Pan Cleaning: మహిళలు వంటకాలను తయారు చేయడం ఈజీగా అనిపించినప్పటికీ వండిన పాత్రలను క్లీన్ చేయడం కష్టం అనే చెప్పాలి. ప్రతి రోజు వంటలు చేస్తున్నప్పుడు వాడిన పాత్రలను శుభ్రం చేయడం పెద్ద టాస్క్. ముఖ్యంగా డీప్ ఫ్రై చేసినప్పుడు పాత్రలు మరింత నల్లగా మారతాయి. వీటిని తిరిగి తెల్లగా మార్చడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ముఖ్యంగా ప్యాన్ నల్లగా మరినప్పుడు సాధారణ డిష్ వాష్ బార్‌తో శుభ్రం చేయడానికి బదులుగా ఇంట్లోనే ఉండే కొన్ని రకాల పదార్థాలు వాడటం ముఖ్యం. మరి ఎలాంటి హోం రెమెడీస్ పాత్రలపై ఉన్న జిడ్డును త్వరగా తొలగించేందుకు ఉపయోగ పడతాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేడి నీటితో శుభ్రం చేయండి:
మీరు నల్లగా మారిన ప్యాన్ లేదా పాత్రలను శుభ్రం చేయడానికి సులభమైన మార్గాలలో ఒకటి ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఇప్పుడు మీరు క్లీన్ చేయాలని అనుకున్న పాత్రలో నీటిలో ఉంచండి. ఇది పాన్ మీద మిగిలి పోయి ఉన్న మొండి మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు రెగ్యులర్ గా మీరు వాడే సబ్బు, స్క్రబ్‌తో మురికి ఉన్న చోట రుద్దండి. ఇలా చేయడం వల్ల కొద్ది సేపటికే మీ ప్యాన్ మెరుస్తుంది. అంతే కాకుండా కొత్త దానిలాగా తయారవుతుంది.
ఉప్పుతో రుద్దడం:
ఉప్పు లేదా సోడియం క్లోరైడ్ మంచి స్క్రబ్బింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. నల్లగా మారిప పాత్రలపై డిష్ వాషింగ్ జెల్‌తో పాటు కొంచెం ఉప్పు చల్లి రుద్దండి. ఇదే కాకుండా దీనికి నిమ్మరసం లేదా వెనిగర్, ఉప్పుతో కలిపిని మిశ్రమాన్ని రుద్ది కాసేపు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత స్కబ్బర్‌తో శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల ఎంత నల్లగా ఉన్న ప్యాన్ అయినా తెల్లగా మెరిసిపోతుంది.
వంట సోడా:
వంట సోడా పాత్రల నుండి మొండి మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. సోడా పాత్రలను శుభ్రం చేయడానికి మంచి ఏజెంట్‌గా పరిగణించబడుతుంది. ప్యాన్ శుభ్రం చేయడానికి కొంచెం నీరు తీసుకుని అందులో బేకింగ్ సోడా వేయండి. తర్వాత ఈ మిశ్రమాన్ని మురికిగా ఉన్న పాత్రలపై రుద్దండి. కాసేపు వదిలేసి స్క్రబ్బర్‌తో శుభ్రం చేయండి. తరువాత పాన్ ని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
టమాటో కెచప్:
టమోటా కెచప్‌తో పాత్రలపై ఉండే కఠినమైన మరకలను తొలగించవచ్చ. ఇందుకోసం కాస్త టమాటో ప్యూరీని లేదా టమాటో ముక్కను తీసుకుని నల్లగా మారిన పాత్రలపై రుద్దండి. దీని తరువాత, 10-20 నిమిషాల తర్వాత ప్యాన్‌ను సాధారణ నీటితో శుభ్రం చేయండి. ఇప్పుడు ప్యాన్ కొత్తవాటిలాగా మెరిసిపోతుంది.
Also Read: రోజు రోజుకు జుట్టు పలచబడుతోందా ? కారణాలివే !
నిమ్మరసం:
నిమ్మరసం పాత్రలపై ఉన్న మరకలు, దుర్వాసనలను తొలగిస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ప్యాన్ ను నిమ్మరసం, నీరు కలిపి మరిగించిన నీటిలో చిన్న చిన్న వ్యర్థ పదార్థాలు తేలే వరకు ఉడకబెట్టడం, తరువాత దానిని కడిగి, సాధారణ డిష్ వాషింగ్ జెల్‌తో శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఎంత మురికిగా ఉన్న పాత్రలయినా తెల్లగా మెరిసిపోతాయి.