E-Paper

ఇదెక్కడి విడ్డూరం… నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో 8 ఏళ్ళ క్రితం విడుదలైన పాత వెబ్ సిరీస్

ఇదెక్కడి విడ్డూరం… నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో 8 ఏళ్ళ క్రితం విడుదలైన పాత వెబ్ సిరీస్
Advertisement

Crime Thriller Web Series : ఎనిమిది సంవత్సరాల క్రితం, భారతీయ ఓటీటీ ప్రపంచానికి ఒక కొత్త యుగం మొదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఒక వెబ్ సిరీస్ దేశంలో డిజిటల్ వినోదానికి కొత్త గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సిరీస్ ఏమిటంటే ‘సేక్రెడ్ గేమ్స్’ (Sacred games). ఇది కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్ కాదు, భారతీయ ఓటీటీ ఇండస్ట్రీని మార్చేసిన గేమ్ చేంజర్.

ఇప్పటికీ ట్రెండింగ్లో

2018 జూలై 6న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ భారతదేశంలో మొదటి అసలైన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్‌గా చరిత్ర సృష్టించింది. మొదటి సీజన్‌లోని 8 ఎపిసోడ్‌లు ఒకేసారి అందుబాటులోకి వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా భారీ సంచలనం సృష్టించి, ప్రేక్షకులను స్క్రీన్ కు అతుక్కుపోయేలా చేసింది. ఇప్పటికీ అనేక మంది ఈ సిరీస్‌ను రీ-వాచ్ చేస్తూ, దాని లోతైన కథనానికి ముగ్ధులవుతున్నారు. విక్రమ్ చంద్ర రాసిన అదే పేరుగల నవల ఆధారంగా తీసిన ఈ సిరీస్‌ కు విక్రమాదిత్య మోత్వానే – అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. ముంబై నగరం చీకటి కోణాన్ని, రాజకీయాలు, మతం, అధికారం, నేరాల మధ్య జరిగే ఆటను ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించారు.

కథలోకి వెళ్తుంటే…

Advertisement

గ్యాంగ్‌స్టర్ – పోలీసు అధికారి మధ్య సాగే ఈ స్టోరీ ఉత్కంఠభరితంగా ఉంటుంది. సిరీస్ కథ గణేష్ గైతోండే (నవాజుద్దీన్ సిద్దిఖీ) చుట్టూ తిరుగుతుంది. ఒక సమయంలో ముంబైని గుప్పెట్లో పట్టుకున్న ప్రమాదకర గ్యాంగ్‌స్టర్ గైతోండే. తనను తాను నేరస్థుడిగా భావించుకునే వ్యక్తి అతను. అతని జీవితం బాల్యం నుంచి మతం, రాజకీయాలు, హింస వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది.ఈ గ్యాంగ్‌స్టర్‌ను అడ్డుకోవడానికి పూనుకున్న సర్తాజ్ సింగ్ (సైఫ్ అలీ ఖాన్) ఒక నిజాయితీపరుడైన పోలీస్ ఇన్‌స్పెక్టర్. గైతోండే నుంచి వచ్చిన ఒక రహస్య ఫోన్ కాల్ సర్తాజ్‌ను టెన్షన్ లో పడేస్తుంది. 25 రోజుల్లో ముంబైను ఒక పెద్ద విపత్తు నుంచి కాపాడమని సవాల్ చేస్తాడు. ఈ రెండు పాత్రల మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ సిరీస్‌ను ఉత్కంఠభరితం చేస్తుంది. మరి అతన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు ? ముంబై నగరాన్ని అతని కుట్ర నుంచి ఎలా కాపాడాడు ? అన్నది స్టోరీ.

పంకజ్ త్రిపాఠి (గురుజీ), రాధికా ఆప్టే, కల్కి కోచ్లిన్, రణవీర్ షోరే, సుర్వీన్ చావ్లా, కుబ్రా సైత్ వంటి నటీనటులు తమ బలమైన పాత్రలతో సిరీస్‌ను మరింత ఆకర్షణీయం చేశారు. ‘సేక్రెడ్ గేమ్స్’లో ఉన్న బోల్డ్ సన్నివేశాలు, భాషా వాడకం కారణంగా చర్చనీయాంశమైంది. భారతీయ సినిమా రంగంలో సెన్సార్ బోర్డు ఆంక్షలు ఉండడం వల్ల ఇలాంటి స్వేచ్ఛాయుతమైన కంటెంట్ అంతకు ముందు చాలా అరుదుగా వచ్చిందనే చెప్పాలి. కానీ ఈ సిరీస్ ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టి, ప్రేక్షకులకు అసలైన, అన్‌సెన్సార్డ్ స్టోరీటెల్లింగ్‌ను అందించింది. అయితే ఇది కొంతమంది నుంచి విమర్శలను కూడా ఎదుర్కొంది. కానీ ఈ వివాదాలు కూడా సిరీస్‌కు మరింత పబ్లిసిటీ ఇచ్చాయి.

ఎందుకు ఇంత ప్రజాదరణ ?

Advertisement

‘సేక్రెడ్ గేమ్స్’ సాదాసీదా క్రైమ్ స్టోరీ కాదు. ముంబై నగరం ఆత్మను, సమాజంలోని చీకటి మూలాలను, మతం పేరుతో జరిగే ఆటలను, అధికారం కోసం జరిగే పోరాటాలను లోతుగా చూపించారు. బలమైన స్క్రిప్ట్, అద్భుతమైన నటన, సినిమాటిక్ డైరెక్షన్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్‌ ను ఒక మాస్టర్‌పీస్ గా చేశాయి.

Read Also : బేస్మెంట్‌లో పిశాచి… అమ్మాయిలను బంధించి ఇవేం పాడు పనులు

Tags

Related News

పదేళ్లుగా ఒకే అద్దె కొంపలో… కట్ చేస్తే కన్నీళ్లు పెట్టించే ట్విస్ట్

7 ఏళ్ల నాటి ఫ్లాప్ సినిమా ట్రెండింగ్లో… ఇంకా చూడలేదా ?

థ్రిల్లర్ నుంచి యాక్షన్ వరకు… ప్రైమ్ వీడియోలోకి వచ్చిన కొత్త సినిమాలు

‘ఇక్కా’ ఓటీటీ విడుదలకు లైన్ క్లియర్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

జూన్ 15 నుండి 21 వరకు… ఈ వీకెండ్ రిలీజ్ కానున్న సస్పెన్స్-కామెడీ సినిమాలు, సిరీస్ లు

‘రాజా శివాజీ’ నుండి ‘సైరత్’ వరకు… ఈ క్రేజీ మరాఠీ మూవీస్ ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

పోలీస్ స్టేషన్లో లేడీ ఆఫీసర్ ను ఓ ఆట ఆడుకునే దెయ్యాలు… ఒళ్లు గగుర్పొడిచే క్లైమాక్స్

×