E-Paper
Advertisement

రోజుకు ఎన్ని పుష్ అప్స్ చేస్తే ఆరోగ్యానికి మంచిది? దీనికి సమాధానం మీ వయసు

రోజుకు ఎన్ని పుష్ అప్స్ చేస్తే ఆరోగ్యానికి మంచిది? దీనికి సమాధానం మీ వయసు
Advertisement

ఆరోగ్యకర జీవనశైలిలో వ్యాయామం చాలా ముఖ్యం. వ్యాయామంలో చాలా కీలకం పుష్ అప్స్ చేయడం. పుష్ అప్స్ అనేవి శరీర బలాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడే సులభమైన వ్యాయామాల్లో ఒకటి. ఇవి ఛాతీ, భుజాలు, చేతులు, కీలక కండరాలను బలపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా శరీర సమతుల్యత, స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడతాయి.

పుష్ అప్స్ ఎందుకు ముఖ్యమైనవి?

పుష్ అప్స్ చేయడం వల్ల పై భాగంలోని కండరాలు బలపడతాయి. రోజువారీ పనులు చేయడం కూడా సులభమవుతుంది. మంచి కండరాల బలం ఉండటం వల్ల శరీర సమతుల్యత మెరుగుపడుతుంది. వయసు పెరిగిన తర్వాత కూడా శరీరం బలంగా ఉండేందుకు పుష్ అప్స్ ఉపయోగపడుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంఖ్య కంటే సరైన టెక్నిక్ చాలా ముఖ్యం

Advertisement

ఎక్కువ పుష్-అప్స్ చేయడం కంటే సరైన పద్ధతిలో చేయడం చాలా ముఖ్యం. శరీరాన్ని నిటారుగా ఉంచి నెమ్మదిగా కదలికలు చేయాలి. ప్రారంభ దశలో ఉన్నవారు మోకాళ్లపై ఆధారపడే నీ పుష్-అప్స్‌తో మొదలు పెట్టవచ్చు. ఇలా చేయడం వల్ల గాయాల ప్రమాదం తగ్గుతుంది.

ప్రతి రోజు అన్ని పుష్ అప్స్ చేయాలి?

దీనికి సమాధానం మీ వయసు. 66 ఏళ్ల వయసులో అమెరికాకు చెందిన సైమన్ పావెల్ అనే వ‌ృద్ధుడు ప్రతి రోజు వేయికి పైగా పుష్ అప్స్ చేస్తున్నాడు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. వయసును బట్టి పుష్ అప్స్ లక్ష్యాలు నిర్ణయించుకోవాలి.

  • 20 ఏళ్ల వయసులో ఉన్న పురుషులు సాధారణంగా 30 నుంచి 43 పుష్ అప్స్ చేయగలిగితే మంచి కెపాసిటీ ఉన్నట్లు. మహిళలు 15 నుంచి 29 వరకు చేయడం మంచి లక్ష్యంగా పరిగణిస్తారు.
  • 30 ఏళ్ల వయసులో పురుషులు 20 నుంచి 34 వరకు, మహిళలు 10 నుంచి 24 వరకు చేయడం సాధారణంగా మంచి ఫిట్‌నెస్ సూచిక.
  • 40 ఏళ్లలో పురుషులు 15 నుంచి 28 వరకు, మహిళలు 6 నుంచి 19 వరకు పుష్ అప్స్ చేయడం సరైన శారీరక సామర్థ్యం.
  • 50 ఏళ్లలో పురుషులు 10 నుంచి 24 వరకు, మహిళలు 3 నుంచి 14 వరకు చేయగలిగితే మంచి ఫిట్‌నెస్ ఉన్నట్లు భావిస్తారు.
  • 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా పురుషులు 6 నుంచి 19 వరకు, మహిళలు 1 నుంచి 12 వరకు పుష్ అప్స్ చేయగలిగితే అది మంచి శారీరక సామర్థ్యానికి సూచనగా పరిగణిస్తారు.

ప్రతిరోజూ వందల సంఖ్యలో చేస్తే ఆరోగ్యానికి ప్రమాదం

Advertisement

రోజుకు వందల సంఖ్యలో లేదా వెయ్యి పుష్ అప్స్ చేయడం కీళ్లపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఒకే రకమైన కదలికలను పదేపదే చేయడం వల్ల గాయాల ప్రమాదం పెరుగుతుంది. అందుకే సమతుల్య వ్యాయామ ప్రణాళికను అనుసరించడం మంచిది.

Also Read: అంతంత మాత్రమే పెరుగుతన్న నెలజీతాలు.. మధ్యతరగతికి దూరమవుతున్న సొంత ఇంటి కల

ఆరు వారాల్లో పుష్ అప్స్ సంఖ్య మెరుగుపడాలి

మొదటి రెండు వారాలు మీకు సౌకర్యంగా ఉన్న సంఖ్యతో ప్రారంభించండి. శరీర భంగిమ చెడిపోకముందే ఆపండి. అవసరమైతే ఎత్తైన ఉపరితలంపై పుష్-అప్స్ చేయండి. మూడో, నాలుగో వారాల్లో క్రమంగా కష్టతర స్థాయికి వెళ్లండి. ఒక కఠినమైన సెట్ చేసిన తర్వాత తేలికైన సెట్ చేయండి.

ఐదవ, ఆరో వారాల్లో ప్రతి వారం ఒకటి లేదా రెండు పుష్ అప్స్ పెంచండి. కిందకు వెళ్లే సమయంలో నెమ్మదిగా కదలండి. ప్రతి సెట్ మధ్య తగినంత విశ్రాంతి తీసుకోండి. మొత్తం వ్యాయామం సమయంలో సరైన టెక్నిక్‌ను పాటించడం చాలా ముఖ్యం. నిపుణుల ప్రకారం క్రమం తప్పకుండా సాధన చేస్తే ఆరు వారాల్లోనే శరీర బలం, సామర్థ్యంలో మంచి మార్పులు కనిపించవచ్చు.

Related News

వైట్ వెనిగర్, డిష్‌వాష్ లిక్విడ్ కలిపి వాడితే.. అద్భుతమైన ఫలితాలు చూస్తారు!

ఫ్రిడ్జ్ డీఫ్రాస్ట్ చేయడానికి టెక్నీషియన్లు చెప్పే బెస్ట్ చిట్కా.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది!

ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే టాయిలెట్ పేపర్ రోల్‌తో ఇలా చెక్ పెట్టండి!

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముతారు.. ఈ తేదీల్లో పుట్టినవారు విధితో పోరాడి విజయం సాధిస్తారు

తెల్ల జుట్టు ఆరోగ్యానికి మంచిదే.. ఆ ప్రమాదకర వ్యాధి నుంచి రక్షణకు సూచన

కర్రీలో నూనె ఎక్కువైందా? రుచి కాపాడడానికి ఈ 5 టిప్స్

రోజంతా పనిచేసి అలసిపోయారా? కేవలం 15 నిమిషాల్లో డిన్నర్ రెడీ చేసే 5 రెసిపీలు ఇవిగో

డైట్ సోడా తాగితే జ్ఞాపకశక్తి తగ్గుదల, త్వరగా వృద్ధాప్యం.. నిజమేనా?

Big Stories

Advertisement
×