Horror Thriller OTT: హర్రర్, సస్పెన్స్ జోనర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్‌కు సోనీలివ్ మరో ఆసక్తికరమైన చిత్రాన్ని అందిస్తోంది. అదే ‘ఇమ్మోర్టల్’ (Immortal). ఈ తమిళ మూవీ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఒక అందమైన అమ్మాయి సిటీ మధ్యలో ఉన్న లగ్జరీ ఫ్లాట్‌లో ఓ యువకుడికి తక్కువ అద్దెకు గది ఇస్తుంది. పైకి చూడ్డానికి అంతా ప్రశాంతంగా, మోడర్న్‌గా కనిపించే ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత అతడికి షాక్ తగులుతుంది.
సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం… ఓ గిరిజన గ్రామంలో జరిగిన వింత సంఘటనతో సినిమా మొదలవుతుంది. ఆ గ్రామంలో ఓ బిడ్డ జననం వెనుక భయంకరమైన అతీంద్రియ శక్తి ఉంటుంది. ఆ సంఘటనకు సంబంధించిన రహస్యం కాలం గడిచినా అలాగే ఉండిపోతుంది. ఆ తర్వాత కథ ప్రస్తుత కాలానికి మారుతుంది. మాగి ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పని చేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల అతను కొత్త ఇల్లు వెతుక్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో సింధు అనే అందమైన యువతి పరిచయమవుతుంది. ఆమె తన లగ్జరీ అపార్ట్‌మెంట్ లో ఓ గదిని చాలా తక్కువ అద్దెకు ఇస్తానని చెబుతుంది. ఇంత మంచి ఇల్లు తక్కువ అద్దెకు దొరకడంతో మాగి వెంటనే అక్కడికి మారిపోతాడు.
అయితే అక్కడికి వెళ్లిన తర్వాత మాగి జీవితంలో కొన్ని వింత పరిణామాలు మొదలవుతాయి. మొదట సింధుతో అతనికి పరిచయం పెరుగుతుంది. ఆ తర్వాత ఆమెపై ప్రేమ కూడా కలుగుతుంది. కానీ సింధు ప్రవర్తనలో కనిపించే కొన్ని మార్పులు, ఆమె చుట్టూ జరిగే సంఘటనలు మాగిని అనుమానంలో పడేస్తాయి. ఆమె గురించి తెలుసుకోవాలని ప్రయత్నించిన కొద్దీ అతడికి భయంకరమైన నిజాలు తెలుస్తుంటాయి. ఇంతకీ సింధు ఎవరు? ఆమెకు వెయ్యేళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధం ఏంటి ? ఆమె దగ్గరకు వెళ్లిన పురుషులకు ఎదురవుతున్న ప్రమాదాల వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? ఆమె వలలో చిక్కుకున్న మాగి ప్రాణాలతో బయటపడేందుకు ఏం చేశాడు ? అనేదే మిగతా కథ.
‘ఇమ్మోర్టల్’ సినిమా అక్టోబర్ 30 నుంచి సోనీలివ్ (SonyLIV)లో స్ట్రీమింగ్ అవుతోంది. జి.వి. ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar), కయాదు లోహర్ (Kayadu Lohar) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను… దర్శకుడు Mariyappan Chinna ప్రేమ, మిస్టరీ, హర్రర్ అంశాలను కలిపి ఈ సినిమాను తెరకెక్కించారు. రొమాన్స్‌తో పాటు అతీంద్రియ శక్తుల నేపథ్యం ఉన్న హర్రర్ సినిమాలను ఇష్టపడేవాళ్లు ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వొద్దు. ముఖ్యంగా ఈ మూవీని తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ… ఇలా మొత్తం ఐదు భాషల్లో చూడొచ్చు. ఆ అందమైన అమ్మాయి వెనుక దాగున్న భయంకరమైన రహస్యాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్లు ఈ వీకెండ్‌లో సినిమాను ట్రై చేయొచ్చు.
Read Also: హాస్టల్‌లో అమ్మాయిలు మిస్సింగ్… గుర్రంపై తలలేని మొండెం… వైరల్ హారర్ సిరీస్ వచ్చేసిందోచ్