E-Paper
Advertisement

బరువు తగ్గాలంటే రాత్రిపూట అన్నం మానేయాలా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

బరువు తగ్గాలంటే రాత్రిపూట అన్నం మానేయాలా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
Advertisement

Eating rice at night for weight loss| బరువు తగ్గాలని నిర్ణయించుకున్న వెంటనే చాలామంది ముందుగా చేసే పని అన్నం (రైస్) తినడం మానేయడం! ముఖ్యంగా రాత్రిపూట అన్నం తింటే బరువు పెరుగుతారని భావించి చపాతీలు లేదా ఇతర ఆహార పదార్థాలను ఎంచుకుంటారు. అయితే అన్నం తినడం వల్లే బరువు పెరుగుతారా? బరువు తగ్గాలంటే రాత్రి భోజనంలో అన్నం పూర్తిగా పక్కన పెట్టాలా? పోషకాహార నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుంటే ఈ సందేహాలకు సమాధానం లభిస్తుంది.

రాత్రిపూట అన్నం తింటే బరువు పెరుగుతారా?

పోషకాహార నిపుణురాలు రూపాలి దత్తా ప్రకారం.. రాత్రిపూట అన్నం తినడం వల్ల మాత్రమే బరువు పెరగరు. రోజంతా తీసుకునే కేలరీలు, శరీరం ఖర్చు చేసే శక్తి బరువు కంట్రోల్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే క్రమంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అన్నం తినే సమయం కంటే మొత్తం ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలి.

అన్నం తినేటప్పుడు పరిమాణాన్ని నియంత్రించండి

Advertisement

బరువు తగ్గాలనుకునేవారు రైస్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే ఎంత పరిమాణంలో తింటున్నారనే విషయం ముఖ్యం. రూపాలి దత్తా ఒక భోజనానికి సుమారు అర కప్పు నుంచి ఒక కప్పు ఉడికించిన అన్నాన్ని సూచిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరి అవసరాలు, శారీరక శ్రమను బట్టి సరైన పరిమాణం మారవచ్చు. అన్నంతో పాటు పప్పు, పనీర్ లేదా చికెన్ వంటి ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోండి. కూరగాయలను కూడా భోజనంలో చేర్చుకోండి. ఇలా చేయడం వల్ల సమతుల్యమైన ఆహారం తీసుకోండి.

బరువు తగ్గాలంటే రైస్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు

ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ కూడా బరువు తగ్గడానికి అన్నాన్ని పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదని చెప్పారు. స్థానికంగా లభించే బియ్యాన్ని సమతుల్యమైన భోజనంలో భాగంగా తీసుకోవాలని సూచించారు. సింగిల్ పాలిష్డ్ లేదా చేతితో ప్రాసెస్ చేసిన బియ్యం రకాలను కూడా పరిశీలించండి. రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోవడానికి ముందు రెండు గంటల విరామం ఉంచాలని ఆమె సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారమైనప్పటికీ అతిగా తినకుండా జాగ్రత్తపడాలి.

Advertisement

Also Read: పాలు, పెరుగు ద్వారా రేబిస్ వస్తుందా? వైరస్ వ్యాప్తి గురించి ఈ విషయాలు తెలుసుకోండి

రాత్రిపూట రైస్ లేదా చపాతీ ఏది తినడం మంచిది?

బరువు తగ్గాలనుకునేవారు చాలామంది అన్నానికి బదులుగా చపాతీలను ఎంచుకుంటారు. అయితే పోషకాహార నిపుణురాలు కవితా దేవగన్ అభిప్రాయం ప్రకారం.. అన్నం, చపాతీ రెండింటినీ సమతుల్యమైన ఆహారంలో చేర్చుకోవచ్చు.
మీ జీర్ణక్రియ, ఆహారపు అలవాట్లు, తీసుకునే పరిమాణాన్ని బట్టి సరైన ఎంపిక చేసుకోవాలి. ఒకదానిని పూర్తిగా మంచిదిగా, మరొకదానిని చెడ్డదిగా భావించకూడదు.

Also Read: దీపావళి వేళ బాణాసంచా ప్రమాదాలు.. కేవలం రూ.11కే ఇన్సూరెన్స్.. రూ.25,000 వరకు కవరేజ్

బరువు తగ్గాలంటే ఈ ఆహారపు అలవాట్లు పాటించండి

రాత్రిపూట అన్నం తినడం వల్లే బరువు పెరుగుతారని భావించడం సరికాదు. రోజంతా తీసుకునే ఆహారం, కేలరీలు, ఆహార పరిమాణం వంటి అంశాలు ముఖ్యమైనవి. అన్నంతో పాటు ప్రోటీన్ పదార్థాలు, కూరగాయలు తీసుకోండి. అతిగా తినకుండా చూసుకోండి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయండి.

Related News

పిల్లలకు చిన్నవయసులోనే ఈ 5 విషయాలు నేర్పండి.. ఓటమి భయం ఎప్పుడూ ఉండదు

ఎప్పుడైనా ఆలోచించారా? చాక్లెట్ బార్లపై ఆ గడులు ఎందుకు ఉంటాయో, దీని వెనుక ఇంత కథ ఉందా?

మీ పార్ట్‌నర్‌కు హారర్ సినిమాలంటే ఇష్టమా? వారిలో ఈ మంచి లక్షణం ఉన్నట్లే

కొలెస్ట్రాల్, బీపీ నార్మల్‌గా ఉన్నా హార్ట్ ఎటాక్ రావచ్చు.. డాక్టర్ సూచించిన ఒక్క బ్లడ్ టెస్ట్ చేయండి

దీపావళి స్పెషల్.. అందరినీ ఆకట్టుకునే 7 బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇవే

చాణక్య నీతి.. సమాజంలో గౌరవం పొందాలంటే ఈ 5 పనులు చేయండి

పేపర్ స్ట్రా లు నిజంగా మంచివేనా.. దక్షిణ కొరియా అధ్యయనంలో తేలిన సంచలనాలివే?

Big Stories

Advertisement
×