E-Paper
Advertisement

బొండం కొట్టే ముందు ఈ ‘సీక్రెట్’ తెలియకపోతే.. మీరు నిలువునా మునిగినట్టే!

బొండం కొట్టే ముందు ఈ ‘సీక్రెట్’ తెలియకపోతే.. మీరు నిలువునా మునిగినట్టే!
Advertisement

coconut tips: ఎండకాలం వచ్చిందంటే చాలు.. గొంతు ఎండిపోతోంది.అదే సమయంలో రోడ్డు పక్కన కొబ్బరి బొండం కనిపిస్తే చాలు, ప్రాణం లేచొస్తుంది.మరి ఆశగా 50-60 రూపాయలు పెట్టి బొండం కొట్టాక అందులో నీళ్ళు ఉండపోతే వచ్చే కోపం మాములుగా ఉండదు. మరి నిండుగా నీళ్లున్న కొబ్బరి బొండాం ని ఎలా కనిపెట్టాలో ఇప్పుడు చూద్దాం.

చెవి దగ్గర పెట్టుకుంటే  నీళ్ళ సౌండ్ వస్తుందా?

 సాధారణంగా చాలా మంది చేసేదేమిటంటే బొండాన్ని చెవి దగ్గర పెట్టుకుని నీళ్ళ సౌండ్ వస్తుందా  లేదా అని చెక్ చేస్తుంటారు.ఏ మాత్రం కాస్త సౌండ్ వచ్చినా ఎంచక్కా నీళ్ళున్నాయని సెలెక్ట్ చేసుకుంటారు. కాని అది తప్పు. ఎందుకంటే గాలి ఎక్కువగా ఉంటేనే సౌండ్ వస్తుంది.బొండంలో నీళ్లు నిండా ఉంటే అసలు సౌండనేదే రాదు. కాబట్టి చప్పుడు రాని బొండాన్నే సెలెక్ట్ చేసుకుంటే మంచింది

Advertisement

also read:Palm Toddy vs Date Toddy: తాటికల్లు Vs ఈతకల్లు:ఏది తాగితే మీ బాడీ ఏసీలా మారుతుందో తెలుసా!

కాస్త డల్‌గా ఉన్నా, నీళ్లు మాత్రం ఫుల్

ఇక మరో ముఖ్యమైన విషయం ..పెద్దగా  పచ్చగా ఉండే బొండాలు చూసి అస్సలు మోసపోకండి. ఎందుకంటే ముదురు పచ్చగా ఉంటే అది చూడటానికి బాగుంటుందేమో కానీ లోపల కొబ్బరి ముదిరిపోయి, నీటి శాతం తగ్గే అవకాశం ఉంది.సో లేత పచ్చ లేదా కొంచెం పసుపు ఛాయ (Yellowish-green) ఉన్న బొండాలను ఎంచుకోవడం మేలు .ఇవి చూడటానికి కాస్త డల్‌గా ఉన్నా, నీళ్లు మాత్రం ఫుల్ గా ఉంటాయ్ ..ఈ నీళ్ళకి  తీపి కూడా ఎక్కువేనండోయ్.

‘సైజ్ కాదు, షేప్ ముఖ్యం’

Advertisement

ఇక చాలామంది ఏమనుకుంటారంటే  పెద్ద బొండాలు చూసి ఎక్కువ నీళ్లు ఉంటాయని బ్రమ పడిపోతారు.. కానీ, కొబ్బరి బొండాల విషయంలో ‘సైజ్ కాదు, షేప్ ముఖ్యం’.యస్ ..పొడవుగా ఉండే బొండాల కంటే.. మీడియం రేంజ్ లో (Medium size) ఉండే. గుండ్రని బొండాలే బెస్ట్!

ఏ బొండం అయితే ఎక్కువ బరువుగా అనిపిస్తుందో

 ఇక రెండు ఒకే సైజులో ఉన్న బొండాలను రెండు చేతుల్లో పట్టుకొని ఒక సారి చెక్ చేయండి .వాటిల్లో ఏ బొండం అయితే ఎక్కువ బరువుగా అనిపిస్తుందో అందులో నీళ్లు నిండుగా ఉన్నాయని గుర్తుంచుకోండి.ఎందుకంటే  గాలి కంటే నీరు బరువు కాబట్టి,  సో ..బరువు ఎక్కువగా ఉన్నదే మన టార్గెట్!

గోధుమ రంగులోకి మారి ఎండిపోయినట్టు ఉంటే

 ఇక బొండం పైన భాగం (కాడ ఉండే చోటు) పచ్చగా ఉందా ..  అది తాజాదని  అర్థం.అదే గోధుమ రంగులోకి మారి ఎండిపోయినట్టు ఉంటే అది ఎప్పుడో కోసిన పాత స్టాక్ అని అర్థం.కొబ్బరి నీళ్లు కేవలం దాహం తీర్చడమే కాదు, బాడీకి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ ఇచ్చే సూపర్ డ్రింక్. సో …ఇకనైనా  కొబ్బరి నీళ్ల బండి దగ్గరికి వెళ్లినప్పుడు, ఈ ట్రిక్స్ వాడండి. మీరు పెట్టిన ప్రతి పైసాకు తృప్తిని పొందండి !

also read:Dhurandhar Controversy: 1100 కోట్లు కొట్టారు సరే.. మా వాటా ఎక్కడ? అంటుంది ఎవరో తెలుసా ?వీడియో వైరల్

Related News

వీకెండ్ స్పెషల్..రుచికరమైన చికెన్ పులావ్ చేసేయండిలా!

దీపావళి రోజున కొబ్బరికాయతో ఈ చిన్న పని చేస్తే.. మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది!

దీపావళి చరిత్ర ఏమిటి? మన దేశంలో ఈ పండుగకు ఇన్ని కథలు ఎలా వచ్చాయి?

త్వరత్వరగా తింటున్నారా? మీ వ్యక్తిత్వం గురించి సైకాలజీ చెప్తున్న షాకింగ్ విషయాలివే!

తొలిసారి డేటింగ్‌కు వెళుతున్నారా? అమ్మాయిలు గమనించే విషయాలు ఇవే

దీపావళి విందులో అతిగా తినకుండా జాగ్రత్త.. ఈ 7 టిప్స్ పాటిస్తూ పండుగ ఆస్వాదించండి

విటమిన్ డి టాబ్లెట్స్ ఎప్పుడు తీసుకోవడం మంచిది? బలమైన ఎముకలు కావాలంటే ఈ విషయాలు తెలుసుకోండి

ఆఫీసులో ఎప్పుడూ మిమ్మల్ని విమర్శించే సహోద్యోగులు ఉన్నారా? మీ మానసిక ప్రశాంతతకు భగవద్గీత సూత్రాలు

Big Stories

Advertisement
×