E-Paper
Advertisement

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో స్మాల్ చేంజెస్.. సీఎం రేవంత్ నిర్ణయం!

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో స్మాల్ చేంజెస్.. సీఎం రేవంత్ నిర్ణయం!
Advertisement

Invest Telangana: డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026. దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ రంగాల నిపుణులు హాజరయ్యే అంతర్జాతీయ సదస్సు. ఈసారి ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ప్రధాన థీమ్‌తో పాటు ‘క్లైమేట్ ఛేంజ్’ను ప్రత్యేక సబ్ థీమ్‌గా చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ మార్పులపై ఈ ప్రత్యేక సెమినార్ నిర్వహించాలని, వాతావరణ శాఖ నిపుణులతో పాటు వివిధ యూనివర్సిటీలు, సంబంధిత రంగాల్లో పని చేసే నిపుణులను సదస్సుకు ఆహ్వానించాలని సూచించారు.

ఎల్‌నినో..

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో తలెత్తుతున్న సవాళ్లు, వాటిని ఎదుర్కొనేందుకు వివిధ దేశాలు చేపడుతున్న చర్యలు, అనుసరిస్తున్న విధానాలపై ఈ వేదికగా ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. ప్రధానంగా వర్షాభావం, నీటి కొరత, వ్యవసాయ సంక్షోభం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విద్యుత్ అవసరాలు, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై దృష్టి పెట్టనున్నారు.

Advertisement

Also read: ఆలోచన లేకుండా అప్పులు చేసిన మేధావి కేసీఆర్: మహేష్ కుమార్ గౌడ్

సీఎం సూచనలు..

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన ముందస్తు చర్యలను ప్రపంచ వేదికపై వివరించే అవకాశం ఉందని, ఇతర దేశాల్లో విజయవంతమైన విధానాలు, ఆధునిక సాంకేతిక పరిష్కారాలు, అంతర్జాతీయ అనుభవాలను అధ్యయనం చేసేలా సెమినార్ నిర్వహించాలని సీఎం సూచనలు చేశారు. పెట్టుబడుల ఆకర్షణతో పాటు పర్యావరణ అనుకూల పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధి అంశాలకు సదస్సులో ప్రాధాన్యంత ఇవ్వాలన్నారు.

న్యూఢిల్లీలో గ్లోబల్ సమ్మిట్..

Advertisement

గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా రక్షా ఎక్స్‌పో–2026, ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్‌ల ప్రదర్శనలు, పారిశ్రామిక విధానాల ఆవిష్కరణలు, పెట్టుబడి భాగస్వామ్య ఒప్పందాలకు వేదిక కావాలన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో రక్షా ఎక్స్‌పో కర్టెన్ రైజర్ నిర్వహణ. అక్టోబర్ 29న న్యూఢిల్లీలో గ్లోబల్ సమ్మిట్ ప్రచార కార్యక్రమం. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలను తెలంగాణకు ఆహ్వానించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణలు రూపోందిస్తుంది.

Also read: చంద్రబాబు, పవన్‌లది అలీబాబా ఇద్దరు దొంగల పాలన: పేర్ని నాని

Tags

Related News

23 ఏళ్ల యువకుడి ఖతర్నాక్ సైబర్ దందా.. చివరికి ఎలా దొరికాడంటే?

ఆలోచన లేకుండా అప్పులు చేసిన మేధావి కేసీఆర్: మహేష్ కుమార్ గౌడ్

ప్రేమ పేరుతో మోసం.. ఖమ్మంలో ప్రియుడి ఇంటి ముందు బాధితురాలి ధర్నా!

‘అర్నబ్’ తుపాన్ ఎఫెక్ట్.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైళ్లు రద్దు!

ఉప్పల్‌లో భారీ చోరీ.. 30 తులాల బంగారం, రూ.6 లక్షలు అపహరణ!

మహిళలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ కుట్టు మిషన్ల స్కీమ్‌పై మంత్రి పొన్నం కీలక అప్‌డేట్!

విలువ లేనోడు రాజీనామా చేస్తే ఏంటి ఉపయోగం? హరీష్ రావుకు అద్దంకి మాస్ కౌంటర్!

Big Stories

Advertisement
×