Rashmika Mandanna Remuneration :రష్మిక మందన్న (Rashmika Mandanna) .. ఈమధ్య కాలంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ‘యానిమల్’ సినిమాతోనే ఈ అమ్మడి అదృష్టం ఆకాశానికి తాకుతోంది అని చెప్పవచ్చు. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో.. రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా వచ్చిన ‘యానిమల్’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రష్మిక మందన్న.. గత ఏడాది వచ్చిన ‘పుష్ప 2’సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా రెండవ స్థానాన్ని సొంతం చేసుకుంది. అమీర్ ఖాన్ (Aamir Khan) ‘దంగల్’ స్థానాన్ని బ్రేక్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ సాధ్యపడలేదు..
Tamannaah : తమన్నా చేతికి చిక్కిపోయిన చరణ్, తారక్, బన్నీ… కానీ, డార్లింగ్ ఎస్కేప్…?
రెండు చిత్రాలతో రూ.2కోట్లు పెంచిన రష్మిక..
ఇక ఈ సినిమాల తర్వాత ఇటీవల వచ్చిన ‘ఛావా’ సినిమా కూడా భారీ విజయం సాధించింది. శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ (Vicky Kaushal), ఆయన భార్య ఏసు భాయ్ పాత్రలో రష్మిక మందన్న చాలా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్లో రూ.1000 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని డిమాండ్ పెరగడంతో.. మార్చి 7వ తేదీన తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తామని ప్రకటిస్తూ.. ఇటీవల ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఇలా వరుస సినిమాల బ్లాక్ బస్టర్ హిట్లతో రష్మిక మందన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు ఆ సినిమాలు ఇచ్చిన ఫలితాల కారణంగా.. రెమ్యునరేషన్ విషయంలో రష్మిక కూడా భారీగా డిమాండ్ చేస్తోంది.
సికిందర్ కోసం ఏకంగా రూ.5కోట్ల రెమ్యూనరేషన్..
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. రష్మిక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ (Salman Khan) తో కలిసి ‘సికందర్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కోసం రష్మిక రెమ్యునరేషన్ రూ.5 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా కంటే ముందు వచ్చిన యానిమల్, పుష్ప 2 చిత్రాలకి రూ.3 కోట్లు తీసుకుంది. ఈ రెండు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఏకంగా రూ.2 కోట్లు రెమ్యునరేషన్ పెంచేసి.. ఇప్పుడు ఏకంగా రూ.5 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రెండు చిత్రాలతోనే ఏకంగా రూ.2కోట్లు డిమాండ్ చేసి, ఇప్పుడు సల్మాన్ ఖాన్ మూవీ కోసం రూ.5కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరొకవైపు రష్మిక మందన్నకు ఉన్న క్రేజ్ కారణంగా నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధమయ్యారు అని తెలుస్తోంది.
రష్మిక మందన్న సినిమాలు..
ఇక రష్మిక మందన్న సికందర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్, థామా, పుష్ప 3, కుబేర వంటి చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఇక వీటన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి షూటింగ్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది రష్మిక. మొత్తానికి అయితే రష్మిక క్రేజ్ భారీగా పెరిగిపోయిందని చెప్పవచ్చు.