Hair Loss Reasons: ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. జుట్టు రాలడం ఒత్తిడికి కారణమవుతుంది. పురుషులు అయినా, స్త్రీలు అయినా, ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుండి బయట పడటానికి మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ట్రై చేసే వారు ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది.
ఇదిలా ఉంటే ముందుగా జుట్టు రాలడానికి గల కారణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. బలమైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం మనం తినే ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలని మర్చిపోతారు. మీరు కూడా జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతుంటే మాత్రం కొన్ని టిప్స్ తప్పకుండా పాటించాలి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో మీరు సహాయపడతాయి. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పోషకాహార లోపం:
మీ ఆహారంలో ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ డి , ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు లేకుంటే, జుట్టు రాలడాన్ని ఆపడం కష్టం. జుట్టుకు అవసరమైన పోషకాలు లేకపోవడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. అంతే కాకుండా ఇది జుట్టు మూలాల నుండి రాలడానికి కారణం అవుతుంది. జుట్టు ఆరోగ్యం మీ ఆహారంతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. శరీరం లోపలి నుండి పోషణ అందినప్పుడు మాత్రమే మీరు వాడే ఆయిల్స్ షాంపూలు మీకు ఉపయోగపడతాయి.
ఒత్తిడి:
జుట్టు రాలడానికి గల ప్రధాన కారణాలలో ఒత్తిడి ఒకటి. మీరు ఒత్తిడికి గురైనప్పుడు, శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది. ఒత్తిడి వల్ల కలిగే జుట్టు రాలడాన్ని నివారించడానికి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే సరిపోవు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి , ఒత్తిడిని తగ్గించడానికి, యోగా చేయడం , తగినంత నిద్ర చాలా ముఖ్యం.
ఆరోగ్య సమస్యలు:
కొన్నిసార్లు జుట్టు రాలడం అనేది అంతర్లీన ఆరోగ్య సమస్యకు కూడా సంకేతం కావచ్చు. డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లేదా స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు జుట్టు రాలడాన్ని పెంచుతాయి. ఇలాంటి సమయంలో ఎలాంటి హెయిర్ ఆయిల్స్, షాంపూలు పనిచేయవు. జుట్టు రాలడం ఎక్కువ కాలం పాటు కొనసాగితే మీరు డాక్టర్‌ని సంప్రదించి ఈ సమస్యకు చికిత్స పొందడం అవసరం.
హార్మోన్ల అసమతుల్యత:
జుట్టు రాలడానికి హార్మోన్ల అసమతుల్యత కూడా ఒక ప్రధాన కారణం. థైరాయిడ్ సమస్యలు, పిసిఒఎస్ లేదా మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పులు జుట్టు రాలడాన్ని పెంచుతాయి. జుట్టు రాలడం తగ్గాలంటే.. హార్మోన్ల సమస్యకు చికిత్స చేయించుకోవడం ముఖ్యం.
శస్త్రచికిత్స:
కొన్నిసార్లు సర్జరీల తర్వాత కూడా జుట్టు రాలే సమస్య ఎదుర్కోవలసి వస్తుంది. శస్త్రచికిత్స ఎంత పెద్దది, మందులు ఎంత కాలం వాడుతున్నారనే దానిపై జుట్టు రాలే సమస్య ఆధారపడి ఉంటుంది. అలాగే, ఆహారం యొక్క పోషక విలువలు కూడా జుట్టు రాలడాన్ని నిర్ణయిస్తుంది.
Also Read: జామ ఆకులను ఇలా వాడితే.. జన్మలో జుట్టు రాలదు !
హెయిర్ కేర్ ప్రొడక్ట్స్:
మార్కెట్లో అనేక రకాల షాంపూలు, ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అధిక మొత్తంలో రసాయనాలు ఉంటాయి. ఇవి జుట్టుకు హాని కలిగిస్తాయి. సల్ఫేట్లు, పారాబెన్లు , సిలికాన్లు వంటి రసాయనాలు జుట్టును బలహీనపరుస్తాయి . అంతే కాకుండా జుట్టు రాలడాన్ని పెంచుతాయి. దీంతో షాంపూ, కండిషనర్ లేదా హెయిర్ స్టైలింగ్ వస్తువులు కూడా జుట్టుకు హానికరం. అందుకే జుట్టు తగిన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ సెలక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం.