Sai Pallavi On Dhanush: సినీ నటి సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదివరకే ఈమె నటించిన రామాయణ (Ramayana)సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. మరి కొద్ది రోజులలోనే సాయి పల్లవి(Sai Pallavi) నటించిన ఓం చాప్టర్ 1 (Om Chapter 1)సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నవంబర్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే చెన్నైలో ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సాయి పల్లవితో పాటు శ్రీ లీల కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సాయిపల్లవి నటుడు ధనుష్ (Dhanush)రాజకీయాల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా ధనుష్ రాజకీయాలలోకి రాబోతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈవెంట్లో అభిమానులు పార్టీ జెండాలతో దర్శనం ఇవ్వడంతో సాయి పల్లవి ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇలా అభిమానులు పార్టీ జెండాలతో అక్కడికి రావడం వల్ల సాయి పల్లవి మాట్లాడుతూ తాను సినిమా ఈవెంట్ కి కాకుండా పొలిటికల్ ఈవెంట్ కి వచ్చిన విధంగా ఉందని తెలిపారు. ఇక ధనుష్ రాజకీయాలలోకి రాబోతున్నారంటూ వచ్చిన వార్తలపై సాయి పల్లవి స్పందిస్తూ.. ధనుష్ సర్ మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్న నా మద్దతు మీకు ఉంటుంది కానీ మీరు కూడా విజయ్(Vijay) సార్ లాగా సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేస్తారేమోనని భయంగా ఉంది. మీరు నటుడిగా ఎల్లప్పుడూ మా మధ్యనే ఉండాలని దేవుని కోరుకుంటున్నాను అంటూ సాయి పల్లవి ఈ సందర్భంగా ధనుష్ పొలిటికల్ ఎంట్రీ పై కామెంట్స్ చేశారు.
ఇటీవల తమిళ నటుడు విజయ్ టీవికే పార్టీ స్థాపించి రాజకీయాలలోకి వెళ్లి ఏకంగా సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఈయన ముఖ్యమంత్రి కావడంతో సినిమాలకు స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఒక టాలెంటెడ్ హీరో ఇండస్ట్రీకి దూరం అవ్వడం అనేది బాధాకరం. అయితే ఇప్పుడు విజయ్ బాటలోనే ధనుష్ కూడా వెళ్లబోతున్నారని విషయం తెలియడంతో సాయి పల్లవి ఆయన రాజకీయాలలోకి వెళ్లిన సినిమాలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇందులో మలయాల నటుడు మోహన్ లాల్ (Mohan Lal)కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
Also Read: గుండె నిండా గుడిగంటలు మనోజ్ నెల సంపాదన ఎంతో తెలుసా?