Sigma OTT Release: థియేటర్లలో విడుదలైన సినిమాలన్నీ నెల రోజుల వ్యవధిలోని తిరిగి డిజిటల్ మీడియాలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ మొదటి వారంలో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ కూడా ప్రస్తుతం ఓటీటీలలో విడుదల తేదీలను లాక్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్(Tamilanadu cm Vijay) కుమారుడు సంజయ్(Sanjay) ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. సంజయ్ డైరెక్షన్లో సిగ్మా(Sigma) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సందీప్ కిషన్(Sandeep Kishan), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)హీరో హీరోయిన్లుగా నటించిన సిగ్మా సినిమా అక్టోబర్ రెండవ తేదీ థియేటర్లలో తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నప్పటికీ విడుదలైన తర్వాత ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విజయ్ కుమారుడు సంజయ్ డైరెక్టర్గా తన మొదటి సినిమాతో కాస్త నిరాశ ఎదుర్కొన్నారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యి నాలుగు వారాలు పూర్తి కావడంతో డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Net flix) కైవసం చేసుకున్నారు. ఇక ఈ సినిమాని అక్టోబర్ 30వ తేదీ నుంచి తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళ భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. మరి థియేటర్లలో మెప్పించ లేకపోయినా సిగ్మా ఓటీటీలలో ఎలాంటి ఆదరణను సొంతం చేసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. సందీప్ కిషన్ ఇటీవల కాలంలో నటిస్తున్న సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను నిరాశపర్చాయి. సిగ్మా సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఈ సినిమా కూడా నిరాశను మిగిల్చింది.
గురు (సందీప్ కిషన్) తన తల్లి నుంచి వారసత్వంగా వస్తున్న లైబ్రరీని నడిపిస్తూనే మరోవైపు యూట్యూబ్లో స్టోరీ టెల్లర్ గా ఫేమస్ అవడం కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. మరోవైపు తన తండ్రి చేసిన అప్పుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఇలా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న గురు తన ఇంటిని కాపాడుకోవడం కోసం ఒక రాత్రిలోనే రూ.1.25 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి. డబ్బు కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో క్యాసినో డ్రగ్స్ పేరుతో డబ్బులు దోచుకుంటున్న విన్సెంట్ (శివ పండిట్)అనే గ్యాంగ్ స్టర్ నేరాలకు సంబంధించిన ఒక పెన్ డ్రైవ్ దొరుకుతుంది. మరి గురు ఆపెన్ డ్రైవ్ ఆధారంగా డబ్బులను డిమాండ్ చేశారా? ఈ డబ్బు సంపాదించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? గురు తన ఇంటిని కాపాడుకున్నారా? అనే అంశాలతో ఈ సినిమా కొనసాగుతుంది.
Also Read: చిరంజీవి ‘మెగా వర్స్’ షూటింగ్ నేడే ప్రారంభం.. ఫస్ట్ గెస్ట్ లు వీళ్ళే!