E-Paper
Advertisement

నవ్వినా అవుట్‌… భయపడినా అవుట్‌… హాలోవీన్‌ హంగామాలో అన్‌స్టాపబుల్ కామెడీ

నవ్వినా అవుట్‌… భయపడినా అవుట్‌… హాలోవీన్‌ హంగామాలో అన్‌స్టాపబుల్ కామెడీ
Advertisement

Italian Comedy Show: ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న ‘ఎల్‌ఓఎల్’ (LOL) ఫ్రాంచైజీ నుంచి వచ్చిన లేటెస్ట్ హాలోవీన్ స్పెషల్ కామెడీ హంగామా ‘LOL Halloween Special’. ఇటలీకి చెందిన ప్రముఖ కమెడియన్లు, నటుల తారాగణంతో ప్రైమ్ వీడియో ఒరిజినల్స్ డైరెక్టోరియల్ టీమ్ తెరకెక్కించిన ఈ సిరీస్ తాజాగా విడుదలైంది. ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వులు పంచే పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్ ఈ ఇటాలియన్ వెబ్ సిరీస్. సాధారణంగా హాలోవీన్ అనగానే దెయ్యాలు, భయానక వాతావరణం గుర్తుకొస్తాయి. కానీ ఈ షోలో మాత్రం భయం బదులు నవ్వుల సునామీ సృష్టిస్తారు. మరి ఈ కామెడీ సిరీస్ ను చూసి కడుపుబ్బా నవ్వుకోవడానికి మీరు రెడీనా ?

షో వివరాలలోకి వెళ్తే…

ఇటలీకి చెందిన ప్రముఖ నటులను విభిన్నమైన హాలోవీన్ గెటప్ లలో ఒకే పెద్ద రూమ్‌ లో లాక్ చేస్తారు. ఈ గేమ్‌ లో రూల్స్ చాలా సింపుల్ కానీ చాలా స్ట్రిక్ట్. ఎవరైనా సరే మిగతా వాళ్ల జోకులకు, చేష్టలకు నవ్వితే గేమ్ నుంచి ఇన్‌స్టంట్‌ గా ఎలిమినేట్ అవుతారు. అలా చివరి వరకు నవ్వకుండా ఉండి, తమ నవ్వును కంట్రోల్ చేసుకుంటూ ఎవరు గెలుస్తారన్నదే ఈ షో మెయిన్ థీమ్. మధ్యలో వచ్చే సర్ప్రైజ్ ఎంట్రీలు, కమెడియన్లు చేసే విచిత్రమైన వేషధారణలు చూస్తే ఎవరికైనా కడుపు చెక్కలవ్వాల్సిందే. రొటీన్ థ్రిల్లర్లు, క్రైమ్ కథలు చూసి బోర్ కొట్టిన వాళ్లకు ఈ కామెడీ రైడ్ మంచి రిలాక్సేషన్‌ను ఇస్తుంది.

Advertisement

అయితే ఈ హాలోవీన్ స్పెషల్‌ లో అసలైన ట్విస్ట్ ఏంటంటే… ఈసారి నవ్వకుండా ఉండటమే కాదు, భయపడకుండా కూడా ఉండాలి. సాధారణంగా కామెడీ షోల్లో ఇతరులను నవ్వించేందుకు కమెడియన్లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎదుటి వారిని నవ్వించడంతో పాటు భయపెట్టే ఛాలెంజ్ కూడా ఉంటుంది. పోటీదారులు నాలుగు గంటల పాటు తమ ముఖంలో ఎలాంటి నవ్వు కనిపించకుండా, భయానికి కూడా స్పందించకుండా ఉండాలి. మొదట నవ్వినా లేదా భయపడినా ఎల్లో కార్డు పడుతుంది. మరోసారి అదే జరిగితే రెడ్ కార్డుతో గేమ్ నుంచి బయటకు వెళ్లాల్సిందే.

ఈ ప్రత్యేక ఎడిషన్‌ లో మాసియో కపటోండా, కాటియా ఫోలెసా, లూసియా ఒకొనే, హెర్బర్ట్ బల్లెరినా, బ్రెండా లోడిజియాని, ఆండ్రియా పిసాని పోటీపడతారు. వీరంతా గతంలోనూ ‘LOL’ షోలో పాల్గొన్న కమెడియన్లే. వీళ్లకు నవ్వులు పంచడం కొత్త కాకపోయినా, ఈసారి భయాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాల్సి రావడం గేమ్‌ ను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. చీకట్లో జరిగే సంఘటనలు, విచిత్రమైన పాత్రల ఎంట్రీలు, ఊహించని సర్ప్రైజ్‌లు పోటీదారుల సహనానికి పరీక్ష పెడతాయి.

Advertisement

మరో ప్రత్యేక ఆకర్షణ గియాలప్పాస్ బ్యాండ్ కామెంటరీ. జార్జియో గెరార్దూచి, మార్కో సాంటిన్ తమ కామెంట్స్‌తో షోలోని ప్రతి రియాక్షన్‌ ను మరింత ఫన్నీగా మారుస్తారు. ఇక లిల్లో పెట్రోలో రాక్షసులతో నిండిన ఓ వింత ఏజెన్సీ సీఈవో పాత్రలో కనిపిస్తూ పోటీదారులను భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. చివరి వరకు నవ్వకుండా, భయపడకుండా నిలబడిన విజేతకు లక్ష యూరోల ప్రైజ్ మనీ దక్కుతుంది. అయితే ఆ మొత్తాన్ని విజేత తనకు నచ్చిన స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ ?

ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అక్టోబర్ 23న విడుదలైంది. మొత్తం మూడు ఎపిసోడ్లతో ఈ ఇటాలియన్ కామెడీ షో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అధికారిక వివరాల్లో ఇటాలియన్ భాష మాత్రమే ఉంది. హారర్ వాతావరణంతో కూడిన కామెడీ, సెలబ్రిటీల ఫన్నీ రియాక్షన్లు, నవ్వు ఆపుకోవాల్సిన ఛాలెంజ్‌లు ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాయి. ఈ హాలోవీన్ స్పెషల్ మంచి టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్.

Read Also: నవలల్లో రాసిన నిధి కోసమే రచయిత్రి కిడ్నాప్‌… అడవిలోకి వెళ్ళాక ఒక్కొక్కరికీ చుక్కలు

Related News

వందల ఏళ్ల రాజభవనం.. అప్పులపాలైన రాజవంశం… వైభవం నుంచి పతనం వరకు కంటతడి పెట్టించే మాస్టర్ పీస్

ఓటీటీ విడుదలకు సిద్ధమైన సీఎం కొడుకు ఫస్ట్ సినిమా!

ఓడలో అమ్మాయిలనే టార్గెట్ చేసే కిల్లర్… 2000ల మందిలో హంతకుడు ఎవరు ?

ఒకే ఒక్క రాంగ్ డెసిషన్ తో బతుకు బస్టాండ్… గ్యాంగ్‌స్టర్లు, పోలీసుల మధ్య ఇరుక్కున్న కుర్రాళ్ల కథ

 ఎమ్మెల్యే కూతురితో ప్రేమ… తుపాకి మోతలతో రక్తపాతం… అమెజాన్ ప్రైమ్‌లో రచ్చ లేపుతున్న కొత్త క్రైమ్ సిరీస్

స్మార్ట్‌ఫోన్లో చిక్కుకుపోయే సీఈవో… ఊహించని ట్విస్టులతో సాగే కొరియన్ థ్రిల్లర్

కాళీ శాపం… పాముకాట్లతో వరుస మరణాలు… మైండ్ బ్లాక్ చేసే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూశారా?

Big Stories

Advertisement
×