల్లో విటమిన్లు, ఖనిజాలు, కొన్ని పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి . దీని కోసం మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం వాటిని రుబ్బి పేస్ట్ లా చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ కు 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి జుట్టుకే బాగా అప్లై చేసి ఆపై 1-2 గంటల తర్వాత షాంపూతో వాష్ చేయండి. దీని వల్ల మీకు జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు ఒత్తుగా , పొడవుగా మారుతుంది.