E-Paper
Advertisement

సామాన్యుడికి సైతం పోలీసుల ప్రోటోకాల్.. వలిగొండలో అరుదైన ఘటన!

సామాన్యుడికి సైతం పోలీసుల ప్రోటోకాల్.. వలిగొండలో అరుదైన ఘటన!
Advertisement

Onsite FIR: స్వేచ్ఛ బ్యూరో: ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే స్పందించి సహాయం చేయడం పోలీస్ శాఖ బాధ్యత అని మరోసారి నిరూపించారు వలిగొండ పోలీసులు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని స్థితిలో ఉన్న బాధితుడి వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఘటన వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో..

మంగళవారం సుమారు 11:00 గంటల సమయంలో ఎం.తుర్కపల్లి గ్రామానికి చెందిన ఉడుత నరసింహ అనే వ్యక్తి తనను తన గ్రామానికి చెందిన మర్రి చంద్రయ్య అనే వ్యక్తి కర్రతో కొట్టగా, గాయపడిన అతను ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా హాస్పిటల్ వారు మెడికల్ లీగల్ సర్టిఫికెట్ కోసం పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా అతను పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇవ్వలేని పరిస్థితిలో ఉండగా వెంటనే వలిగొండ ఎస్‌.ఐ. యుగేందర్ గౌడ్ ఆదేశాల మేరకు, ఏఎస్ఐ జాఫర్, టెక్ టీమ్ కానిస్టేబుల్స్ అనిల్, శంకర్, మహిళ కానిస్టేబుల్ సింధుతో పాటు సంఘటన స్థలానికి స్వయంగా వెళ్లి బాధితుడిని పరామర్శించి, అతని నుండి ఫిర్యాదును స్వీకరించారు.

Advertisement

Also read: ముగిసిన ప్రచార పర్వం.. ఏప్రిల్ 9న కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్నికల పోలింగ్

ఎస్ఐ యుగేందర్ గౌడ్..

బాధితుడి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, న్యాయం ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో సంఘటన స్థలంలోనే ఆన్-సైట్ ఎఫ్‌.ఐ.ఆర్ నమోదు చేసి, కేసును బిఎన్ఎస్ చట్టం ప్రకారం నమోదు చేశారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నా కూడా ప్రజలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని ఈ ఘటన ద్వారా స్పష్టంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ యుగేందర్ గౌడ్ మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు ప్రజల భద్రత కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అవసరమైన సందర్భాల్లో పోలీసులు స్వయంగా ప్రజల వద్దకే వెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని అన్నారు. ఈ సంఘటన పోలీసులు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారో, ప్రజల సమస్యలను ఎంత బాధ్యతగా తీసుకుంటారో చూపించే మంచి ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Also read: బిల్డర్‌ని బెదిరించి బీజేపీ కార్పొరేటర్ వసూళ్ల దందా..!

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×