E-Paper
Advertisement

బుర్రలోని ఆలోచనలను టెక్స్ట్‌గా మార్చే విచిత్ర గ్యాడ్జెట్.. జొమాటో సీఈఓ కొత్త ప్రయోగం ఫలిస్తుందా?

బుర్రలోని ఆలోచనలను టెక్స్ట్‌గా మార్చే విచిత్ర గ్యాడ్జెట్.. జొమాటో సీఈఓ కొత్త ప్రయోగం ఫలిస్తుందా?
Advertisement

Temple Wearable: స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లతో ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడం మనకు తెలుసు. కానీ, ఇప్పుడు కణతపై ఓ చిన్న గ్యాడ్జెట్‌ను ధరించి మన ఆరోగ్య సంకేతాలను తెలుసుకునే రోజులు రాబోతున్నాయి. ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో మాజీ సీఈఓ దీపిందర్ గోయల్ పరిచయం చేస్తున్న ఈ వినూత్న పరికరం పేరు ‘టెంపుల్’ (Temple) వేరబుల్. సాధారణ కళ్లద్దాలతో పాటు ధరించగలిగే ఈ డివైస్ ఆరోగ్య పర్యవేక్షణలో సరికొత్త మార్పులకు నాంది పలకనుందా? అనే ఆసక్తి నెలకొంది. ఈ గ్యాడ్జెట్ ప్రీ-ఆర్డర్లు నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుండగా.. కొనుగోలుదారులకు 2027 ప్రారంభంలో డెలివరీ చేసే అవకాశం ఉంది. ఇంతకీ ఈ టెంపుల్ వేరబుల్ ప్రత్యేకత ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? తెలుసుకుందాం.

ఎలా పని చేస్తుందంటే?

ఇది కేవలం స్టెప్స్ లేక హార్ట్ రేట్ మాత్రమే కాకుండా.. నేరుగా మన మెదడుకు సంబంధించిన విషయాలను గమనిస్తుంది. ఇందులో పీపీజీ (PPG) టెక్నాలజీని వాడారు. ముఖ్యంగా బ్రెయిన్ ఫ్లో (Brain Flow) అనే ఫీచర్ ద్వారా మన మెదడులోని రక్త ప్రసరణలో వచ్చే మార్పులను ఇది ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది.

Advertisement

Also Read: రూ.550కే మౌస్, రూ.29 వేలకే ల్యాప్‌టాప్.. లెనోవో సేల్‌లో పిచ్చెక్కిస్తున్న ఆఫర్లు!

ధర ఎంత ఉండొచ్చంటే?

Advertisement

ఈ డివైస్‌ను పూర్తిగా చేతితో తయారు చేస్తున్నారట. మనం ఆర్డర్ పెట్టిన మూడు నెలల్లోగా ఇది మన చేతికి అందుతుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కానీ, మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం దీని ధర దాదాపు రూ.లక్ష వరకు ఉండొచ్చని టాక్ నడుస్తోంది. అలాగే లాంచ్ ఎడిషన్‌లో ఇది 6 రకాల కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఎర్లీ యాక్సెస్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవాళ్లకు ముందుగా దీన్ని పొందే అవకాశం దక్కుతుంది.

రీసెర్చ్, భవిష్యత్తు ప్రణాళికలు:

దీనిపై ఇప్పటికే 60 మందిపై రెండుసార్లు పరిశోధనలు జరిపారు. త్వరలో ఇవి పూర్తిగా క్లినికల్ లెవెల్‌లో నిరూపితమైతే అందరికీ అందుబాటులోకి వస్తుంది. దీపిందర్ గోయల్ దీని భవిష్యత్తు గురించి చెబుతూ.. పైలట్లు సరిగ్గా ఉన్నారా లేదా అని చెక్ చేయడానికి, అలాగే భవిష్యత్తులో మన ఆలోచనలను కూడా టెక్స్ట్‌గా మార్చేలా దీన్ని తీర్చిదిద్దే పెద్ద ప్లానే ఉందని హింట్ ఇచ్చారు. ఇది ఫస్ట్ వెర్షన్ కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

Also Read: స్పీకర్ నుంచి స్మార్ట్‌వాచ్ వరకు అన్నీ ఆఫర్లో.. రూ.3,000 లోపు బెస్ట్ దీపావళి గిఫ్ట్స్ మీ కోసం!

Tags

Related News

రాళ్లలో ఇయర్‌బడ్ మిస్.. AI చేసిన మ్యాజిక్ చూస్తే అవాక్కే.. ఇది కదా చాట్‌జీపీటీ పవర్ అంటే!

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పనిచేయకపోతే.. మొదటి 24 గంటల్లో ఏం జరుగుతుంది?

115 ఇంచుల బిగ్ స్క్రీన్..సినిమా థియేటర్‌ను తలపించే ఎల్జీ టీవీ లాంచ్

రూ.550కే మౌస్, రూ.29 వేలకే ల్యాప్‌టాప్.. లెనోవో సేల్‌లో పిచ్చెక్కిస్తున్న ఆఫర్లు!

స్పీకర్ నుంచి స్మార్ట్‌వాచ్ వరకు అన్నీ ఆఫర్లో.. రూ.3,000 లోపు బెస్ట్ దీపావళి గిఫ్ట్స్ మీ కోసం!

40 గంటల బ్యాటరీ బ్యాకప్.. ఫ్రీ గానా సబ్‌స్క్రిప్షన్‌తో Noise Buds R1 Gaana Edition లాంచ్!

జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. రూ. 123కే అపరిమిత కాల్స్, డేటా, సినిమాలు.. మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×