E-Paper
Advertisement

క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన మహీంద్రా XUV 3XO CNG.. ఎంత స్కోర్ సాధించిందంటే?

క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన మహీంద్రా XUV 3XO CNG.. ఎంత స్కోర్ సాధించిందంటే?
Advertisement

Mahindra XUV 3XO CNG Crash Test: మహీంద్రా XUV 3XO CNG కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) క్రాష్ టెస్టుల్లో ఈ SUVకి పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో 5 స్టార్ రేటింగ్ సాధించిన XUV 3XO.. ఇప్పుడు CNG మోడల్‌ లోనూ తన సేఫ్టీ సత్తా చాటుకుంది. ముఖ్యంగా పిల్లల భద్రతలో అదిరిపోయే స్కోర్ సాధించింది.

క్రాష్ టెస్టుల్లో సూపర్ స్కోర్లు

BNCAP పరీక్షల్లో మహీంద్రా XUV 3XO CNG పెద్దల భద్రతా (AOP) విభాగంలో 32 పాయింట్లకు 29.36 పాయింట్లు సాధించింది. పిల్లల ప్రొటెక్షన్(COP)లో 49 పాయింట్లకు 45 పాయింట్లు దక్కించుకుంది. దీంతో ఈ SUVకి పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. XUV 3XOను భారత్ NCAP తొలిసారిగా 2024 నవంబర్‌లో క్రాష్ టెస్ట్ చేసింది. అప్పట్లో పెట్రోల్, డీజిల్ వేరియంట్లు పిల్లల భద్రత విభాగంలో 43 పాయింట్లు సాధించాయి. ఇప్పుడు CNG మోడల్ 45 పాయింట్లతో మరింత మంచి రిజల్ట్స్ సాధించింది.

ప్రమాద సమయంలో మంచి రక్షణ

Advertisement

ఫ్రంటల్ క్రాష్ టెస్ట్‌ లో డ్రైవర్ తల, మెడ, నడుము, తొడలకు మంచి రక్షణ లభించింది. ఛాతీకి తగినంత రక్షణ ఉండగా, కాళ్లలోని టిబియా భాగానికి ఒకవైపు తగినంత, మరోవైపు నామమాత్రపు రక్షణ లభించింది. కో డ్రైవర్‌ కు మాత్రం పరీక్షించిన అన్ని శరీర భాగాల్లో మంచి రక్షణ లభించింది. సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్, సైడ్ పోల్ ఇంపాక్ట్ పరీక్షల్లోనూ XUV 3XO మంచి పనితీరు సాధించింది. ఈ రెండు పరీక్షల్లోనూ అన్ని శరీర భాగాలకు మంచి రక్షణ లభించించిది.

పిల్లల భద్రతలోనూ టాప్ స్కోర్

పిల్లల భద్రత విషయంలోనూ ఈ SUV ఆకట్టుకుంది. 18 నెలల చిన్నారి డమ్మీతో నిర్వహించిన ఫ్రంటల్ క్రాష్ టెస్టులో 8కి 8, సైడ్ క్రాష్ టెస్టులో 4కి 4 పాయింట్లు సాధించింది. మూడేళ్ల చిన్నారి డమ్మీతో నిర్వహించిన రెండు పరీక్షల్లోనూ పూర్తి పాయింట్లు దక్కించుకుంది. డైనమిక్ టెస్టులో 24కి 24, చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్ (CRS) ఇన్‌స్టాలేషన్ టెస్టులో 12కి 12 పాయింట్లు సాధించింది. వెహికల్ అసెస్‌మెంట్‌ లో మెరుగైన స్కోర్ రావడంతో మొత్తం COP స్కోర్ 45కి చేరింది.

భద్రతా ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Advertisement

మహీంద్రా XUV 3XO CNGలో ఆరు ఎయిర్‌ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రివర్సింగ్ కెమెరా లాంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్-స్పెక్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లెవెల్ 2 ADAS ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Read Also: దీపావళికి కారు కొంటున్నారా? ఈ 5 కార్లపై రూ.2.75 లక్షల డిస్కౌంట్లు!

Tags

Related News

దీపావళికి కారు కొంటున్నారా? ఈ 5 కార్లపై రూ.2.75 లక్షల డిస్కౌంట్లు!

మూడేళ్లకే ముగిసిన కథ.. 2027లో సైబర్‌ ట్రక్‌ ఉత్పత్తి బంద్..

హీరో ఎక్స్‌ ట్రీమ్ 125ఆర్ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. ధర ఎంత అంటే?

టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. కర్వ్ ఈవీపై ఏకంగా రూ.3.35 లక్షల ఆఫర్!

కర్ణాటకలో E20 పెట్రోల్ కల్తీ.. 20 శాతానికి బదులు 31% ఇథనాల్.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి!

మహీంద్రా నుంచి ఒకేసారి 3 కొత్త SUVలు.. మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

మారుతి కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. గ్రాండ్ విటారాపై ఏకంగా రూ.1.36 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×