E-Paper
Advertisement

గుమ్మడికాయ అంటే ఇష్టం లేనివాళ్లు కూడా ఈ హల్వాను లొట్టలేసుకుంటూ తింటారు!

గుమ్మడికాయ అంటే ఇష్టం లేనివాళ్లు కూడా ఈ హల్వాను లొట్టలేసుకుంటూ తింటారు!
Advertisement

Pumpkin Halwa: సాధారణంగా గుమ్మడికాయతో పులుసు, కూరలు చేసుకుంటాం. కానీ అదే గుమ్మడికాయతో ఎంతో రుచికరమైన హల్వా కూడా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? తియ్యటి రుచితో, నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే మెత్తని ఆకృతితో ఉండే గుమ్మడికాయ హల్వా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. ఇంట్లో ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు లేదా భోజనం తర్వాత స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ హల్వాను సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని చేయడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. గుమ్మడికాయ, పంచదార, నెయ్యి ఉంటే చాలు.. ఎంతో రుచికరమైన స్వీట్ సిద్ధమవుతుంది.

కావాల్సిన పదార్థాలు:

తురిమిన గుమ్మడికాయ – రెండు కప్పులు
పంచదార – ఒక కప్పు
నెయ్యి – నాలుగు టేబుల్ స్పూన్లు
కాచి చల్లార్చిన పాలు – ఒక కప్పు
జీడిపప్పు – పది నుంచి పన్నెండు
కిస్మిస్ – ఒక స్పూన్
యాలకుల పొడి – అర టీస్పూన్
సన్నగా తరిగిన బాదం ముక్కలు – ఒక స్పూన్

తయారీ విధానం:

Advertisement

లేతగా ఉన్న గుమ్మడికాయను తీసుకుని పై తొక్క, లోపలి గింజలను పూర్తిగా తొలగించాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి గుమ్మడికాయను సన్నని తురుములా పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

అదే కడాయిలో మిగిలిన నెయ్యి వేసి, ముందుగా తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ తురుమును వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గుమ్మడికాయలోని పచ్చివాసన పోయే వరకు సుమారు 10 నిమిషాల పాటు బాగా వేయించాలి. గుమ్మడికాయ నెయ్యిలో మగ్గి కాస్త రంగు మారాక అందులో కాచి చల్లార్చిన పాలు పోయాలి. పాలు పోశాక మంటను తగ్గించి మూత పెట్టి గుమ్మడికాయ బాగా ఉడికేలా ఉంచాలి.

Advertisement

పాలు పూర్తిగా ఇంకిపోయి గుమ్మడికాయ మెత్తగా ఉడికిన తర్వాత అందులో పంచదార కలపాలి. పంచదార కరిగిన కొద్దిగా హల్వా మళ్లీ పల్చగా మారుతుంది కాబట్టి.. కలుపుతూనే ఉండాలి. పంచదార పాకం పూర్తిగా ఇంకిపోయి హల్వా దగ్గర పడే సమయానికి యాలకుల పొడి వేసి కలపాలి. హల్వా కడాయి అంచనాలను వదిలేసి కొద్దిగా నెయ్యి పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం ముక్కలు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే.. గుమ్మడికాయ హల్వా సిద్ధమైనట్టే.

Tags

Related News

కచ్చితమైన కొలతలతో మటన్ కచ్చి బిర్యానీ.. నోట్లో పెట్టగానే ముక్క వెన్నలా కరిగిపోద్ది!

బరువు తగ్గాలంటే రాత్రిపూట అన్నం మానేయాలా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

పిల్లలకు చిన్నవయసులోనే ఈ 5 విషయాలు నేర్పండి.. ఓటమి భయం ఎప్పుడూ ఉండదు

ఎప్పుడైనా ఆలోచించారా? చాక్లెట్ బార్లపై ఆ గడులు ఎందుకు ఉంటాయో, దీని వెనుక ఇంత కథ ఉందా?

మీ పార్ట్‌నర్‌కు హారర్ సినిమాలంటే ఇష్టమా? వారిలో ఈ మంచి లక్షణం ఉన్నట్లే

కొలెస్ట్రాల్, బీపీ నార్మల్‌గా ఉన్నా హార్ట్ ఎటాక్ రావచ్చు.. డాక్టర్ సూచించిన ఒక్క బ్లడ్ టెస్ట్ చేయండి

దీపావళి స్పెషల్.. అందరినీ ఆకట్టుకునే 7 బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇవే

Big Stories

Advertisement
×